నాని జోడీగా జాన్వీ కపూర్...? ఏదో తేడా కొడుతుందే...?
నేచురల్ స్టార్ నాని జోడీగా బాలీవుడ్ బ్యూటీ.. కాని ఈ విషయంలో ఎక్కడో ఏదో తేడా కొడుతున్నట్టు అనిపిస్తుంది కదా..? సరిగ్గా ఫ్యాన్స్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే..?

టాలీవుడ్ లో స్వతహాగా ఎదిగిన హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకరు. సహజమైన నటనతో..మన పక్కింటి కుర్రాడిలా.. మన ఇంట్లో మామలా.. బ్యాచిలర్ బాబాయిలా అనిపించేలా ఉంటాడు నాని. అంతే కాదు లేడీస్ లో కూడా నాని క్రేజ్ అంతా ఇంతా కాదు. అనుకోకుండా హీరో అయిపోయిన నాని.. తన కెరీర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వచ్చాడు.
All So Read: వారసులు లేని శరత్ బాబు ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించాడా..? ఆస్తులన్నీ ఎవరికి సొంతం...?
Sailesh Kolanu to direct film actor Nani
ఒకదశలో నాని మోనాటీనీ అన్నవారికి తన నటన, క్యారెక్టరైజేషన్ లో డిఫరెంట్ షేడ్స్ ను చూపించి మెప్పించాడు నాని. దసరా లాంటి సినిమాతో నానిలో మాస్ యాంగిల్ కూడా ఉందని నిరూపించాడు. ఇలా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు, ఆడియన్స్ కు బోర్ కొట్టకుండా అద్భుతాలు చేస్తున్న నాని.. మరో ప్రయోగం చేయబోతున్నాడని తెలుస్తోంది. అయితే ఈసారి కథ విషయంలోనో.. క్యారెక్టర్ విషయంలోనో కాదు.. హీరోయిన్ విషయంలో నాని సాహసం చేయబోతున్నాడట.
All So Read: తెలుగు సినిమాకు కోటి రెమ్యునరేషన్ తీసుకున్న ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
నేచురల్ పెర్ఫామెన్స్ ఇచ్చే నాని పక్కన అందరు హీరోలు సెట్ అవ్వరు అనేది ఫ్యాన్స్ అభిప్రాయం. 40 ఏళ్ళు వచ్చినా... కుర్రాడిలా కనిపించే నానికి జతగా కొంత మంది హీరోయిన్లు బాగోరు. ఏజ్ ఎంత చిన్నదైనా.. నానికంటే వయస్సులో పెద్దవారిలా కనిపిస్తారని అంటుంటారు ఫ్యాన్స్. రీసెంట్ గా నాన్న సినిమాలో మృణాల్ కూడా నానికంటే పెద్దదానిలా కనిపించిందనేది టాక్. ఇక ఈసారి నాని ఏకంగా బాలీవుడ్ హీరోయిన్ ను రంగంలోకి దింపుతున్నాడట.
All So Read: ఆర్తి అగర్వాల్ ను వాళ్లంతా మోసం చేశారు..? స్టార్ డైరెక్టర్ చెప్పిన సంచలన నిజాలు
నానికి జోడీగా జాన్వీ కపూర్.. ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఇదే. నాని పక్కన హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఫిక్స్ అయ్యిందని టాక్. దసరా లాంటి అద్భుతమైన హిట్ తరువాత శ్రీకాంత్ ఓదేల్ లో నాని మరో సినిమా చేస్తున్నాడు. ఈసినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాకపోయినా.. ఇది నిజమే అంటున్నారు సినీ జనాలు. అయితే నాని జోడీగా జాన్వీ కపూర్ అనగానే పెదవి విరుస్తున్నారు ఫ్యాన్స్.
All So Read: అమితాబచ్చన్ తో లిప్ లాక్ సీన్.. భయంతో రెండు సార్లు బ్రెష్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?
బాలీవుడ్ లో అద్భుతమైన సినిమాలు చేసిన జాన్వీ కపూర్ .. తెలుగు సినిమాల ద్వారా సౌత్ ఎంట్రీ ఇస్తోంది. తల్లి కోరికమేరకు ఇక్కడ కూడా స్టార్ హీరోయిన్ అవ్వాలని చూస్తోంది. అందులో భాగంగానే ఎన్టీఆర్ జోడీగా దేవర సినిమాలో నటిస్తోంది. ఈమూవీ షూటింగ్ ఆల్ మెస్ట్ అయిపోయింది. ఇది అపోయేలోగా.. రామ్ చరణ్ తో మూవీ కమిట్ అయ్యింది జాన్వీ.. ఈసినిమా ఓపెనింగ్ జరిగింది.. షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతోంది. అయితే ఈలోపు నాని సినిమాకు కూగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటున్నారు.
అయితే నాని-జాన్వి జోడిపై ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. నానికి అక్కలా ఉంటుంది జాన్వి అని కామెంట్స్ చేస్తున్నారు. మృణాల్ విషయంలోనే పొరపాటు చేశారు.. ఇప్పుడు ఈ పొరపాటు చేయకండి అంటూ సలహాలు ఇస్తున్నారు. మరి ఈ విషయంలో ఎంత వరకూ నిజం..? నిజంగా జాన్వీ నానితో నటిస్తుంది అంటే.. అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనేదిచూడాలి.