కొత్త అవతారం ఎత్తిన రష్మిక మందన్న.. మహారాణి లుక్ లో మెరిసిపోతుందిగా
ఇప్పటి వరకూ రష్మిక మందన్నను గ్లామర్ పాత్రలోనే చూసి ఉంటారు. హాట్ హాట్ గా కనిపించిన ఈ బ్యూటీ.. తాాజా లుక్ అందరికి ఆశ్చర్యపరుస్తోంది. కొత్త అవతారంలో ఈ కన్నడ కస్తూరి అద్భుతంగా మెరిపిసోతోంది. ఇంతకీ ఏ సినిమాలోనిది ఈ గెటప్.

రష్మిక మందన్న లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రం ఛత్రపతిలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటిస్తున్నాడు. సంభాజీ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈసినిమాలో మహారాణి యేసుబాయిగా రష్మిక కనిపించబోతోంది. ఇక మహారాణి పాత్రలో రాజరికపు లుక్ లో రష్మికా మాందన్న అందరిని ఆకట్టుకుంది.
ఛత్రపతి చిత్రం నుండి రష్మిక మందన్న తన మొదటి లుక్ పోస్టర్‌లను ఆవిష్కరించారు, ఇందులో ఆమె మహారాణి యేసుబాయిగా నటిస్తున్నారు. చీర, ఆభరణాలతో ఆమె మహారాణి గెటప్ లో ఆమె మెరిసిపోతోంది. మహారాణి యేసుబాయిని "స్వరాజ్యపు గర్వం" అని ఆమె పోస్ట్ చేసింది. ఇక ఈసినిమా ట్రైలర్ జనవరి 22న రిలీజ్ కాబోతోంది.
Also Read: విరాట్ కోహ్లీ మరదలు.. టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ అని మీకు తెలుసా..?
ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఛత్రపతి చారిత్రాత్మక చిత్రం రూపొందింది. విక్కీ కౌశల్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, అక్షయ్ ఖన్నా, అశుతోష్ రానా, దివ్య దత్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read:అఖండ 2 లో బాలయ్య సెంటిమెంట్ హీరోయిన్..?
సంభాజీ మహారాజ్ పాత్రకి న్యాయం చేయగలనా అని తాను మొదట్లో ఆందోళన చెందినట్లు విక్కీ కౌశల్ వెల్లడించారు. కానీ ఆ పాత్ర చాలా ఆసక్తికరంగా అనిపించింది. మరాఠా సామ్రాజ్యం యొక్క సంస్కృతి, చరిత్ర, విలువలను అన్వేషించడానికి ఈ పాత్ర తనకు ఎలా సహాయపడిందో ఆయన వివరించారు.
Also Read:గేమ్ ఛేంజర్ ఫ్లాప్ కు పవన్ కళ్యాణ్ కు సంబంధం ఏంటి..? యాంటీ ఫ్యాన్స్ ఏం చెపుతున్నారంటే..?
లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన, దినేష్ విజన్ నిర్మించిన ఛత్రపతి చిత్రం ఫిబ్రవరి 14, 2025న థియేటర్లలో విడుదల కానుంది. మరాఠా చరిత్రను గొప్పగా చూపించనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో ఈమూవీ రాబోతోంది.