MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Prabhas Assets: లక్ష ఎకరాలు, వేల కోట్లు.. అంబానీని మించిన ప్రభాస్‌ ఫ్యామిలీ ఆస్తులు, మతిపోయే రహస్యాలు

Prabhas Assets: లక్ష ఎకరాలు, వేల కోట్లు.. అంబానీని మించిన ప్రభాస్‌ ఫ్యామిలీ ఆస్తులు, మతిపోయే రహస్యాలు

ప్రభాస్‌ టాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌గా రాణిస్తున్నారు. ఆస్తుల పరంగా పెద్దగా వార్తల్లో లేని డార్లింగ్‌ ఫ్యామిలీకి వేల కోట్ల ఆస్తులున్నాయట. ముఖేష్‌ అంబానీని మించిన ఆస్తులు వారి సొంతమనే నిజం బయటకు వచ్చింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 01 2026, 01:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇండియా బిగ్గెస్ట్ స్టార్‌ ప్రభాస్‌
Image Credit : Asianet News

ఇండియా బిగ్గెస్ట్ స్టార్‌ ప్రభాస్‌

ప్రభాస్‌.. కృష్ణంరాజు నట వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇండియాలోనే అతిపెద్ద హీరో. ప్రపంచ సినిమాకి ఫేసాఫ్‌గా ప్రభాస్‌ నిలిచారు. ఇండియన్‌ సినిమాకి ఒక గుర్తింపు తీసుకొచ్చారు. ప్రపంచం మన వైపు తిరిగి చూసేలా చేశారు. ఇప్పుడు భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. `ఫౌజీ`, `స్పిరిట్‌` చిత్రీకరణ దశలో ఉన్నాయి. `కల్కి 2`, `సలార్‌ 2` చిత్రాలు ప్రారంభం కావాల్సి ఉంది. అలాగే ప్రశాంత్‌ వర్మతో ఓ కమిట్‌మెంట్‌ ఉంది. హోంబలేలో మరో రెండు కమిట్‌మెంట్స్ ఉన్నాయి. ఇలా మరో ఐదారేళ్ల వరకు ప్రభాస్‌ బిజీగా ఉన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వేల కోట్ల ఆస్తులకు అధిపతి ప్రభాస్‌ ఫ్యామిలీ
Image Credit : Asianet News

వేల కోట్ల ఆస్తులకు అధిపతి ప్రభాస్‌ ఫ్యామిలీ

ప్రభాస్‌ది రాజుల ఫ్యామిలీ అనే విషయం తెలిసిందే. భీమవరం రాజుల కుటుంబానికి చెందిన వారు. ప్రభాస్‌ ఫ్యామిలీ రాజుల కుటుంబం అయినా, ఆయన ఆస్తులకు సంబంధించిన సమాచారం పెద్దగా లేదు. ఆయన టాలీవుడ్‌లో ఓ సాధారణ హీరోగానే ఉన్నారు. నాగార్జున, చిరంజీవి వంటి వారితో పోల్చితే ప్రభాస్‌ కి ఉన్న ఆస్తులు తక్కువే అంటుంటారు. కానీ వారికి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయట. ఆ రహస్యాలను బయటపెట్టారు ప్రముఖ దర్శకుడు రాజా వన్నెంరెడ్డి. ఆయన కూడా రాజుల ఫ్యామిలీకి చెందినవారే. తాజాగా ప్రభాస్‌ ఫ్యామిలీకి సంబంధించిన సంచలన నిజాలను వెల్లడించారు. 

Related Articles

Related image1
Renu Desai: రాత్రికి రేటెంతా అని అడుగుతున్నారు, ట్రోలర్స్ పై విరుచుకుపడ్డ రేణు దేశాయ్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్‌
Related image2
Rashmika Record: విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన రష్మిక! పెళ్లి ఫోటో ఆసియాలోనే నంబర్ 1
35
9 సంస్థానాలను పాలించిన ప్రభాస్‌ ముత్తాతలు
Image Credit : Asianet News

9 సంస్థానాలను పాలించిన ప్రభాస్‌ ముత్తాతలు

ప్రభాస్ ముత్తాతలు రాజులు. భీమవరం నుంచి సమీపంలోని దాదాపు 9 సంస్థానాలు తమ పరిధిలో ఉండేవట. వాటిని వారే పాలించేవారు. వేల ఎకరాలు కాదు, లక్షల ఎకరాలు వారి ఆధీనంలో ఉండేవట. వాటిలో పంటలు పండించేవారు. తమకు కావాల్సినది ఉంచుకొని మిగిలినవి వీరందరికి రాజు అయిన ముస్లీం రాజుకి పంపించేవారట. కానీ ప్రభాస్‌ ముత్తాతల ఆధీనంలోనే ఈ తొమ్మిది సంస్థానాలు ఉండేవని, వాటికి వారే రాజులు అని. లక్షల ఎకరాలు, వేల కోట్ల ఆస్తులు(ఇప్పటి లెక్కల ప్రకారం) ఉండేవని రాజా వన్నెంరెడ్డి తెలిపారు.

