తెలుగు అమ్మాయిలకు సినిమా ఆఫర్స్, ట్రోలర్స్ దెబ్బకి మనసు మార్చుకున్న ఎస్‌కేఎన్
సంచలన కామెంట్స్ వైరల్‌గా మారుతున్న నిర్మాత ఎస్‌కేఎన్ వ్యాఖ్యలు ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా తెలుగు అమ్మాయిలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు.

skn
`బేబీ` మూవీతో నిర్మాతగా ఒక్కసారిగా పాపులర్ అయ్యారు ఎస్‌కేఎన్. అంతకంటే ముందు ఆయన స్పీచ్‌లతో మరింత పాపులర్ అయ్యారు. స్టార్ హీరోలను, దర్శకులకు, తనదైన స్టయిల్‌లో పంచ్‌లతో ఆకాశానికి ఎత్తుతూ, ప్రాసలతో రఫ్ఫాడిస్తూ ఆద్యంతం ఎంటర్‌టైన్ చేస్తూ అందరికి దగ్గరయ్యారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల వివాదాల్లోనూ నిలిచారు. తెలుగు అమ్మాయిలకు ఆఫర్లు ఇవ్వకూడదు అనే అర్థంలో ఆయన మాట్లాడారు.
తాను తెలుగు అమ్మాయిలకు ఆఫర్స్ ఇచ్చామని, ముంబయి నుంచి, ఇతర భాషల నుంచి తీసుకొచ్చిన హీరోయిన్లే బెటర్ అని, వారినే ఎంకరేజ్ చేయాలి, తెలుగు అమ్మాయిలకు ఆఫర్లు ఇస్తే దెబ్బేస్తున్నారు అనే కోణంలో ఎస్‌కేఎన్ చెప్పారు. ఇటీవల `డ్రాగన్` ఈవెంట్‌లో ఆయన ఈ కామెంట్స్ చేశారు.
అయితే ఆ వ్యాఖ్యలు జనాలకు రంగ్‌గా పోట్రే అయ్యింది. తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయోద్దు అనేలా వెళ్లింది. దీంతో అటు సోషల్ మీడియాలో, ఇటు ఇండస్ట్రీలో, మీడియాలోనూ బాగా ట్రోల్ నడిచింది. తెలుగు అమ్మాయిలపై, తెలుగు హీరోయిన్లపై ఆయన చేసిన కామెంట్లు పెద్ద రచ్చ అవుతున్నాయి.
read more: Producer SKN: బేబీ హీరోయిన్ ని పరోక్షంగా టార్గెట్ చేసిన ఎస్ కె ఎన్ ? ఇద్దరి మధ్య ఏం జరిగింది
SKN, Vaishnavi Chaitanya
ఈ క్రమంలో తాజాగా ఎస్‌కేఎన్ స్పందించారు. తన వ్యాఖ్యలకు ఆయన వివరణ ఇచ్చాడు. తాను సరదాగా ఆ వ్యాఖ్యలు చేసినట్టు తెలిపారు. ఈక్రమంలో తాము ఎంత మంది హీరోయిన్లని పరిచయం చేశామో తెలిపారు. `ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది తెలుగు అమ్మాయిలను పరిచయం చేసిన తక్కువ మంది నిర్మాతల్లో నేను ఒకడిని.
రేష్మ, ఆనంది, ప్రియాంక జవాల్కర్, వైష్ణవి చైతన్య, ఐశ్వర్య, ఖుషిత వీళ్లందరిని ఇప్పటి వరకు పరిచయం చేశాను. వీరితోపాటు నెక్ట్స్ రాబోతున్న సినిమాల్లో హారిక, మరో కొత్త అమ్మాయి ఉంది. ఇలా ఎనిమిది తొమ్మిది మందిని పరిచయం చేశాను. ఈషారెబ్బా, ప్రియావర్మ, ఇనయ ఇలా ఇంకొంత మంది ఉన్నారు.
నేను చేసిన సినిమాల్లో దాదాపు 80శాతం తెలుగు అమ్మాయిలతోనే చేశాను. ఇప్పుడు ఓ టార్గెట్ పెట్టుకున్నారు. జర్నలిస్ట్ నుంచి వచ్చాను, కాబట్టి ఇప్పుడు ఓ టార్గెట్ పెట్టుకున్నాను. ఒక 25 మంది అమ్మాయిలను పరిచయం చేయాలని నిర్ణయించుకున్నారు.
హీరోయిన్లనే కాదు, ఇతర డిపార్ట్ మెంట్లలోనూ రైటర్‌గా, ఎడిటర్‌గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, ఆర్ట్ డైరెక్టర్‌గా, డైరెక్టర్‌గా, ఇలా ఎవరికి ఎందులో ఆసక్తి ఉంటే, నాకు తెలిసిన సర్కిల్ నుంచి 25 మంది తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్న.
అందులో భాగంగా ఇప్పుడు చేస్తున్న మూడు సినిమాల్లో తెలుగు అమ్మాయిలు ఉన్నారు. అందులో ఆర్ట్ డైరెక్టర్, రైటర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా తెలుగు అమ్మాయే ఉంది. జస్ట్ ఫన్ యాంగిల్‌లో చెప్పిన ఒక కామెంట్‌ని ఒక స్టేట్‌మెంట్‌లాగా ప్రమోట్ చేయోద్దని నా కోరిక.
జోక్‌ని జోక్‌లాగే తీసుకోండి తప్ప, స్టేట్‌మెంట్‌లాగా పాస్ చేయోద్దని కోరుకుంటున్నా` అని తెలిపారు ఎస్‌కేఎన్. ట్రోలర్స్, మీడియా దెబ్బకి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఏది జరిగినా, మొత్తంగా తెలుగు అమ్మాయిలకు మంచే జరుగుతుండటం విశేషం. ఇది అభినందనీయం.
read more: Daaku Maharaj: ఊర్వశీ రౌతేలా పై మరోసారి ట్రోలింగ్, ఆడేసుకుంటున్నారు