- Home
- Entertainment
- చిరంజీవి బాడీలో బోన్స్ ఉన్నాయా..? ఇన్నివంకర్లు ఎలా తిప్పుతున్నాడు..? మెగాస్టార్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో ఎవరు?
చిరంజీవి బాడీలో బోన్స్ ఉన్నాయా..? ఇన్నివంకర్లు ఎలా తిప్పుతున్నాడు..? మెగాస్టార్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో ఎవరు?
చిరంజీవి డ్యాన్స్ కు దేశమంతా అభిమానులు ఉన్నారు. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ.. ఆయన స్టెప్పులకు ఫిదా అయినవారు ఎందరో. అయితే అసలు మెగాస్టార్ బాడీలో బోన్స్ ఉన్నాయా అన్న డౌట్ ను వెల్లడించిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

టాలీవుడ్ డ్యాన్స్ ఐకాన్..
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వెస్ట్రన్ స్టెప్పులు స్టార్ట్ చేసిన హీరో అక్కినని నాగేశ్వారావు అయితే.. అది అలాగే కంటీన్యూ చేస్తూ.. పీక్స్ కు తీసుకెళ్లిన హీరో మెగాస్టార్ చిరంజీవి. ఒక రకంగా టాలీవుడ్ కు మైఖేల్ జాక్సన్ స్టెప్పుల రుచి చూపించాడు చిరు. అందుకోసం ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. అప్పటి వరకూ ఏ హీరో కూడా ఇంత అద్భుతంగా డ్యాన్స్ చేసింది లేదు. మెగాస్టార్ తోటి హీరోలలో కూడా ఈ రేంజ్ లో డ్యాన్సర్లు లేరు.. ఆయన తరువాత కూడా చాలా ఏళ్లు.. టాలీవుడ్ లో ఆ రేంజ్ లో స్టెప్పులు వేసిన హీరోలు రాలేదనే చెప్పాలి. ఆతరువాత కాలంలో ఆయన్ను ఆదర్శంగా తీసుకుని బన్నీ, చరణ్, ఎన్టీఆర్ లాంటి హీరోలు డ్యాన్స్ లో తమ ప్రతిభ చూపించారు.
మెగాస్టార్ తో సాంగ్ అంటే భయం..
చిరంజీవి డ్యాన్స్ మూమెంట్స్ ఎలా ఉండేవంటే.. ఆయనతో కాంబినేషన్ సాంగ్ ఉంది అంటే హీరోయిన్లు భయపడే వారు. మెగాస్టార్ తో పోటీగా డాన్స్ చేయలేమంటూ చేతులెత్తేసిన తారలు ఎంతో మంది ఉన్నారు. అంతే కాదు.. ఆయనతో పోటీగా డ్యాన్స్ చేసిన హీరోయిన్లు కూడా లేకపోలేదు. భానుప్రియ, విజయశాంతి, శోభన లాంటి స్టార్స్ మంచి డ్యాన్సర్లు కావడంతో... చిరుకి పోటా పోటీగా స్టెప్పులు వేసేవారు. మెగాస్టార్ డ్యాన్స్ కు సామాన్యులతో పాటు సెలబ్రిటీ అభిమానులు కూడా ఉండేవారు. ఆయన స్టెప్పులు వేస్తుంటే.. పక్కన ఉన్న హీరోయిన్లు కూడా తేలిపోయేవారు. ఈ కామెంట్స్ అక్కినేని నాగేశ్వరావు స్వయంగా అనడం విశేషం.
చిరంజీవి డ్యాన్స్ పై అక్కినేని కామెంట్స్..
మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ పై గతంలో అక్కినేని నాగేశ్వరావు చేసిన కామెంట్స్ కొన్ని ఈమధ్య కాలంలో వైరల్ అవుతున్నాయి. అక్కినేని మాట్లాడుతూ.. '' నేను తెలుగు సినిమాలోకి వెస్ట్రన్ స్టెప్పులు మొదటిగా తీసుకువచ్చాను. దాన్ని చిరంజీవి కంటీన్యూ చేస్తున్నాడు. సినిమాల్లో డ్యాన్స్ లు మొదలు పెట్టింది నేనే.. కానీ ఇప్పుడు అసలు ఎందుకు మొదలు పెట్టానురా నాయనా అని అనిపిస్తుంటుంది. ఇలాంటి విపరీత పరిస్థితి వస్తుందని అప్పుడు నేను అనుకోలేదు. చిరంజీవి డ్యాన్స్ చేస్తుంటే.. పక్కన ఉన్న హీరోయిన్ ను చూడబుద్ది కాదు, చిరంజీవినే.. చూడాలని అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఆయన స్టెప్పులు ఉంటాయి. ఆయన్ను పొగడాలని కాదు. అలా పొగడటం వల్ల.. ఇప్పుడు నాకేదో ఆయన ఇచ్చేది లేదు. అసలు ఆయన బాడీలో బోన్స్ ఉన్నాయా లేవా.. ఏంటి ఇన్ని వంకర్లు తిరుగుతాయి.. నేను అప్పుడు తిప్పలేకపోయాను.. ఇప్పుడు తిప్పలేకపోతున్నాను..అని అక్కినేని నాగేశ్వరావు.. చిరంజీవి డ్యాన్స్ పై ప్రశంసలు కురిపించారు.
70 ఏళ్ల వయసులో కూడా తగ్గేది లే..
ఈమధ్యనే 70 వ ఏడాదిలోకి అడుగు పెట్టాడు చిరంజీవి. ఈ ఏజ్ లో కూడా ఏమాత్రం తగ్గడంలేదు మెగాస్టార్. అదే గ్రేస్, అదే స్టైల్ ను మెయింటేన్ చేస్తున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మన శంకరవరప్రసాదుగారు సినిమా చేస్తున్నాడు చిరు. ఈ సంక్రాంతి కానుకగా 12న ఈసినిమా రిలీజ్ కాబోతోంది. అయితే ఈసినిమాలో సాంగ్స్ కు మెగాస్టార్ వేసిన స్టెప్పులు అభిమానులను ఉర్రూతలూగించబోతున్నాయి. ప్రమోషనల్ వీడియోలు చూసే..మెగా అభిమానులు ఊగిపోతున్నారు... ఇక ఫుల్ సాంగ్స్ చూసి ఏమంటారో చూడాలి. ఏడు పదుల వయసులో కూడా ఇంత ఫిట్ నెస్, డ్యాన్స్ మూమెంట్స్ ను చేయడం అందరికి సాధ్యం అయ్యే విషయం కాదు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు చిరంజీవి.
యంగ్ హీరోలకు పోటీగా..
ప్రస్తుతం చిరంజీవి వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. సంక్రాంతికి మన శంకర వర ప్రసాదుగారు రిలీజ్ ఉంటుంది. ఆతరువాత సమ్మర్ లో విశ్వంభర రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈలోపు బాబీ డైరెక్షన్ లో మరో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు మెగాస్టార్. ఈమూవీని ఈ ఏడాది చివర్లో కానీ.. వచ్చే ఏడాది సంక్రాంతికి కానీ రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈలోపు మరికొన్ని కథలకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరో వైపు వెంకీ కుడుముల, శ్రీకాంత్ ఓదేల సినిమాలపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఇలా చిరంజీవి వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకుంటూ.. యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు.

