Daaku Maharaj: ఊర్వశీ రౌతేలా పై మరోసారి ట్రోలింగ్, ఆడేసుకుంటున్నారు
Daaku Maharaj: నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న 'డాకు మహారాజ్' చిత్రం పోస్టర్ తో ఊర్వశి రౌతేలా ని మరోసారి ట్రోలింగ్ చేస్తున్నారు. . 'దబిడి దిబిడి' పాట వివాదం నేపథ్యంలో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Fans React to Urvashi Rautela Absence from Netflix Daaku Maharaj Poster in telugu
Daaku Maharaj: బాలకృష్ణ (Balakrishna) హీరోగా బాబీ కొల్లి (Director Bobby) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డాకు మహారాజ్’ (Daaku Maharaj). ఈ సినిమాలో బాబీ దేవోల్, ప్రజ్ఞా జైస్వాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఊర్వశీ రౌతేలా అతిథి పాత్ర పోషించారు. తమన్ స్వరాలు అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఇది నిర్మితమైంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైంది.
తాజాగా ఈ సినిమా ఈ నెల 21 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో (NetFlix) అందుబాటులో ఉండనున్నట్లు చిత్ర టీమ్ తెలిపింది. ఈ నేపధ్యంలో నెట్ ప్లిక్స్ ఓ పోస్టర్ వదిలింది. అయితే ఈ పోస్టర్ ని అడ్డం పెట్టి బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా ని ఆడేసుకుంటున్నారు నార్త్ జనం.
Fans React to Urvashi Rautela Absence from Netflix Daaku Maharaj Poster in telugu
డాకూ మహారాజ్ పోస్టర్ లో ఊర్వశి మిస్సవటంతో ట్విట్టర్, ఇనిస్ట్రాలో ఆమెను ట్యాగ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో బాలయ్యతో కలిసి ఊర్వశి ‘దబిడి దిబిడి’ పాటకు డ్యాన్స్ చేశారు. ఈ పాట విడుదలైన సమయంలో కొరియోగ్రఫీపై కాంట్రవర్సీ వచ్చింది. అయితే అదేమీ పట్టించుకోకుండా ఊర్వశి ఈ సినిమాని సోషల్ మీడియాలో తెగ ప్రమోట్ చేసింది. పనిలో పనిగా గేమ్ ఛేంజర్ గురించి మాట్లాడింది.
తమ సినిమా హిట్టైందని చెప్పుకొచ్చింది. ఇవన్నీ గమనిస్తున్న సోషల్ మీడియా జనం ...ఇంత రచ్చ చేసిన ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela) ని నెట్ ప్లిక్స్ మర్చిపోయి పోస్టర్ వదిలిందంటూ వెటకారం చేస్తున్నారు. ఇక ఓటిటిలో వచ్చాక ఆమె పాటకు ఇంక ఎలాంటి స్పందన వస్తుందో అనిపిస్తోంది ఇదంతా చూస్తుంటే అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Fans React to Urvashi Rautela Absence from Netflix Daaku Maharaj Poster in telugu
ఈ పాటపై వివాదంపై ఊర్వశీ రౌతేలా రీసెంట్ గా స్పందించారు. ప్రేక్షకుల నుంచి ఈవిధమైన స్పందన తాను అస్సలు ఊహించలేదని అన్నారు. ఆ పాట, అందులోని స్టెప్పులను ప్రేక్షకులు ఆదరిస్తారనుకున్నానని ఆమె చెప్పారు. కానీ, ఈవిధంగా మాట్లాడతారని తాను అస్సలు అనుకోలేదని తెలిపారు. స్టెప్పులు చెప్పినప్పుడు నాకు ఏమాత్రం విభిన్నంగా లేదా అభ్యంతరకరంగా అనిపించలేదు.
సాధారణమైన స్టెప్పుల మాదిరిగానే భావించా. కానీ, పాట విడుదలయ్యాక సోషల్‌మీడియాలో వచ్చిన విమర్శలు చూసి షాకయ్యా. కొరియోగ్రఫీని ప్రేక్షకులు తప్పుపట్టడానికి కారణం ఏమిటో అంచనా వేయడానికి కూడా సమయం లేకపోయింది. అంతా సడెన్‌గా జరిగిపోయింది. రిహార్సల్స్ చేస్తున్నప్పుడు ఇలాంటి విమర్శలు వస్తాయని మేము అస్సలు ఊహించలేదు. రిహార్సల్స్ క్లిప్స్ విడుదల చేసినప్పుడు ఎలాంటి విమర్శలు రాలేదు’’ అని ఊర్వశీ రౌతేలా తెలిపారు.