MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • Home
  • Entertainment
  • రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు సినిమా నుంచి గూస్‌ బంమ్స్ అప్‌డేట్‌.. RC16 స్టోరీలో కీలక పాయింట్‌ లీక్‌?

రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు సినిమా నుంచి గూస్‌ బంమ్స్ అప్‌డేట్‌.. RC16 స్టోరీలో కీలక పాయింట్‌ లీక్‌?

రామ్‌ చరణ్‌ ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న `ఆర్‌సీ16` చిత్ర షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. ఈ మూవీ స్టోరీకి సంబంధించిన కీలక పాయింట్‌ లీక్‌ అయ్యింది. 
 

Aithagoni Raju | Published : Jan 21 2025, 06:19 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
#RC16

#RC16

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఇటీవలే `గేమ్‌ ఛేంజర్‌`తో చేదు అనుభవాన్ని చవిచూశారు. కొందరు కావాలని ఈ సినిమాని చంపేసినట్టు తెలుస్తుంది. దారుణమైన నెగటివ్‌ ప్రచారం సినిమా డిజాస్టర్‌ కి కారణమైందని చెప్పొచ్చు. దాన్నుంచి బయటపడుతున్న రామ్‌ చరణ్‌ ఇప్పుడు మరో సినిమాపై ఫోకస్‌ పెడుతున్నారు. `ఉప్పెన` ఫేమ్‌ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. `ఆర్‌సీ16` వర్కింగ్‌ టైటిల్‌ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. 

25
Asianet Image

ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభమైన ఈ మూవీ ఇప్పుడు మరో షెడ్యూల్ కి రెడీ అవుతుంది. ఈ నెల 27 నుంచి మూడో షెడ్యూల్‌ హైదరాబాద్‌లో స్టార్ట్ కాబోతుందట. ఇందులో రామ్‌ చరణ్‌ పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది.

ఇటీవలే జగపతిబాబు ఈ మూవీకి సంబంధించి తన లుక్ ని విడుదల చేశారు. ఆయన సరికొత్త లుక్‌లో కనిపిస్తారని, ఫస్ట్ టైమ్‌ మేకప్‌ వేసుకునే పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. ఆయన కొత్త మేకోవర్‌లోకి మారబోతున్నారు. 
 

35
Rc16

Rc16

ఇక ఈ మూవీకి సంబంధించిన సరికొత్త అప్‌ డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్‌లో సాగుతుందనే విషయం తెలిసిందే. క్రికెట్‌ ప్రధానంగా సాగుతుందట. క్రికెట్‌ మాత్రమే కాదు, మిగిలిన ఆటలు కూడా ఉంటాయని తెలుస్తుంది.

ఇందులో కన్నడ స్టార్‌ హీరో శివ రాజ్‌ కుమార్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆయన మాస్టర్‌(ట్రైనర్‌)గా కనిపిస్తారని సమాచారం. ఆయన పాత్ర బలంగా ఉంటుందని తెలుస్తుంది. 

45
Asianet Image

అదే సమయంలో సినిమా కూడా మల్టీ స్పోర్ట్స్ ఫిల్మ్ అని, ఇందులో ఎమోషనల్‌ డ్రామా హైలైట్‌గా నిలుస్తుందని తెలుస్తుంది. అదే సినిమాకి బ్యాక్‌ బోన్‌ అని అంటున్నారు దర్శకుడు బుచ్చిబాబు. ఉత్తరాంధ్ర బ్యాక్‌ డ్రాప్‌లో రా అండ్‌ రస్టిక్‌గా సినిమా సాగుతుందన్నారు. అయితే ఇందులో సిగరేట్‌ పాత్ర కీలకంగా ఉంటుందట.

మరి ఆ సిగరేట్‌ అలవాటు హీరోకి ఉంటుందా? అది కథని మలుపుతిప్పుతుందా? అనేది తెలియాల్సి ఉంది. రత్నవేల్‌ కెమెరామెన్‌గా పనిచేస్తున్న ఈ మూవీకి ఆస్కార్‌ విన్నర్‌ రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే పాటల కంపోజింగ్‌ కూడా స్టార్ట్ చేశారు. 
 

55
Jonhvi Kapoor

Jonhvi Kapoor

`ఆర్‌సీ16` వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందే ఈ చిత్రాన్ని సుకుమార్‌ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సతీష్‌ కిలారు మెయిన్‌ నిర్మాత అని తెలుస్తుంది. నేడు ఆయన ఇంటిపై కూడా ఐటీ రైడ్స్ జరిగినట్టు సమాచారం.

ఇక ఈ మూవీని శరవేగంగా పూర్తి చేసి దసరాకిగానీ, లేదంటే డిసెంబర్‌లోగానీ విడుదల చేయాలని టీమ్‌ భావిస్తుంది. ఇందులో రామ్‌ చరణ్‌ సరసన జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటిస్తుంది. 
read more:వెంకటేష్‌ సరికొత్త రికార్డు, `సంక్రాంతికి వస్తున్నాం` కలెక్షన్ల సునామీ.. చిరు, బన్నీ రికార్డులకు ఎసరు!

also read: గేమ్ ఛేంజర్ ఫ్లాప్ కు పవన్ కళ్యాణ్ కు సంబంధం ఏంటి..? యాంటీ ఫ్యాన్స్ ఏం చెపుతున్నారంటే..?

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
జాన్వీ కపూర్
 
Recommended Stories
Top Stories