ఎన్టీఆర్ కి 9 కథలు చెప్పి, 10వ కథతో డిజాస్టర్ సినిమా చేసిన దర్శకుడు ఎవరో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. కెరీర్ లో హిట్లు ప్లాప్ లు చూస్తూ వచ్చిన ఎన్టీఆర్.. ఒక కథను మాత్రం బాగా నమ్మి సినిమా చేసి.. పెద్ద దెబ్బ తిన్నాడు. ఇంతకీ ఎంటా సినిమా.

ఫామ్ లో ఉన్నయంగ్ టైగర్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం హిట్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న తారక్.. గతంలో కొన్ని ప్లాప్ సినిమాలతో స్ట్రగుల్ ఫేస్ చేశాడు. వరుసగా రెండు మూడు ప్లాప్ సినిమాలు చూసిన సందర్భాలు కూడా ఎన్టీఆర్ కెరీర్ లో ఉన్నాయి. అయితే యంగ్ టైగర్ ఎంతో నమ్మకంతో హిట్ కొట్టాలన్న తపనతో చేసిన సినిమా ఒకటి డిజాస్టర్ అయ్యి ఆయనకు నిరాశను మిగిల్చింది. ఆ సినిమా కోసం దాదాపు 9 కథలను తారక్ రిజెక్ట్ చేశాడు. 10వ కథను ఒకే చేసి..అద్భుతం చేయాలని అనుకున్నాడు. కానీ ఈసినిమా రిజెల్ట్ మరీ ధారణంగా రావడంతో ఎన్టీఆర్ చాలా బాధపడ్డాడు. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు దమ్ము.
బాలయ్యకు వరుస హిట్లు ఇచ్చిన దర్శకుడు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో.. మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన సినిమానే దమ్ము. ఈసినిమాకంటే ముందు సింహా సినిమాతో బాలకృష్ణకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు బోయపాటి. అదే ఊపులో.. ఎన్టీఆర్ కోసం అద్బుతమైన కథను రాసుకున్నాడు. కానీ ఎన్టీఆర్ కు అది నచ్చలేదు.. దాంతో మరొకటి... ఇంకొకటి.. ఇలా వరుసగా 9 కథలను ఎన్టీఆర్ కు వినిపించగా.. ఆయన అవన్నీ రిజెక్ట్ చేశాడు. ఆడియన్స్ , అభిమానులు ఇంకేదో కోరుకుంటున్నారని.. అలాంటి కథతో రమ్మని తారక్ బోయపాటితో అన్నారట. అలా పుట్టుకొచ్చిందే దమ్ము సినిమా. ఈసినిమా ఈవెంట్ లో తాను బోయపాటి చెప్పిన 9 కథలను రిజెక్ట్ చేశానని ఎన్టీఆర్ స్వయంగా వెల్లడించారు.
దమ్ము సినిమా డిజాస్టర్ కు కారణాలు?
దమ్ము సినిమా ప్లాప్ కు చాలా కారణాలు ఉన్నాయి.. ఈసినిమా కథలో మధ్య మధ్యలో మార్పులు చేసినట్టు మాచారం. సరైన స్క్రీన్ ప్లే లేకపోవడంతో పాటు.. దమ్ములో వైలెన్స్ చాలా ఎక్కవైపోయింది. కథ కొన్ని ట్విస్ట్ లు ప్రేక్షకులు తీసుకోలేకపోయారు. కొన్నేళ్లుగా.. సుమన్ పాత్ర ఒక గదిలోపలే ఉండిపోవడం.. లాజిక్ లేకుండా మనుషులను చంపుకుంటూ వెళ్లిపోవడం.. ఓవర్ సెంటిమెంట్, ఓవర్ యాక్షన్ సీన్స్, డైలాగ్స్ లో అతి.. ఇలా దమ్ము సినిమా ప్రేక్షకులను విసిగించిందని చెప్పాలి. ఎన్టీఆర్ సినిమాపై ఎన్నో ఆశలతో వెళ్లిన ప్రేక్షకులకు తీవ్ర నిరాశను కలిగించింది ఈమూవీ. అంతే కాదు ఈసినిమా డిజాస్టర్ తరువాత ఎన్టీఆర్ బోయపాటితో సినిమాలు చేయలేదు. అంతే కాదు ఈ దర్శకుడితో తారక్ కు మాటలు కూడా లేవని సమాచారం.
ఎన్టీఆర్ సినిమాల లైనప్ ..
ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో తారక్ ను చాలా డిఫరెంట్ గా చూపించబోతున్నాడు దర్శకడు. ఈమూవీషూటింగ్ అయిపోయిన వెంటనే తారక్.. దేవర2 సెట్స్ లో జాయిన్ అవుతాడని సమాచారం. వీటితో పాటు... ఆయన ఖాతలో మరో రెండు పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అందుల అఫీషియల్ గా ఇంతక వరకూ ఏ సినిమాను తారక్ కన్ఫార్మ్ చేయలేదు.

