- Home
- Entertainment
- సితారను మహేష్ బాబు ఇలా తయారు చేస్తున్నాడా..? గౌతమ్ పరిస్థితేంటి..? షాక్ అవుతున్న ఫ్యాన్స్..
సితారను మహేష్ బాబు ఇలా తయారు చేస్తున్నాడా..? గౌతమ్ పరిస్థితేంటి..? షాక్ అవుతున్న ఫ్యాన్స్..
సూపర్ స్టార్ మహేష్ బాబు తన పిల్లల్ని ఎలా చూడాలని అనుకుంటున్నారు..? వారి విషయంలో ఆయన ఏం చేయబోతున్నాడు.. గౌతమ్, సితారల్లో ఎవరు ఇండస్ట్రీకి రాబోతున్నారు..?

సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. బయట పార్టీలు, పబ్బ్ లు, ఫ్రెడ్స్.. ఇలాంటివి ఉండవు. అయితే సినిమా షూటింగ్ లేదా ఫ్యామిలీతో ఔటింగ్ ఈరెండే ఆయన లైఫ్. కాస్త ఖాళీ దొరికితే.. ఫ్యామిలీని తీసుకుని ఫారెన్ ప్లైట్ ఎక్కేస్తాడు సూపర్ స్టార్. ఇక తన ఇద్దరు పిల్లల విషయంలో పక్కా ప్లానింగ్ తో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఇద్దరి పిల్లల విషయంలో మహేష్ ఏం చేయబోతున్నాడు.
All So Read: నాని జోడీగా జాన్వీ కపూర్...? ఏదో తేడా కొడుతుందే...?
సూపర్ స్టార్ తనయుడు గౌతమ్ ప్రస్తుతం ఫారెన్ లో చదువుతున్నాడు. కంప్లీట్ గా స్టడీస్ మీద ఫోకస్ చేస్తున్నాడు. ఇటు సితార చదువుకుంటూనే.. సోషల్ మీడియా స్టార్ గా మారిపోయింది. నెట్టింట సితారకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమె చేసే విడియోస్ కు భారీగా వ్యూస్ తో పాటు.. లైక్ లు కామెంట్లు వస్తుంటాయి. అంతే కాదు ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది సీత పాప.
All So Read: ఆర్తి అగర్వాల్ ను వాళ్లంతా మోసం చేశారు..? స్టార్ డైరెక్టర్ చెప్పిన సంచలన నిజాలు
మహేష్ బాబులా సమాజాసేవలో కూడా ఆమె పాల్గోంటోంది. తనతరపున పేదవారికి సాయం చేస్తోంది. చిన్న వయస్సులోనే చాలా బ్రాండ్ మైండ్ తో ఆలోచిస్తున్న సితారను ఇంకా స్ట్రాంగ్ గా తయారు చేసే పనిలో ఉన్నాడు మహేష్. ఈ విషయంలో సితారకు పూర్తి స్వతంత్రం ఇచ్చినట్టు తెలుస్తోంది. సితారకు క్లాసికల్, వెస్ట్రన్ డాన్స్ తో పాటు.. మార్షల్ ఆర్ట్స్, స్పెషల్ జిమ్ ట్రైయినింగ్ కూడా ఇస్తున్నారు.
All So Read: వారసులు లేని శరత్ బాబు ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించాడా..? ఆస్తులన్నీ ఎవరికి సొంతం...?
ఈ వయసులోనే సితారకు చాలా కఠినమైన శిక్షణ ఇచ్చి చాలా స్ట్రాంగ్ గా తయారు చేస్తున్నారు. తాజాగా సితార జిమ్ లో మార్షల్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే సితారను సినిమాల్లోకి తీసుకవస్తారేమో అని అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే సితార అన్ని విషయాల్లో యాక్టీవ్ గా ఉంటోంది. సినిమా రిలేటెడ్ ఎక్స్ పీరియన్స్ ను స్వతహాగా సాధిస్తోంది.
All So Reade: తెలుగు సినిమాకు కోటి రెమ్యునరేషన్ తీసుకున్న ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
Image: Instagram
సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు పోస్ట్ చేస్తూ సందడి చేస్తోంది. యాడ్స్ లో నటిస్తూ, సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలు పొందుతుంది సితార. పండగొస్తే సితార ఫోటోలు ఫ్యాన్స్ వైరల్ చేస్తారు.. మహేష్ పాటలకు డాన్స్ చేయడం.. ఈవెంట్స్ లో మహేష్ తో కలిసి కనిపించడంతో పాటు.. అన్ని రకాలుగా ఆమె యాక్టీవ్ గా ఉంది.
ఇక మహేష్ తనయుడు కృష్ణ వారసుడు గౌతమ్ కృష్ణ మాత్రం చదువుకే పరిమితం అయ్యాడు.. చిన్నతనం నుంచి సినిమాల విషయంలో దూరంగానే ఉంటున్నాడు గౌతమ్. ఒక్క సినిమాలో మాత్రం మహేస్ బాబు చిన్నప్పటి పాత్రనుపోషించాడు. సుకుమార్ డైరెక్ట్ చేసిన వన్ నేనొక్కడే సినిమాలో గౌతమ్ పాత్రలోనే కనిపించాడు. ఆతరువాత సినిమాలు చేయలేదు గౌతమ్.
Image: Namrata Shirodkar / Instagram
ఇక గౌతమ్ చదవుతు తరువాత హీరోగా పరిచయం చేస్తారా..? లేక గౌతమ్ ను ఈ ఫీల్డ్ కు దూరంగా ఉంచుతారా అనేది తెలియాల్సి ఉంది. సితార మాత్రం తప్పకుండా సినిమాల్లోకనిపిస్తుందే నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. ఇప్పటికే సితారకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంది. మరి మహేష్ ఆలోచన ఎలా ఉందో చూడాలి.