45
లక్షల ఎకరాల పోగొట్టుకున్న ప్రభాస్‌ ఫ్యామిలీ
Image Credit : UVCreations/instagram

లక్షల ఎకరాల పోగొట్టుకున్న ప్రభాస్‌ ఫ్యామిలీ

అయితే ఇప్పుడు అన్నీ లేవని, వాటిని దానధర్మాలు చేశారని తెలిపారు. రాజులది చాలా పెద్ద చేయి అని, ఎవరు ఏది అడిగితే అది ఇచ్చేవారట. ఓ సారి కొందరు మంజిక కాచి ఇచ్చారు. ఆ టేస్ట్ చూసిన ప్రభాస్‌ ముత్తాత(రాజు) వారిని తన రాజ్యంలోనే ఉంచుకున్నారు. వారి కోసం ఏకంగా మూడు వేల ఎకరాలు రాసిచ్చారట. ఇలా  ఎన్నో దానాలు చేశారు, వాటికి లెక్కేలేదని తెలిపారు. ఇలా అన్ని ఆస్తులు కోల్పోయారని తెలిపారు. డబ్బులు కూడా దానం చేశారని వెల్లడించారు. ఇప్పుడు వంద ఎకరాల లోపే వారికి ల్యాండ్‌ ఉందని చెప్పారు. ఇప్పుడు హీరోలు అయ్యాక సంపాదించుకున్నవే గానీ, అప్పటి ఆస్తులన్నీ పోగొట్టుకున్నట్టు తెలిపారు.

55
ముఖేష్‌ అంబానీని మించిన ఆస్తులు
Image Credit : youtube/@PeopleMediaFactory

ముఖేష్‌ అంబానీని మించిన ఆస్తులు

రాజావెన్నెంరెడ్డి చెప్పిన దాని ప్రకారం లక్ష ఎకరాలు ల్యాండ్‌, వేల కోట్లు ఉన్నాయంటే, వాటిని డెవలప్‌ చేసి, ఇప్పటికీ ఈ ల్యాండ్‌ వీరి వద్దే ఉంటే, భారతీయ కుబేరుడు ముఖేష్‌ అంబానీని మించిన ఆస్తులు ప్రభాస్‌ ఫ్యామిలీ సొంతమయ్యేవని చెప్పొచ్చు. అప్పటికీ, ఇప్పటికీ వారు గొప్ప మనుషులు అని, దానం చేయడం, సాయం చేయడంలో వాళ్ల తర్వాతే ఎవరైనా అని తెలిపారు. ప్రభాస్‌ కూడా ఏది అడిగితే అది ఇచ్చేస్తారని, భోజనం పెట్టడంలో వాళ్ల తర్వాతే ఎవరైనా అని తెలిపారు. ఇండియాలోనే కుభేరులు కావాల్సిన ప్రభాస్‌ ఫ్యామిలీ ఇప్పుడు మామూలు హీరోగానే ఉండిపోయారని చెప్పొచ్చు. సుమన్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజా వన్నెంరెడ్డి ఈ విషయాలను పంచుకున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Grand Launch: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌ చూస్తే మతిపోవాల్సిందే.. స్పెషాలిటీ ఏంటంటే?
Recommended image2
Rajamouli: నేచురల్ గా నటించగలిగేది వాళ్లిద్దరే.. ప్రభాస్, రవితేజ, ఎన్టీఆర్, సునీల్ పై రాజమౌళి కామెంట్స్
Recommended image3
Yash Ramayana: టాక్సిక్ డిజాస్టర్ లెక్కలను రామాయణతో సరిచేస్తాడా? .. రావణుడిగా రాఖీ భాయ్ రచ్చ..
Related Stories
Recommended image1
Renu Desai: రాత్రికి రేటెంతా అని అడుగుతున్నారు, ట్రోలర్స్ పై విరుచుకుపడ్డ రేణు దేశాయ్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్‌
Recommended image2
Rashmika Record: విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన రష్మిక! పెళ్లి ఫోటో ఆసియాలోనే నంబర్ 1
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved