వైరల్‌: గాంధీ సిద్ధాంతాలపై నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు

First Published 2, Jun 2020, 3:20 PM

మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల తరుచూ వివాదాలకు కేంద్ర బింధువుగా మారుతున్నాడు. ముఖ్యంగా జాతిపిత గాంధీని హత్య చేసిన గాడ్సేని ఉద్దేశించి నాగబాబు చేసిన ట్వీట్లు ఇటీవల వివాదాస్పదమయ్యాయి. తాజాగా మరోసారి అలాంటి ట్వీట్లు చేశాడు నాగబాబు.

తన ట్వీట్‌లో `భారతీయుల రక్తం శాంతి,అహింస మంత్రాలతో,చల్లబడిపోయింది.తిరిగి రక్తం వేడెక్కలంటే ఛత్రపతి శివాజీ,రాణా ప్రతాప్ సింగ్,అశోక చక్రవర్తి,సామ్రాట్ పృథ్విరాజ్ చౌహన్,శ్రీకృష్ణ దేవరాయలు,రాజ రాజ చోళుడు,సముద్రగుప్తుడు,మొదలైన మహావీరుల కథలని పిల్లలతో చదివిస్తే నెక్స్ట్ జనరేషన్ అయిన సరైన దారిలో వెలుతుంది` అని చెప్పాడు.

`వీరుల కథలు వినిపిస్తే సాహసం,పౌరుషం,మరిగే రక్తం తో పెరుగుతారు.ఎలాగూ మన రక్తం చల్లబడి పోయింది. వాళ్ళనన్నా దేశానికి ఉపయోగ పడే వీరులు గా తయారు చేద్దాం. భారత దేశానికి, దేశాన్ని ప్రేమించే వీరులు కావాలి, డబ్బుకు ఓట్లు వేసే సాధారణ పౌరులు కాదు` అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

దేశాన్ని పట్టి పీడిస్తున్న దేశద్రోహులు,గుండాలు,మాఫియా,ఫ్యాక్షన్, గుండా రాజకీయనాయకులు, కుహనా ఉదారవాదులు, ఉగ్రవాదుల నించి ఈ దేశాన్ని కాపాడే వీరులు కావాలని నా కోరిక. ప్రతి నేరాన్ని పోలీస్ , మిలిటరీ మాత్రమే డీల్ చెయ్యాలంటే కుదరని పని` అంటూ సోషల్ మీడియాలో రెచ్చిపోయాడు.

గతంలో నాధూరాం గాడ్సే జయంతి సందర్భంగా ఆయన నిజమైన దేశభక్తుడని నాగబాబు ట్వీట్ చేశాడు. అంతేకాదు గాడ్సే గాంధీని ఎందుకు చంపాడు అన్న విషయాన్ని ఆయన వైపు నుంచి ీమడియా చూపించలేదని అందుకే ప్రజల దృష్టిలో ఆయన ఓ నేరస్థుడిలా మిగిలిపోయాడని వ్యాఖ్యానించాడు.

ఈ వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి. సోషల్ మీడియాలో నాగ బాబు మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపించాయి. నీ కారణంగా చిరంజీవి, పవన్‌ కళ్యాణ్ ల పరువు పోతుందంటూ నెటిజెన్లు విరుచుకుపడ్డారు. అదే సమయంలో కొంత మంది నాగ బాబు వ్యాఖ్యలకు మద్దతు కూడా తెలిపారు.

ఆ తరువాత సినీ వివాదంలోనూ తలదూర్చాడు నాగబాబు. చిరంజీవి ఇంట్లో మీటింగ్ పై బాలయ్య వ్యాఖ్యలను తప్పు పడుతూ ఘాటుగా ఓ వీడియోను రిలీజ్ చేశాడు. దీంతో మరోసారి బాలయ్య అభిమానులకు టార్గెట్‌ అయ్యాడు నాగాబాబు.

loader