పెళ్లికి ముందే కోట్లు వదిలించుకున్న రష్మిక మందన్న, ట్యాక్స్ ఎంత కట్టిందో తెలుసా?
త్వరలో స్టార్ హీరో విజయ్ దేవరకొండ ను పెళ్లి చేసుకోబోతోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. వరుస సినిమాలతో దూసుకుపోతోంది స్టార్ హీరోయిన్.. చేతి నిండా సంపాదిస్తోంది. పెళ్లికి ముందు ఆమె కోట్ల రూపాయల ట్యాక్స్ లు కూడా కట్టింది.

నేషనల్ క్రష్ గా ఎదిగిన రష్మిక
వెండితెరపై మెరిసే తారలు చాలామంది ఉంటారు. కానీ తెర వెనుక కూడా బాధ్యతగల పౌరులుగా ఉండేవారు కొందరే. 'పుష్ప' నుంచి 'యానిమల్' వరకు తన నటనతో.. కట్టిపడేసిన రష్మిక ఇప్పుడు కొత్త రికార్డుతో అందరి దృష్టిని ఆకర్షించారు. కన్నడాలో సాధారణ హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న.. ఇండస్ట్రీకి వచ్చి కొంత కాలానికే.. సొంత జిల్లాలోనే అత్యధిక పన్ను చెల్లించే స్థాయికి ఎదిగి చూపించింది.
4.69 కోట్లు పన్ను చెల్లించిన రష్మిక..
రష్మిక మందన్న నటిగానే కాకుండా బాధ్యతగల పౌరురాలిగా కూడా తన పాత్ర పోషిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాలకు గాను ఆమె రూ.4.69 కోట్లు ఆదాయపు పన్ను చెల్లించినట్లు సమాచారం. దీంతో కొడగు జిల్లాలో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా ఆమె మొదటి స్థానంలో నిలిచారు. రష్మిక మందన్న ఎల్‌ఎల్‌పి అనే తన సంస్థ పేరు మీద ఈ పన్నులు చెల్లిస్తున్నారు.
రష్మిక మందన్న రెమ్యునరేషన్..
త్వరలో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండను పెళ్లాడబోతోంది రష్మిక మందన్న. రీసెంట్ గా వీరి ఎంగేజ్మెంట్ సీక్రెట్ గా జరిగింది. ఈక్రమంలో భారీగా పన్ను చెల్లించి.. కోట్ల రూపాయిలు వదిలేసుకుంది బ్యూటీ. ప్రస్తుతం రష్మిక ఒక్కో సినిమాకు 10 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
రష్మిక మందన్న ఆస్తులు..
యానిమల్, పుష్ప 2 తర్వాత రష్మిక మందన్న మార్కెట్ భారీగా పెరిగింది. సినిమాలు, యాడ్స్ తో పాటు తన సంపాదన ను తండ్రి చేస్తున్న బిజినెస్ లలో పెట్టుబడి పెట్టి.. కోట్లు సంపాదిస్తోంది. భారీగా ఆస్తులు కూడా కూడబెట్టింది రష్మిక. బెంగళూరులో రూ.8 కోట్ల బంగ్లా, ముంబై, హైదరాబాద్, గోవా, కొడగులో ఆస్తులు కొన్నారు. తండ్రితో కలిసి వ్యాపారాలు కూడా చేస్తోంది.
బొమ్మలు కొనడానికి కూడా డబ్బులు లేక..
ముందు ముందు రష్మిక చెల్లించే మొత్తం పన్ను మరింత పెరిగే అవకాశం ఉంది. చిన్నప్పుడు బొమ్మలు కొనడానికి కూడా డబ్బులు లే కష్టపడ్డానన్న రష్మిక, ఇప్పుడు జిల్లాలోనే టాప్ ట్యాక్స్‌పేయర్‌గా ఎదగడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. కొడగులో ఎందరో ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఉన్నా, చిన్న వయసులోనే రష్మిక వారిని మించిపోవడం విశేషం.

