MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Kantara Secret: కాంతారకి మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా? గూస్‌ బంమ్స్ తెప్పించే విషయం చెప్పిన రిషబ్ శెట్టి

Kantara Secret: కాంతారకి మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా? గూస్‌ బంమ్స్ తెప్పించే విషయం చెప్పిన రిషబ్ శెట్టి

Kantara Secret: `కాంతార` సినిమాలో రిషబ్‌ శెట్టి నటించి ఇరగదీశాడు. అయితే ఈ మూవీకి ఆయన మొదట ఓ సూపర్‌ స్టార్‌ని అనుకున్నాడట. గూస్‌ బంమ్స్ తెప్పించే విషయాన్ని బయటపెట్టాడు  రిషబ్‌ శెట్టి. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 01 2026, 10:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
 ఇండియన్‌ బాక్సాఫీసుని షేక్‌ చేసిన `కాంతార`
Image Credit : Asianet News

ఇండియన్‌ బాక్సాఫీసుని షేక్‌ చేసిన `కాంతార`

కాంతార సినిమా ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో, ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రం, రిషబ్ శెట్టి కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆయన పాన్‌ ఇండియా హీరో అయిపోయాడు. `కాంతార 2` ఇండియన్‌ బాక్సాఫీసుని షేక్‌ చేసింది. `కేజీఎఫ్‌2` తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ సినిమాగా నిలిచింది. అయితే ఈ సినిమాకి సంబంధించి రిషబ్ శెట్టి స్వయంగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కాంతారకి మొదట అనుకున్న హీరో పునీత్‌ రాజ్‌ కుమార్‌
Image Credit : AFP

కాంతారకి మొదట అనుకున్న హీరో పునీత్‌ రాజ్‌ కుమార్‌

అనుకున్నది అనుకున్నట్లు జరిగి ఉంటే, కాంతారలో రిషబ్ శెట్టికి బదులుగా పునీత్ రాజ్‌కుమార్ ఉండేవారు. ఎందుకంటే 'శివ' పాత్రకు మొదట ఫైనల్ అయ్యింది ఆయన పేరే. పునీత్ పేరు చెప్పగానే నేను కూడా చాలా ఉత్సాహపడ్డాను. కాంతార స్థాయిని, విజన్‌ను పునీత్ మరింత పెంచగలరని నేను భావించాను. ముఖ్యంగా దున్నపోతుల పరుగు పందెం (కంబళ) సన్నివేశాల్లో అప్పు సర్ అద్భుతంగా సరిపోతారని అనుకున్నాను అని రిషబ్ శెట్టి చెప్పారు.

Related Articles

Related image1
Vijay Rashmika: దేశ వ్యాప్తంగా అన్నదానం, స్వీట్ల పంపిణి.. అభిమానులకు విజయ్‌ దేవరకొండ, రష్మిక సర్‌ప్రైజ్‌
Related image2
Renu Desai: రాత్రికి రేటెంతా అని అడుగుతున్నారు, ట్రోలర్స్ పై విరుచుకుపడ్డ రేణు దేశాయ్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్‌
36
 కాంతార చేయడానికి రెడీ అయిన అప్పు
Image Credit : Asianet News

కాంతార చేయడానికి రెడీ అయిన అప్పు

అయితే, అప్పు సర్ కోస్తా కర్ణాటక ప్రాంత యాసను పూర్తిగా నేర్చుకోవాలని నేను చెప్పాను. అంత తక్కువ సమయంలో ఆయన అంత సమయం కేటాయించగలరా అనేది డౌట్‌.  కానీ ఆయన దానికి సిద్ధంగా ఉన్నారు. నిర్మాత విజయ్ కిరగందూర్ ఆయన్ను సంప్రదించినప్పుడు, కాంతార పట్ల ఆయన చాలా ఇంట్రెస్ట్ చూపించారు. ఆ యాసని నేర్చుకోవడానికి కూడా రెడీ అయ్యారు. కానీ అప్పుడు జరిగింది వేరు అని రిషబ్ శెట్టి చెప్పారు.

