- Home
- Entertainment
- ఆ పెళ్లి గురించి ఎత్తగానే అలీపై మండిపడ్డ మోహన్ బాబు.. అది ఆయన వ్యక్తిగత జీవితం, మాట్లాడొద్దు అంటూ వార్నింగ్
ఆ పెళ్లి గురించి ఎత్తగానే అలీపై మండిపడ్డ మోహన్ బాబు.. అది ఆయన వ్యక్తిగత జీవితం, మాట్లాడొద్దు అంటూ వార్నింగ్
అలీ టాలీవుడ్ లో ప్రముఖ కమెడియన్ గా దశాబ్దాల నుంచి రాణిస్తున్నారు. హీరోగా, కమెడియన్ గా సత్తా చాటిన అలీ బుల్లితెరపై కూడా హోస్ట్ గా తనదైన ప్రత్యేకత చాటుకున్నారు.

అలీ టాలీవుడ్ లో ప్రముఖ కమెడియన్ గా దశాబ్దాల నుంచి రాణిస్తున్నారు. హీరోగా, కమెడియన్ గా సత్తా చాటిన అలీ బుల్లితెరపై కూడా హోస్ట్ గా తనదైన ప్రత్యేకత చాటుకున్నారు. అలీతో సరదాగా షోకి అలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అలీతో సరదాగా షోకి చాలామంది సెలబ్రిటీలు అతిథులుగా హాజరయ్యారు.
250వ ఎపిసోడ్ కి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గెస్ట్ గా హాజరై తన కెరీర్ విశేషాలను అలీతో పంచుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి చర్చ జరిగింది. మోహన్ బాబు ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. అన్నయ్య మనసులో ప్రేమను సంపాదించుకునే అవకాశం నాకు దక్కింది. దానిని ఈ జీవితానికి గొప్ప వరంగా భావిస్తాను.
మేజర్ చంద్రకాంత్ చిత్రాన్ని అన్నయ్యతో తీయాలనుకున్నప్పుడు వెళ్లి అడిగితే మొదట ఆయన వద్దన్నారు. ఆ తర్వాత రిక్వెస్ట్ చేయడంతో అంగీకరించారు. ఆ విధంగా మేజర్ చంద్రకాంత్ చిత్రం రూపొంది అఖండ విజయం సాధించింది అని మోహన్ బాబు అన్నారు.
మేజర్ చంద్రకాంత్ చిత్ర వంద రోజులు వేడుకలు ఒక ఊహించని సంఘటన జరిగింది. ఆ సంఘటనకి కారకులు మీరే అని.. ఆ పెళ్లికి పెద్ద మీరే అని ఒక ప్రచారం ఉంది.. అందులో నిజం ఎంత అని అలీ.. ఎన్టీఆర్, లక్ష్మి పార్వతి వివాహం గురించి మోహన్ బాబుని ప్రశ్నించారు. ఈ ప్రశ్న అడగగానే మోహన్ బాబు చిరాకు పడ్డారు. అలీతో సరదాగా అంటే ఏదో సరదాగా ఉంటుందని అనుకున్నా.. ఇలాంటి ప్రశ్నలు ఊహించలేదు. ఆ ప్రశ్నకి సమాధానం ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. కానీ అది ఇప్పుడు అనవసరం.
అది అన్నయ్య వ్యక్తిగత విషయం. ఆరోజు ఫంక్షన్ లో ఆయన అనౌన్స్ చేసిన మాట నిజమే. అయితే అది ఆయన పర్సనల్ మ్యాటర్. దాని గురించి మనం మాట్లాడకూడదు. ఎవరి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు మనకి లేదు అని మోహన్ బాబు అన్నారు. ఆ పెళ్లికి కారకులు మీరే అని ప్రచారం ఉంది కదా దానికి ఏమంటారు అని మరోసారి ప్రశ్నించారు. దీంతో మోహన్ బాబు అసహనం వ్యక్తం చేశారు.
దారిన పోయే కుక్కలు అరుస్తూ ఉంటాయి. ప్రతి కుక్కకి సమాధానం చెబుతూ వెళితే మన గమ్యం చేరుకోలేం చెప్పారు. అన్నయ్య ఆయన అభిప్రాయాన్ని నాతో చెప్పారు.. కాబట్టి ఆయనకి ఏం చేయగలనో అది చేశాను. ఆయన మాటని నేను ఎప్పుడూ కాదనను. కానీ అది పూర్తిగా ఆయన వ్యక్తిగత వ్యవహారం అని మోహన్ బాబు అన్నారు.