మంచు లక్ష్మీ లగ్జరీ హౌస్ చూశారా.. ప్రతి గది అద్భుతమే!
మంచు వారసురాలు మంచు లక్ష్మీ మల్టీ టాలెంటెడ్ నటి. యాంకర్ గా, హోస్ట్ గా, నటిగా, నిర్మాతగా ఆమె నిరూపించుకున్నారు. ఎలాంటి సందర్భంలో అయినా మంచు లక్ష్మి ధైర్యంగా తన అభిప్రాయాలు పంచుకుంటారు.
మంచు వారసురాలు మంచు లక్ష్మీ మల్టీ టాలెంటెడ్ నటి. యాంకర్ గా, హోస్ట్ గా, నటిగా, నిర్మాతగా ఆమె నిరూపించుకున్నారు. ఎలాంటి సందర్భంలో అయినా మంచు లక్ష్మి ధైర్యంగా తన అభిప్రాయాలు పంచుకుంటారు. ప్రస్తుతం కరోనా, లాక్ డౌన్ టైంలో ఆమె అభిమానులతో టచ్ లో ఉండేందుకు సోషల్ మీడియాని ఎంచుకున్నారు.
గతంలో కూడా మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు. కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ సమయం సోషల్ మీడియాకు కేటాయిస్తున్నారు. రీసెంట్ గా మంచు లక్ష్మీ తన పేరుతో కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. ఈ యూట్యూబ్ ఛానల్ లో మంచు లక్ష్మీ అనేక విషయాలు అభిమానులతో పంచుకోనున్నారు.
యూట్యూబ్ ఛానల్ ద్వారా నేరుగా తన అభిప్రాయాలు అభిమానులకు కన్వే అయ్యేలాచేయొచ్చు. తాజాగా మంచు లక్ష్మీ తన లగ్జరీ హౌస్ గురించి వీడియో చేయబోతోంది. ఆ వీడియోకి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేసింది. ప్రోమోలో మంచు లక్ష్మి ఇల్లు ఇంద్ర భవనాన్ని తలపిస్తోంది అంటే అతిశయోక్తి కాదు.
మెయిన్ గేట్ దగ్గర నుంచి పార్కింగ్ సెల్లార్, ఇంటిలో వివిధ గదులు అత్యాధునిక హంగులతో కనిపిస్తున్నాయి. ఇంటీరియర్ డిజైన్ అయితే అదిరిపోయింది అనే చెప్పాలి. మంచు లక్ష్మి తన అభిరుచికి తగ్గట్లుగా అద్భుతమైన చిత్ర పటాలతో ఇంటిని నింపేసింది. ఆ చిత్ర పటాలు గదులకు మరింత వెన్నె తెచ్చే విధంగా ఉన్నాయ్.
లైబ్రరీ, హోమ్ థియేటర్స్ కోసం ప్రత్యేకంగాగదులని డిజైన్ చేయించింది. డైనింగ్ హాల్ అయితే.. రాజుల కాలాన్ని తలపించేలా డిజైన్ చేయించింది. బెడ్ రూమ్ అద్భుతంగా ఉంది.
ఇది జస్ట్ ప్రోమో మాత్రమే.. త్వరలో వీడియో విడుదలయ్యాక అందులో తన ఇంటి విశేషాలని పూర్తిగా వివరించనుంది మంచు వారసురాలు.