- Home
- Entertainment
- పవన్ తో రెండు సినిమాలని రిజెక్ట్ చేసిన నమ్రత, ఎందుకో తెలుసా.. ఒకటి సూపర్ హిట్, మరొకటి డిజాస్టర్
పవన్ తో రెండు సినిమాలని రిజెక్ట్ చేసిన నమ్రత, ఎందుకో తెలుసా.. ఒకటి సూపర్ హిట్, మరొకటి డిజాస్టర్
మహేష్ బాబు సతీమణి నమ్రత.. పవన్ కళ్యాణ్ తో రెండు చిత్రాల్లో నటించాల్సింది. కానీ ఆ రెండు చిత్రాలను నమ్రత రిజెక్ట్ చేశారు.
- FB
- TW
- Linkdin
Follow Us

పవన్ కళ్యాణ్ చిత్రాలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' చిత్రంతో నటుడిగా తన కెరీర్ ప్రారంభించారు. తొలిప్రేమ చిత్రంతో పవన్ కి యువతలో క్రేజ్ పెరిగింది. ఆ తర్వాత పవన్ బద్రి, తమ్ముడు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఖుషి మూవీతో పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ గా అవతరించారు. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఖుషి చిత్రం చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు.
నమ్రత తెలుగు సినిమాలు
పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో చాలా మంది హీరోయిన్లతో నటించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత.. పవన్ కళ్యాణ్ తో రెండు చిత్రాల్లో నటించాల్సింది. కానీ ఆ రెండు చిత్రాలను నమ్రత రిజెక్ట్ చేశారు. ఆమె అలా ఎందుకు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. అప్పట్లో నమ్రత బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. తెలుగులో మహేష్ బాబు వంశీ, చిరంజీవి అంజి లాంటి చిత్రాల్లో నటించారు.
పవన్ కళ్యాణ్, నమ్రత కాంబినేషన్
అప్పట్లో నమ్రత బాలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటించేవారు. ఆ టైంలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. పవన్ కళ్యాణ్ బద్రి చిత్రం కోసం హీరోయిన్ పాత్ర కోసం నమ్రతని అప్రోచ్ అయ్యారట. నమ్రతకి కథ చాలా బాగా నచ్చింది. బద్రి చిత్రంలో నటించేందుకు ఆసక్తి కూడా చూపారట. కానీ అదే టైంలో బాలీవుడ్ లో రెండు చిత్రాలలో నటిస్తుండడం వల్ల డేట్లు అడ్జస్ట్ చేయడం కుదరలేదట. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో నమ్రత బద్రి చిత్రాన్ని వదులుకోవాల్సి వచ్చింది.
బాలు చిత్రంలో నమ్రతకి ఛాన్స్
ఆ తర్వాత నమ్రత స్థానంలో పూరి జగన్నాథ్ అమీషా పటేల్ ని హీరోయిన్ గా ఎంచుకున్నారు. బద్రి మూవీ విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరోసారి పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం నమ్రతకు దక్కింది. పవన్ కళ్యాణ్, కరుణాకరన్ కాంబినేషన్ లో రెండోసారి తెరకెక్కిన చిత్రం బాలు. తొలిప్రేమ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
మహేష్ బాబుతో రిలేషన్
ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం డైరెక్టర్ కరుణాకరన్ నమ్రతని సంప్రదించారు. కానీ అదే టైంలో నమ్రత, మహేష్ బాబుతో రిలేషన్ లో ఉండడం వల్ల బాలు చిత్రాన్ని ఆమె రిజెక్ట్ చేశారు. ఆ విధంగా నమ్రత వదులుకున్న బద్రి చిత్రం సూపర్ హిట్ కాగా.. బాలు మూవీ ఫ్లాప్ అయ్యింది.