- Home
- Entertainment
- మహేష్ బాబు ని ఫోన్ చేసి మరీ తిట్టిన పొలిటీషియన్ ఎవరో తెలుసా ? సూపర్ స్టార్ కు ఆయనంటే ఎందుకంత భయం?
మహేష్ బాబు ని ఫోన్ చేసి మరీ తిట్టిన పొలిటీషియన్ ఎవరో తెలుసా ? సూపర్ స్టార్ కు ఆయనంటే ఎందుకంత భయం?
సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఫోన్ చేసి మరీ తిట్టేంత చనువు ఉన్న బడా పొలిటికల్ లీడర్ ఎవరో తెలుసా? ఆ సినిమా బాగోలేదు.. ఎందుకు చేశావ్.. అని మహేష్ ని కోపగించుకున్న లీడర్ ఎవరు?

మహేష్ బాబు రూటే సెపరేటు..
టాలీవుడ్ స్టార్ హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. కేవలం తెలుగు సినిమాలతోనే ఆయన ఇండియా వైడ్ గా పాపులారిటీని సంపాదించాడు. ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేసే మహేష్.. ఆ సినిమాతో అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టే ప్రయత్నం చేస్తుంటాడు. ఈక్రమంలో కొన్ని సార్లు మహేష్ బాబు రాంగ్ స్టెప్ వేసి.. డిజాస్టర్లు ఫేస్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి సినిమాల్లో ఆగడు, బ్రహ్మోత్సవం లాంటి సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్న మహేష్ బాబు.. గత చిత్రం గుంటూరు కారం మిక్స్డ్ టాక్ తో కూడా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే..
సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు మహేష్ బాబు. ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ఏడాదికి 20 సినిమాలు రిలీజ్ చేసిన రికార్డు ఉంటే.. మహేష్ బాబు మాత్రం ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తూ వెళ్తున్నాడు. ఒక్కొక్క సారి ఆ సినిమా కూడా రావడం కష్టమే. అందుకే మహేష్ బాబు హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి 25 ఏళ్లు దాటినా.. ఇంకా 30 సినిమాలు కూడా కంప్లీట్ అవ్వలేదు. తన ఇమేజ్ కు సెట్ అయ్యే కథలు సెలెక్ట్ చేసుకుని.... చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తుంటాడు సూపర్ స్టార్. ఆయన సక్సెస్ సీక్రెట్ కూడా అదే. కానీ ఎంత జాగ్రత్తగా ఉన్న మహేష్ బాబుకు కూడా డిజాస్టర్ల బాధ తప్పలేదు.
మహేష్ బాబు కెరీర్ లో డిజాస్టర్లు..
అంత జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటూ వెళ్లినా.. మహేష్ కెరీర్ లో కూడా భారీ డిజాస్టర్లు తప్పలేదు.. ఒక హిట్టు పడితే.. రెండు ప్లాప్ లు వచ్చిన సందర్భాలు కూడా లేకపోలేదు. టక్కరిదొంగ, నిజం, నాని, సైనికుడు, ఆగడు, బ్రహ్మోత్సవం, ఇలా మహేష్ కెరీర్ లో డిజాస్టర్లు ఎన్నో. యావరేజ్ ఫిల్మస్ కూడా కొన్ని ఉన్నాయి. వాటి కథల విషయంలో మహేష్ బాబు అంచనాలు పనిచేయలేదు. దాంతో భరత్ అనే నేను సినిమాతో మహేష్ బాబు కంప్లీట్ గా మారిపోయాడు. ఈసినిమా నుంచి వరుసగా హిట్లు కొడుతూ.. ఏడేళ్లలో ఒక్క ప్లాప్ కూడా లేకుండా చూసుకున్నాడు. అయితే భరత్ అనే నేను సినిమా టైమ్ లోనే.. మహేష్ బాబు ఓ పొలిటికల్ లీడర్ గురించి మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి.
మహేష్ బాబుని ఫోన్ చేసిన మరీ తిట్టిన కేటీఆర్ ?
