- Home
- Entertainment
- Producer SKN: బేబీ హీరోయిన్ ని పరోక్షంగా టార్గెట్ చేసిన ఎస్ కె ఎన్ ? ఇద్దరి మధ్య ఏం జరిగింది
Producer SKN: బేబీ హీరోయిన్ ని పరోక్షంగా టార్గెట్ చేసిన ఎస్ కె ఎన్ ? ఇద్దరి మధ్య ఏం జరిగింది
Producer SKN: ఎస్ కె ఎన్ స్టేజి ఎక్కితే చాలు తరచుగా సంచలన వ్యాఖలు చేస్తుంటారు. అయితే ఈసారి ఎస్ కె ఎన్ చేసిన కామెంట్స్ వివాదంగానూ, చర్చనీయాంశంగానూ మారేలా ఉన్నాయి.

SKN, Vaishnavi Chaitanya
లవ్ టుడే చిత్రంతో తమిళ నటుడు ప్రదీప్ రంగనాథ్ తెలుగులో కూడా గుర్తింపు సొంతం చేసుకున్నారు. యువతకి కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉన్న కథలని ప్రదీప్ ఎంచుకుంటున్నారు. ప్రదీప్, అనుపమ పరమేశ్వరన్, కాయడు లోహర్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ' డ్రాగన్' ఫిబ్రవరి 21న రిలీజ్ అవుతోంది. దీనితో హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది.
డైరెక్టర్ హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బేబీ చిత్ర నిర్మాత ఎస్ కె ఎన్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అతిథిగా పాల్గొన్నారు. ఎస్ కె ఎన్ స్టేజి ఎక్కితే చాలు తరచుగా సంచలన వ్యాఖలు చేస్తుంటారు. అయితే ఈసారి ఎస్ కె ఎన్ చేసిన కామెంట్స్ వివాదంగానూ, చర్చనీయాంశంగానూ మారేలా ఉన్నాయి. హీరోయిన్ కాయడు లోహర్ గురించి ఎస్ కె ఎన్ మాట్లాడుతూ.. మీకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి స్వాగతం. టాలీవుడ్ లో మేము తెలుగు వచ్చిన హీరోయిన్ల కంటే తెలుగు రాని హీరోయిన్లనే ఎక్కువగా ఇష్టపడతాం అని ఎస్ కె ఎన్ అన్నారు.
Vaishnavi Chaitanya
దానికి కారణం ఉందని తెలిపారు. తెలుగు వచ్చిన అమ్మాయిలని ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో నాకు అనుభవం అయింది అని అన్నారు. ఇక నుంచి నేను, నా డైరెక్టర్ సాయి రాజేష్ తెలుగురాని హీరోయిన్లని ఎంపిక చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఎస్ కె ఎన్ చేసిన వ్యాఖ్యలు బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్యని ఉద్దేశించే అంటూ నెటిజన్లు భావిస్తున్నారు.
Vaishnavi Chaitanya
సాయి రాజేష్, దర్శకత్వంలో ఎస్ కె ఎన్ నిర్మించిన బేబీ చిత్రం చిన్న చిత్రాల్లో అతి పెద్ద విజయం గా నిలిచింది. ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య పెర్ఫార్మెన్స్ కి ప్రశంసలు దక్కాయి. వైష్ణవి చైతన్యని ఎస్ కె ఎన్ ఎందుకు టార్గెట్ చేశారు ? వీళ్లిద్దరి మధ్య ఏం జరిగింది అనేది క్లారిటీ లేదు.