Rashmika Mandanna: రష్మిక ఎప్పుడూ నవ్వుతూనే ఎందుకు ఉంటుందో తెలుసా?
Rashmika Mandanna: రీసెంట్ గా తమ్మ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక.. త్వరలో గర్ల్ ఫ్రెండ్ మూవీతో రానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో ఆమె బిజీగా ఉంది. దీనిలో భాగంగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Rashmika
నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి పరిచయం అవసరం లేదు. వరస సినిమాలతో దూసుకుపోతోంది. కేవలం ఈ 2025లోనే రష్మిక ఐదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అంటే... ఆమె ఎంత బిజీగా ఉందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీలో తన కెరీర్ ని ప్రారంభించిన ఈ బ్యూటీ... ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది.
వైరల్ వీడియో...
మీరు గమనించారో లేదో... రష్మికను ఎప్పుడూ చూసినా నవ్వుతూనే ఉంటుంది. బయట ఇంటర్వ్యూలకు వచ్చినా, ప్రమోషన్స్ కి వెళ్లినా.. ఆమె ముఖంలో చిరునవ్వు మాత్రం అలానే ఉంటుంది. అలా ఉండటానికి వెనక కారణాన్ని ఆమె రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.
‘ ఎవరైనా మనతో మంచిగా ఉంటే, చాలా మంది వాళ్లను నమ్మరు. బదులుగా, వారు మన నుంచి ఏదో ఆశిస్తున్నారని అనుమానిస్తూ ఉంటారు. వారి ఉచ్చులో పడకూడదని జాగ్రత్తపడుతూ ఉంటారు.’ కానీ... తాను మాత్రం అలా ఆలోచించను అని రష్మిక చెప్పడం విశేషం.
రష్మిక వ్యక్తిత్వం...
‘నేను ఎప్పుడూ నా ముఖంలో చిరు నవ్వు ఉంచుకుంటాను. ఎందుకంటే, నా వల్ల ఎవరూ తమ ముఖంలో నవ్వు కోల్పోకూడదని నేను అనుకుంటాను. ప్రతి ఒక్కరికీ వేల కొద్దీ సమస్యలు ఉన్నాయనే విషయం నాకు తెలుసు. నేను స్పెషల్ ఎదుటివారి జీవితంలో మరో సమస్యగా మారాలని అనుకోను. అందుకే ఎప్పుడూ నవ్వుతూ ఉంటాను’ అని రష్మిక చెప్పింది.
రష్మిక మాటలకు నెటిజన్లు ఫిదా
రష్మిక మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో రష్మిక మాట్లాడిన మాటలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఆమె వ్యక్తిత్వం చాలా గొప్పది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రపంచానికి ఆమె సినిమాలు, డైలాగులు, ప్రేమకథలు, ఎంగేజ్మెంట్, బ్రేకప్ వంటి అంశాలు మాత్రమే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ, తెర వెనక ఆమె.. గొప్ప మనుసున్న వ్యక్తి అని ఈ వీడియో ద్వారా అర్థమౌతోంది.
మనం తరచూ ఇతరుల గురించి విన్నదాని ఆధారంగా అభిప్రాయాలు ఏర్పరుచుకుంటాం. కానీ ప్రతి ఒక్కరి, జీవితంలో మనకు తెలియని బాధలు, పరిస్థితులు, కారణాలు ఉంటాయి. అవి మనకు కనిపించకపోయినా, వాళ్లు వాటిని ఎదుర్కుంటూనే ఉంటారు. అందుకే, రష్మిక చెప్పినట్లు.. మనం ఎవరికైనా మరొక సమస్యగా మారకూడదు. వాళ్ల ముఖంలో చిరనవ్వు తీసేయకుండా, చిన్న సానుభూతితో, మంచితనంతో వ్యవహరించాలి.