సూపర్ స్టార్ మహేష్ బాబును ఓ స్టార్ పొలిటికల్ లీడర్ ఫోన్ చేసి మరీ తిట్టాడట. తన మూవీ రిలీజ్ అయితే.. ఆయన ఏమంటాడా.. అని మహేష్ బాబు ఎప్పుడూ భయపడుతూ ఉంటాడట. ఇంతకీ మహేష్ ను భయపెట్టిన ఆ పొలిటీషియన్ ఎవరో కాదు మాజీ మంత్రి కేటీఆర్. గతంలో భరత్ అనే నేను మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో మహేష్ బాబు ఈ విషయాలను స్వయంగా వెల్లడించారు. ఈ ఈవెంట్ లో కేటీఆర్, మహేష్ బాబు, కొరటాల శివ పాల్గొన్నారు. ఆ సమయంలోనే మహేష్ ఈ విషయం చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. మహేష్ బాబు మాట్లాడుతూ.. ''కేటీఆర్ నాకు బెస్ట్ ఫ్రెండ్. ఆయన నా సినిమాలు చూసిన వెంటనే ఫోన్ చేసి తన అభిప్రాయం చెపుతాడు. బాగుంటే బాగుందని లేకుంటే.. ఇలాంటి సినిమా ఎలా చేశావు అని ముఖంమీదే అనేస్తాడు. ఆగడు మూవీ చూసి నాకు ఫోన్ చేసి తిట్టారు. ఇలాంటి చెత్త సినిమాలు ఇంకోసారి చేయకు అన్నాడు.. అది నాకు ఇప్పటికీ గుర్తుంది.. '' అని మహేష్ బాబు అన్నారు.
కేటీఆర్ స్పూర్తితో చేసిన పాత్ర..
మహేష్ బాబు మాట్లాడుతూ.. ''కేటీఆర్ లాగా అంత హానెస్ట్ గా తన అభిప్రాయం చెప్పిన వ్యక్తిని నేను ఇంత వరకూ చూడలేదు. నా సినిమా రిలీజ్ అయితే.. కేటీఆర్ ఏంటా అనే భయం ఉంటుంది.. ఇప్పుడు చేసిన భరత్ అనే నేను మూవీలో నా రోల్ డిజైన్ చేయడంలో కేటీఆర్ ని స్ఫూర్తిగా తీసుకున్నాం. కేటీఆర్ లైఫ్ స్టైల్ కి కొంచెం దగ్గరగా, భరత్ అనే నేను మూవీలో నా క్యారెక్టర్ ఉంటుంది. '' అని మహేష్ అన్నారు. ఈ ఈ వెంట్ లోనే మహేష్ బాబు కేటీఆర్ ను సర్ అని సంబోధించగా.. నన్ను సర్ అనకు కాల్ మీ రామ్... నువ్వు సర్ అంటే.. నేనేద పెద్దోడిని అయిపోయిన ఫీలింగ్ వస్తుంది అని కేటీఆర్ మహేష్ బాబుతో సరదాగా అన్నారు. వీరిద్దరి మధ్య ఇంత స్నేహం ఉందా అని..అప్పుడు అభిమానులంతా షాక్ అయ్యారు.
వారణాసితో పాన్ ఇండియా మార్కెట్ లోకి మహేష్ బాబు..
ప్రస్తుతం మహేష్ బాబు తన 29వ సినిమాగా వారణాసి చేస్తున్నాడు. రాజమౌళి డైరెక్షన్ లో పాన్ ఇండియా సినిమాగా ఇది తెరకెక్కుతోంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మొదటి సారి.. దాదాపు 1500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈసినిమా రూపొందుతోంది. ఈసినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్ లోకి మహేష్ బాబు ఎంటర్ అవ్వబోతున్నాడు. 50 ఏళ్ల వయసులో కూడా సూపర్ స్టార్ కుర్ర హీరోలా మెరిసిపోతున్నాడు. హాలీవుడ్ లుక్ తో అదరగొడుతున్నాడు. ఈసినిమాతో ఆయన ఇమేజ్ ఏరేంజ్ కి వెళ్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో మలయాళ స్టార్ ప్రిథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు.

