మీ కారణంగానే ఇప్పుడు ఇక్కడ ఉన్నాను.. రష్మిక ఎమోషనల్
సినిమా రంగంలో ఎన్నో విమర్శలు, ట్రోల్స్, సవాళ్లు ఎదురైనా కూడా రష్మిక ఏ రోజూ వెనకడుగు వేయలేదు. తనకు ఈ జర్నీలో తోడుగా ఉన్న అభిమానులను ఉద్దేశించి ఆమె తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు.

రష్మిక మందన్నా
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటిస్తూ.. అభిమానుల హృదయాలను గెలుచుకుంది. నేషనల్ క్రష్ గా మారింది. రష్మిక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తన అభిమానులను ఉద్దేశించి ఆమె ఓ పోస్టు పెట్టారు. రష్మిక పోస్టు చాలా ఎమోషనల్ గా ఉండటం విశేషం.
రష్మిక ఎమోషనల్..
ఈ 9 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం గురించి స్పందిస్తూ రష్మిక చాలా ఎమోషనల్ అయ్యారు. తన విజయానికి పూర్తి క్రెడిట్ అభిమానులకే ఇచ్చారు. ‘ నేను ఈ రోజు ఇక్కడ ఇలా ఉన్నాను అంటే మీరే కారణం. మీ ప్రేమ, ఆశీస్సులు, సపోర్టు లేకపోతే ఈ విజయం సాధ్యమయ్యేది కాదు. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నన్ను కూతురిలా, సోదరిలా, స్నేహితురాలిలా ప్రేమించారు. ఆ ప్రేమే నన్ను ప్రతిరోజూ మరింత బాగా పనిచేసేలా ప్రోత్సహిస్తుంది.నా ప్రతి ఒడిదొడుకులో మీరు నాతో ఉన్నారు. మీ ఈ నిస్వార్థ ప్రేమకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది.
రష్మిక జర్నీ..
'కిరిక్ పార్టీ' నుంచి 'యానిమల్' వరకు:
కన్నడ బ్లాక్‌బస్టర్ 'కిరిక్ పార్టీ'తో సినీ రంగ ప్రవేశం చేసిన రష్మిక , ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. 'అంజనీపుత్ర', 'చమక్' సినిమాలతో కన్నడిగుల మనసు గెలుచుకుని, ఆ తర్వాత తెలుగులో 'గీత గోవిందం', 'పుష్ప' చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగింది. ఇటీవల బాలీవుడ్ 'యానిమల్' సినిమా విజయంతో రష్మిక క్రేజ్ మరింత పెరిగింది. సినిమా రంగంలో ఎన్నో విమర్శలు, ట్రోల్స్, సవాళ్లు ఎదుర్కొన్నా రష్మిక ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదు. మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తూ వచ్చింది.
రష్మిక పెళ్లి...
రష్మిక చాలా కాలంగా హీరో విజయ్ దేవర కొండతో ప్రేమలో ఉన్నారు. రీసెంట్ గానే వీరి ఎంగేజ్మెంట్ జరిగినట్లు ప్రచారం జరిగింది. ఇక.. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సమాచారం. ఫిబ్రవరి 26వ తేదీన ఉదయ్ పూర్ లోని ఓ ప్యాలెస్ లో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అయితే, అధికారిక ప్రకటన రాలేదు.

