రామ్ చరణ్ - బుచ్చిబాబు సినిమా టైటిల్ ఫిక్స్.. ? బాలేదంటున్న మెగా ఫ్యాన్స్.. ఇంతకీ ఎంటా టైటిల్..?
గేమ్ ఛేంజర్ ప్లాప్ తో.. బుచ్చిబాబు సినిమాపై మెగా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈక్రమంలో ఈసినిమా టైటిల్ పై ఫ్యాన్స్ ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఈమూవీ టైటిల్ ఏంటో తెలుసా..?

మెగా పవర్ స్టార్.. గ్లోబల్ హీరో రామ్ చరణ్.. రీసెంట్ గా గేమ్ ఛేంజర్ సినిమాతో ఫ్యాన్స్ ను పలుకరించిన సంగతి తెలిసిందే. అయితే ఈసినిమా ప్లాప్ గా నిలిచి అందరికి నిరాశపరిచింది. ఆరేళ్ళ తరువాత సోలో హీరోగా వచ్చిన రామ్ చరణ్ కు పెద్ద నిరాశ ఎదురయ్యింది. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న రామ్ చరణ్ కు ఈసినిమా పెద్ద మైనస్ గా మారింది. కియారా అద్వాని హీరోయిన్ గా నటించిన ఈసినిమా కనీసం సంగం కలెక్షన్లు కూడా సాధించలేకపోయింది.
Also Read: గేమ్ ఛేంజర్ ఫ్లాప్ కు పవన్ కళ్యాణ్ కు సంబంధం ఏంటి..? యాంటీ ఫ్యాన్స్ ఏం చెపుతున్నారంటే..?

ఈక్రమంలో రామ్ చరణ్ నెక్ట్స్ మూవీతో అయినా ఫామ్ లోకి రావాల్సి ఉంది. ఈక్రమంలో ఆడియన్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ కళ్ళన్నీ ఈసినిమాపైనే ఉన్నాయి. బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఆర్ సి 16 మూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. అయితే ఈమూవీకి సబంధించిన అప్ డేట్స్ కూడా వరుసగా వస్తున్నాయి.
Also Read: అఖండ 2 లో బాలయ్య సెంటిమెంట్ హీరోయిన్..?
Ram Charan Buchi Babu
అయితే ఆర్ సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో నిర్మించబడుతున్న ఈసినిమాకు టైటిల్ ను ఖరారు చేసినట్టు తెస్తోంది. ఈసినిమా టైటిల్ గురించి మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈసినిమాకు పెద్ది అనే టైటిల్ పెట్టబోతున్నట్టు సమాచారం. అయితే ఇది అంతగా బాగోలేదు అన్నారట ఫ్యాన్స్. అయితే ఇప్పుడు ఇలానే ఉంటుంది వినగా వినగా అంతా మారిపోతుంది అని అంటున్నారు మేకర్స.
Also Read: విరాట్ కోహ్లీ మరదలు.. టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ అని మీకు తెలుసా..?
అయితే గతంలో కూడా రామ్ చరణ్ డీ గ్లామర్ రోల్ చేసిన రంగస్థలం సినిమాకు కూడా టైటిల్ బాగోలేదు అన్న మాటలు వినిపించాయి, కాని ఆ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.
ఇక ఈక్రమంలో పెద్ది టైటిల్ నుఅఫీషియల్ గా మాత్రం అనౌన్స్ చేయలేదు కాని.. దాదాపు ఇది పిక్స్ అయినట్టే అని టాలీవుడ్ టాక్. అంతే కాదు ఈసినిమాను ఎంత వీలు ఉంటే అంత త్వరగా కంప్లీట్ చేసి.. ఈఏడాది దసరా వరకూ రిలీజ్ చేయాలని పట్టుదలతో ఉన్నారట టీమ్.
Also Read: కొత్త అవతారం ఎత్తిన రష్మిక మందన్న.. మహారాణి లుక్ లో మెరిసిపోతుందిగా
రామ్ చరణ్ కు సూపర్ హిట్ ఇవ్వగలిగితే.. బుచ్చిబాబు రేంజ్ మరో రేంజ్ లోకి వెళ్ళిపోతుంది అందులో డౌట్ లేదు. అంతే కాదు ఈసినిమా షూటింగ్ కూడా సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెండు షెడ్యుల్స్ అయిపోయినట్టు సమాచారం. ఇక ఈ వారంలోనే మూడోషెడ్యుల్ షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారట.
Also Read:రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా నుంచి గూస్ బంమ్స్ అప్‌డేట్.. RC16 స్టోరీలో కీలక పాయింట్ లీక్?
మరి టీమ్ అనుకున్నట్టు దసరా వరకూ రిలీజ్ చేస్తారా లేదా..? ఈమూవీ పాన్ ఇండియాను సంతోషపెడుతుందా లేదా..? రామ్ చరణ్ పరిస్థితి ఏంటో ముందు ముందు చూడాలి. ఇక ఈసినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. స్టార్ కాస్ట్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. కాని కాస్ట్ కు సబంధించి పూర్తి సమాచారం లేదు. కాని కన్నడ స్టార్ హీరో శివన్న మాత్రం ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారట.