అఖండ 2 లో బాలయ్య సెంటిమెంట్ హీరోయిన్..? కలిసి వస్తుందని పెట్టారా, ఎవరామె..?
బాలయ్య అఖండ 2 అద్భుతం చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఎదరుచూస్తున్నారు. ఈక్రమంలో అఖండ సీక్వెల్ కు సబంధించి షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వగా.. ఈ సినిమాకు సబంధించి రకరకాల వార్తలు వైరల్అవుతూ వస్తున్నాయి. తాజాగా బాలయ్య సెంటిమెంట్ కు సబంధించి ఓ విషయం వైరల్ అవుతోంది.

చాలా కాలంగా వరుస ఫ్లాప్ లు చూసిన నందమూరి నటసింహం బాలకృష్ణ.. అఖండ సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. అలా అప్పటి నుంచి వరుసగా నాలుగు సినిమాలు.. బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. బాలయ్య ఇమేజ్ మళ్ళీ అమాంతం పెరిగిపోయింది. అంతే కాదు 100 కోట్ల సినిమాలు వరుసగా చేస్తూ వస్తున్నాడు బాలయ్య. హ్యాట్రిక్ ను కూడా దాటి నాలుగు సినిమాలతో సూపర్ సక్సెస్ అయ్యాడు బాలకృష్ట.
Also Read: విరాట్ కోహ్లీ మరదలు.. టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ అని మీకు తెలుసా..?

Balakrishna, Daaku Maharaaj, Akhanda
రీసెంట్ గా డాకు మహరాజ్ కూడా ఇదే రేంజ్ లో హిట్ కొట్టింది. ఇక ప్రస్తుతం అదే జోష్ తో దూసుకుపోతున్న బాలకృష్ణ, తన సినిమాలకు ఊతం అందించిన అఖండ సినిమాకు సీక్వెల్ స్టార్ట్ చేశారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న అఖండ 2 – తాండవం పై ఫ్యాన్స్ లో భారీగా ఆవశలు ఉన్నాయి.
బాలయ్య – బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో చూశాం. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తోన్న అఖండ 2 తాండవం షూటింగ్ అలా స్టార్ట్ అయ్యిందో లేదో అంచనాలు ఆకాశంలోకి వెళ్లిపోయాయి.
ఇక ఈ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా..? ప్రపంచంలోనే పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగరాజ్ మహా కుంభమేళాలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు ఈసారి ఈసినిమాలో క్యారెక్టర్స్ కోసం భారీ ఎత్తున స్టార్ కాస్ట్ ను రంగంలోకి దింపబోతున్నాడట బోయపాటి. అందులో బాలయ్య సూచనలమేరక కూడాకొంత మందిని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఈ వార్త నిజం అయితే.. దాదాపు 35 ఏళ్ల తరువాత బాలకృష్ణ, శోభన కాంబోలో సినిమా రాబోతోంది. ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకోబోతున్నారు. ఇక శోభన విషయానికి వస్తే.. దాదాపు 18 ఏళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆమె ప్రభాస్ ‘కల్కి’ సినిమా తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఈసినిమాలో మరియమ్ పాత్రతో అద్భుతం చేశారు శోభన. మరి గతంలో బాలయ్యకు హిట్ ఇచ్చిన హీరోయిన్ సెంటిమెంట్ ఇప్పుడు మరోసారి అఖండ 2కు ఎంత వరకు కలిసి వస్తుందో ? చూడాలి.
ఇక ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారు లేదు అనేది తెలియడంలేదు. రకరకాలు పేర్లు మాత్రం వైరల్ అవుతున్నాయి ఈ ఈ మూవీలో హీరోయిన్ గా ప్రగ్య జైశ్వాల్ పేరు ఖరారయ్యింది. అయితే మిగతా పాత్రల విషయంలో బోయపాటి, బాలయ్య కాంబో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అని అంతా ఆసక్తిగా గమిస్తుండగా.. బాలయ్య తన సినిమా కోసం ఓల్డ్ హీరోయిన్ ను రంగంలోకి దింపబోతున్నాడట. తనకుఎంతో సెంటిమెంట్ గా భావించే ఓ హీరోయిన్ ను ఈసినిమాలో ఇంపార్టెంట్ రోల్ కు తీసుకోవాలి అనుకున్నాడట.
అయితే ఆమె ఎవరో కాదు మాజీ హీరోయిన్ శోభన. అవును శోభన బాలయ్య కలిసి నారి నారి నడుమ మురారి మూవీలో నటించారు. ఈసినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేుద. ఇక ఈసినిమాలో సీనియర్ హీరోయిన్ శోభన ఓ సన్యాసి పాత్రలో కనిపించబోతున్నారట. మరి ఈవిషయంలో నిజం ఎంతో తెలియదు కాని.. వార్త మాత్రం వైరల్ అవుతోంది.