- Home
- Entertainment
- Gossips
- మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య సంచలన నిర్ణయం.. తెరపైకి ఫ్లాప్ సినిమాల దర్శకుడి పేరు, నిజమెంత..?
మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య సంచలన నిర్ణయం.. తెరపైకి ఫ్లాప్ సినిమాల దర్శకుడి పేరు, నిజమెంత..?
నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు వారికి నిరాశే ఎదురౌతుంది. ఒక సినిమా స్టార్ట్ అయ్యి క్యాన్సిల్ అయ్యింది.. ఇక ఈసారి తనయుడి ఎంట్రీ విషయంలో బాలయ్య సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీపై చర్చ..
నందమూరి కుటుంబ వారసుడిగా, నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీపై చాలా కాలంగా టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. అభిమానులు చాలా కాలంగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు రీసెంట్ గా ఓ ప్రాజెక్ట్ ను ప్రకటించారు అనుకుంటే.. అది కూడా అటకెక్కింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూను ప్లాన్ చేశాడు బాలయ్య.. కానీ ఏం జరిగిందో ఏంటో.. సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే టైమ్ కు.. కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. ఈ సినిమాను బాలయ్య కూతురు తేజస్వీ నిర్మించాలని అనుకున్నారు.
మోక్షజ్ఞ లుక్స్ లో భారీ మార్పులు..
మోక్షజ్ఞ అరంగేట్రంపై గత కొన్ని సంవత్సరాలుగా రకరకాల ఊహాగానాలు నడుస్తూనే ఉన్నాయి. ప్రశాంత్ వర్మ సినిమా రాబోతోంది అని తెలిసిన తరువాత మోక్షజ్ఞలో చాలా మార్పులు కనిపించాయి. గతంలో చాలా బొద్దుగా.. ఫ్యాటీగా కనిపించిన కుర్ర హీరో.. ఈసినిమా కోసం స్లిమ్ గా మేకోవర్ అయ్యాడు.. చాలా హ్యాండ్సమ్ గా తాయారయ్యాడు. ఈ లుక్ చూసి... బాలయ్య అభిమానులు దిల్ ఖుష్ అయ్యారు. మోక్షజ్ఞను వెండితెరపై ఎలా చూడాలనుకున్నారో... అలాంటి లుక్ లో అతను కనిపించేసరికి అభిమానులు పండగ చేసుకున్నారు. కానీ ఆతరువాత సినిమా పై ఎటువంటి అప్ డేట్ రాకపోవడంతో.. మళ్లీ నిరాశలోకి వెళ్లిపోయారు.
మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య సంచలన నిర్ణయం..?
తాజా సమాచారం ప్రకారం, మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి సంబంధించి బాలకృష్ణ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆలస్యం చేయకుండా, సరైన సమయంలో సరైన లాంచ్ ఇవ్వాలన్న బాలయ్య అనుకుంటున్నారట. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా బాధ్యతలను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి చేతిలో పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. చారిత్రక నేపథ్యం ఉన్న కథతో ఎమోషన్స్, యాక్షన్ మేళవింపుతో.. మోక్షజ్ఞ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడట క్రిష్. అయితే ఈ విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే కమర్షియల్ సినిమాలు కాకుండా.. కంటెంట్ బేస్డ్ మూవీస్ చేసే క్రిష్.. మోక్షజ్ఞ ను నందమూరి అభిమానులు మెచ్చేలా చూపించగలడా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఈ విషయంలో నిజం ఎంతో తెలియాల్సిఉంది.
2026 లో మోక్షజ్ఞ సినిమా వస్తుందా?
ఇటీవల మోక్షజ్ఞకు సంబంధించిన లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడం కూడా ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. గతంలో కాస్త బరువుగా కనిపించిన మోక్షజ్ఞ, ఇప్పుడు పూర్తిగా ఫిట్ అండ్ స్టైలిష్ లుక్‌లో దర్శనమిస్తున్నారు. ఈ మార్పు చూసిన అభిమానులు ఆయన అరంగేట్రం సాధారణంగా ఉండదని భావిస్తున్నారు. స్టార్ కిడ్ అయినప్పటికీ, కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే దర్శకుడితో తొలి సినిమా చేయాలని మోక్షజ్ఞ అనుకుంటున్నాడట. ఈ ఏడాది ఆరంభంలోనే క్రిష్–మోక్షజ్ఞ సినిమా సెట్స్‌పైకి వెళ్లేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాను 2026 ఏడాది చివరి నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట. మరి ఇందులో ఎంత వరకూ నిజం అవుతుందో చూడాలి.

