- Home
- Entertainment
- మోహన్ బాబు కి గర్వం చాలా ఎక్కువ.. మంచు లక్ష్మి, విష్ణు ముందే.. స్టార్ డైరెక్టర్ సంచలన కామెంట్స్
మోహన్ బాబు కి గర్వం చాలా ఎక్కువ.. మంచు లక్ష్మి, విష్ణు ముందే.. స్టార్ డైరెక్టర్ సంచలన కామెంట్స్
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో మోహన్ బాబు ఒకరు.. అందరికంటే డిఫరెంట్ గా ఆలోచిస్తుంటాడు కలెక్షన్ కింగ్.. ఆయనతో మాట్లాడాలంటేనే అందరు భయపడుతుంటారు. అటువంటి స్టార్ ని ఓ ఈవెంట్ లో.. మోహన్ బాబుకు గర్వం చాలా ఎక్కువ అని అన్న స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

మోహన్ బాబు రూటే సెపరేట్..
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలంతా ఒకటైతే.. మోహన్ బాబు ఇమేజ్ మాత్రం సెపరేట్. ఆయన ఆలోచనా విధానం, మాట, వ్యవహార శైలీ.. అందరికంటే భిన్నంగా ఉంటుంది. ముక్కుసూటితనానికి బ్రాండ్ అంబాసిడర్ మోహన్ బాబు. అందరు ఒక వైపు ఉంటే.. ఆయన మాత్రం సెపరేట్ గా ఆలోచిస్తుంటారు. ఈక్రమంలోనే మోహన్ బాబు తన కెరీర్ లో ఎన్నో వివాదాలను ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎన్నో వివాదాలను ఆయన సృష్టించాడు కూడా. మోహన్ బాబు ఏది మాట్లాడినా.. అది ట్రోలింగ్ మెటీరియల్ గా మారుతుంటుంది. నెట్టింట్లో మంచు ఫ్యామిలీని గట్టిగా ట్రోల్ చేస్తుంటారు నెటిజన్లు. అలా ట్రోల్ చేసేవారిపై కేసులు కూడా పెట్టారు మంచు స్టార్స్.
ముక్కుసూటి గా చెప్పడం అలవాటు..
మోహన్ బాబు మాటతీరు సూటిగా ఉంటుంది. కొన్ని సదర్భాల్లో కఠినంగా కూడా ఉంటుంది. అందుకే ఆయన్ను కాంట్రవర్షియల్ స్టార్ గా పిలుచుకుంటారు. ఆయనతో మాట్లాడాలంటే భయపడిపోతుంటారు. సభలు సమావేశాలలో ఎవరైనా ఫోన్ చూస్తున్నా ఊరుకోరు మోహన్ బాబు, ఎంత పెద్ద స్టార్ అయినా.. అక్కడికక్కడే ఏదో ఒక మాట అనేస్తుంటాడు. అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నటుడిగా మోహన్ బాబుకు వంకలు పెట్టాల్సిన పనిలేదు.. ఆయన నటప్రస్థానం గురించి అందరికి తెలిసిందే. విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా మోహన్ బాబు తెలుగువారికి బాగా దగ్గరైన వ్యక్తి.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్..
డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్, నట ప్రపూర్ణ లాంటి బిరుదులెన్నో మోహన్ బాబు కష్టానికి గుర్తింపుగా లభించాయి. ఆయన కూడా తాను చాలా గొప్ప నటుడినన్ని తనకు తానే కితాబిచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన బాటలోనే కూతురు మంచు లక్ష్మి.. మంచు మనోజ్ నడుస్తుండగా.. మరో తనయుడు మంచు మనోజ్ మాత్రం కాస్త డిఫరెంట్ రూట్లో వెళ్తుంటాడు. ఇక మోహన్ బాబుతో మాట్లాడటానికే.. స్టార్స్ కాస్త ఆలోచిస్తుంటారు.. అటువంటిది.. ఆయన్ను విమర్శించాలంటే.. దానికి చాలా ధైర్యం ఉండాలి. కానీ స్టార్ డైరెక్టర్ రాజమౌళి మాత్రం... ఓపెన్ గానే.. మోహన్ బాబుకు గర్వం ఎక్కువ అని అనేశాడు.
మోహన్ బాబుకు గర్వం ఎక్కువన్న రాజమౌళి..
ముంచు లక్ష్మీ, విష్ణు తో పాటు.. ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్, సుమంత్ లాంటి స్టార్స్ అంతా స్టేజ్ పైన ఉండగానే.. రాజమౌళి మోహన్ బాబు గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రాజమౌళి మాట్లాడుతూ.. " మోహన్ బాబుగారికి గర్వం చాలా ఎక్కువ.. తానే గొప్ప నటుడినని ఆయన ఎంతో గర్వంగా చెపుతుంటాడు. తనకంటే గొప్ప నటుడు లేడు అని ఆయన అంటుంటారు... ఆయన గర్వాన్ని మంచు లక్ష్మిగారు అణచివేయాలి.'' అని రాజమౌళి అన్నారు. ఇది గతంలో ఎప్పుడు జరిగిన సంఘటన.. మంచుఫ్యామిలీకి చెందిన సినిమా ఈవెంట్ లో ఇది జరిగినట్టు తెలస్తోంది. రాజమౌళి అన్న మాటలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మోహన్ బాబు పై ఎన్టీఆర్ కామెంట్స్..
రాజమౌళి మెహన్ బాబుపై చేసిన కామెంట్స్ కు.. అక్కడే ఉన్న ఎన్టీఆర్ కూడా స్పందించాడు. యంగ్ టైగర్ మాట్లాడుతూ.. " ఇందాక రాజమౌళి మాట్లాడుతూ.. మోహన్ బాబు గారికి గర్వం ఎక్కువ.. మంచు లక్ష్మి అది అణచివేయాలి అన్నారు. అసలు అది జరుగుతుందో లేదో.. నాకు డౌటే.. కానీ అది జరిగితే మాత్రం చూడాలని ఉంది.'' అని సరదాగా నవ్వులు పూయించారు తారక్. మోహన్ బాబు గురించి రాజమౌళి ఇంత పెద్ద మాట అన్నాడా అని నెటిజన్లు షాక్ అవుతున్నారు.

