- Home
- Entertainment
- బాలీవుడ్ లో అయితే నా బట్టలు విప్పేసేవారు, శరీరమే కావాలి.. ఊసరవెల్లి నటి షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ లో అయితే నా బట్టలు విప్పేసేవారు, శరీరమే కావాలి.. ఊసరవెల్లి నటి షాకింగ్ కామెంట్స్
తమన్నా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి నటించిన ఊసరవెల్లి చిత్రం 2011లో విడుదలయింది. ఈ చిత్రంలో తమన్నా ఫ్రెండ్ పాత్రలో బోల్డ్ బ్యూటీ పాయల్ ఘోష్ నటించిన సంగతి తెలిసిందే.
- FB
- TW
- Linkdin
Follow Us
)
తమన్నా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి నటించిన ఊసరవెల్లి చిత్రం 2011లో విడుదలయింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తారక్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది.
ఈ చిత్రంలో తమన్నా ఫ్రెండ్ పాత్రలో బోల్డ్ బ్యూటీ పాయల్ ఘోష్ నటించిన సంగతి తెలిసిందే. తెలుగులో పాయల్ ఘోష్ ఊసరవెల్లితో పాటు ప్రయాణం, మిస్టర్ రాస్కెల్ లాంటి చిత్రాల్లో నటించింది. సౌత్ చిత్రాలతోనే ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
గతంలో మీటూ ఉద్యమం సమయంలో పాయల్ ఘోస్ట్ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది ఈ బ్యూటీ. ఆమె వ్యాఖ్యలు అప్పట్లో ప్రకంపనలు సృష్టించాయి. తాజాగా పాయల్ ఘోష్ మరోసారి బాలీవుడ్ పై విరుచుకుపడింది.
బాలీవుడ్ ని టార్గెట్ చేస్తూ సౌత్ ఇండస్ట్రీని ప్రశంసలతో ముంచెత్తింది పాయల్ ఘోష్. తాజాగా సోషల్ మీడియాలో నేను దేవుడి దయవల్ల సౌత్ లో నటిగా లాంచ్ అయ్యాను. ఒక వేళ బాలీవుడ్ లో అయి ఉంటే నా బట్టలు విప్పేసి శరీరాన్ని వాడుకునే వారు. బాలీవుడ్ లో అమ్మాయిల క్రియేటివిటీ, ట్యాలెంట్ కంటే వారి శరీరాలనే వాడుకుంటారు. వారికి ఎక్కువగా అదే కావాలి అన్నట్లు ప్రవర్తిస్తారు అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది.
దీనితో పాయల్ ఘోష్ కామెంట్స్ పై మరోసారి చర్చ జరుగుతోంది. పాయల్ ఘోష్ ఎక్కువగా హిందీ చిత్రాల్లో నటించలేదు. అరకొర చిత్రాలే చేసినప్పటికీ సౌత్ లోనే నటించింది.
ఇక పాయల్ గతంలో ఎన్టీఆర్ ని ప్రశంసిస్తూ.. తారక్ గ్లోబల్ స్టార్ అవుతాడు అని ముందే ఊహించినట్లు పాయల్ తెలిపింది. ఆర్ఆర్ఆర్ చిత్రంతో అది నిజమైందని పాయల్ తారక్ పై ప్రశంసలు కురిపించింది.