46
ఇలా పునీత్‌ రాజ్‌ కుమార్‌ `కాంతార` చేయలేకపోయారు
Image Credit : instagram

ఇలా పునీత్‌ రాజ్‌ కుమార్‌ `కాంతార` చేయలేకపోయారు

అప్పు సర్ కథ విని చాలా ఇష్టపడ్డారు. కానీ సినిమాలో మంగళూరు యాస, కోల, కంబళ వంటివి ప్రాక్టీస్ చేయాలి. దానికి చాలా సమయం పడుతుంది. అదే సమయంలో ఆయన 'ద్విత్వ' సినిమా చేసే చర్చలు కూడా జరిగాయి. అందుకే, 'రిషబ్, నా కోసం ఆగవద్దు' అని నాకు చెప్పారు. అప్పుడు స్వయంగా ఆయనే, 'ఈ పాత్రను మీరే చేసేయండి' అని సూచించారని రిషబ్ గుర్తుచేసుకున్నారు.

56
 రిషబ్‌ని నటించమని స్వయంగా చెప్పిన సునీత్‌
Image Credit : instagram

రిషబ్‌ని నటించమని స్వయంగా చెప్పిన సునీత్‌

`నేను కాంతార కథ అప్పు సర్‌కు చెప్పిన వెంటనే, ఆయన ఆ ప్రాజెక్ట్ పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆయన విభిన్నమైన కథలను ప్రయత్నించాలనుకున్నారు. కానీ, ఆయన ఇతర ప్రాజెక్టులు ఆయన్ను కాంతారకు దూరం చేశాయి. ఒకరోజు ఆయన నాకు ఫోన్ చేసి, తను లేకుండానే సినిమాను ముందుకు తీసుకెళ్లమని చెప్పారు. తన కోసం ఎదురుచూస్తే, ఆ ఏడాది సినిమా చేయడం సాధ్యం కాకపోవచ్చని ఆయన నాతో అన్నారు. అందుకే పునీత్ రాజ్ ఈ చిత్రంలో భాగం కాలేకపోయారు` అని రిషబ్ శెట్టి తెలిపారు.

66
 `కాంతార` సినిమా చూడాలని ఆసక్తిని వ్యక్తం చేసిన పునీత్‌ రాజ్‌ కుమార్‌
Image Credit : facebook.com/rishab.shetty.9465/

`కాంతార` సినిమా చూడాలని ఆసక్తిని వ్యక్తం చేసిన పునీత్‌ రాజ్‌ కుమార్‌

`కాంతార మొదటి షెడ్యూల్ పూర్తి చేశాక, 'భజరంగి 2' ఈవెంట్ సందర్భంగా అప్పు సర్ నన్ను కలిశారు. ఆయన తన ప్రాజెక్టుల గురించి చెప్పారు. `నా కోసం ఆగవద్దు, ఈ విషయంలో రాజీ పడొద్దు` అని చెప్పారు. నేను ఆయనకు షూటింగ్ స్టిల్స్ కొన్ని చూపించాను. అవి చూసి ఆయన  చాలా సంతోషపడ్డారు. సినిమా చూడటానికి ఎంతో ఆతృతగా ఉన్నట్టు చెప్పారు` అని ఆ రోజులను రిషబ్ శెట్టి గుర్తుచేసుకున్నారు. కానీ ఆ తర్వాత హార్ట్ ఎటాక్‌తో పునీత్‌ రాజ్‌ కుమార్‌ మరణించిన విషయం తెలిసిందే. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Grand Launch: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌ చూస్తే మతిపోవాల్సిందే.. స్పెషాలిటీ ఏంటంటే?
Recommended image2
Rajamouli: నేచురల్ గా నటించగలిగేది వాళ్లిద్దరే.. ప్రభాస్, రవితేజ, ఎన్టీఆర్, సునీల్ పై రాజమౌళి కామెంట్స్
Recommended image3
Yash Ramayana: టాక్సిక్ డిజాస్టర్ లెక్కలను రామాయణతో సరిచేస్తాడా? .. రావణుడిగా రాఖీ భాయ్ రచ్చ..
Related Stories
Recommended image1
Vijay Rashmika: దేశ వ్యాప్తంగా అన్నదానం, స్వీట్ల పంపిణి.. అభిమానులకు విజయ్‌ దేవరకొండ, రష్మిక సర్‌ప్రైజ్‌
Recommended image2
Renu Desai: రాత్రికి రేటెంతా అని అడుగుతున్నారు, ట్రోలర్స్ పై విరుచుకుపడ్డ రేణు దేశాయ్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved