సాయి పల్లవి నుంచి ప్రతీ ఒక్కరు నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఏంటో తెలుసా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతుంది సాయి పల్లవి. కాని అందరు హీరోయిన్లకంటే భిన్నంగా ఉండే సాయి పల్లవి.. చాలా విషయంలో అందరికి ఆదర్శంగా నిలుస్తుంది. మరీ ముఖ్యంగా సాయి పల్లవి నుంచి హీరోయిన్లతో పాటు ప్రతీ ఒక్కరు నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి చూసుకుంటే?

మలయాళం సినిమా ప్రేమం నుంచి మొదలుపెట్టి, తమిళం, తెలుగు సినిమాలతో స్టార్ హీరోయని్ గా మారింది సాయి పల్లవి. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల్లో మెరుస్తుంది సాయి పల్లవి. ఈ సహజ సౌందర్యానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ సింప్లీ స్టార్ నుంచి ప్రతి అమ్మాయి నేర్చుకోవాల్సిన జీవిత సత్యాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని చూద్దాం.
సాయి పల్లవి తన సహజ సౌందర్యం, సినిమా పాత్రల ఎంపిక విషయంలో అందరికింటే చాలా భిన్నంగా ఉంటారు. అందుకే ఆమెకు అభిమానులు ఎక్కువ. బయట తాను ఎలా ఉంటుందో సినిమాల్లో కూడా అలానే ఉండటానికి ఇష్టపడుతుంది సాయి పల్లవి. డబ్బుకోసం పాకులాడకుండా.. విలువలకు ప్రాధాన్యత ఇస్తూ.. తనకు నచ్చిన సినిమాలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉంటుంది.
Also Read: మెగాస్టార్ చిరంజీవి , నాని కాంబినేషన్ లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?
స్టార్ అయినా సరే సాయి పల్లవి చదువు ఆపలేదు. ఎంబిబిఎస్ పూర్తి చేశారు. నటి అయినా చదువు పూర్తి చేయడం చూస్తే, చదువుతో పాటు తనకు ఇష్టమైన దాన్ని కూడా కొనసాగించాలనుకుంటారని తెలుస్తుంది.
Also Read: సైరా బానుతో విడాకులు, విమర్శలపై ఫస్ట్ టైమ్ నోరు విప్పిన ఏఆర్ రెహమాన్
సాయి పల్లవి పెద్ద స్టార్ అయినా, తాను పుట్టి పెరిగిన ఊరిని మర్చిపోలేదు. తన పని, ఎదుగుదల కోసం ఎప్పుడూ తన గతాన్ని గుర్తు చేసుకుంటారు. తానో సెలబ్రిటీలా కాకుండా అందరికితో కలివిడిగా ఉంటుంది.
Also Read: మహేష్ బాబు ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా? ఆమె పేరు తెలిస్తే షాక్ అవుతారు.
సాయి పల్లవి మంచి నటి మాత్రమే కాదు.. అంతకంటే ముందు మంచి డాన్సర్ కూడా. స్కూల్, కాలేజీ రోజుల నుంచి, రియాలిటీ షోల ద్వారా తన ప్రతిభను కొనసాగించారు. ఏ అవకాశాన్నీ వదులుకోలేదు.
Also Read: స్టార్ హీరోయిన్ కు విలన్ గా, ప్రియుడి గా నటించిన చిరంజీవి, ఎవరా నటి?
సాయి పల్లవికి ఒక్కసారిగా ఆత్మవిశ్వాసం రాలేదు. స్టేజ్ ఫియర్ తోనే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు ఏదైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనిని సాధిస్తుంటుంది.
Also Read: సినిమాకు 200 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే ఖరీదైన విలన్ ఎవరో తెలుసా?
సినిమాల కోసం ఆమె ఎంచుకునే పాత్రలన్నీ అర్థవంతమైనవే. కథ నచ్చాలి, కథలో తన పాత్ర బాగుండాలి, యాక్టింగ్ స్కోప్ ఉండాలి, అలా ఉంటేనే సినిమాలను ఒప్పుకుంటుంది. ఒప్పుకున్న సినిమాలో ఆ పాత్రకు న్యాయం చేస్తుంది సాయి పల్లవి.
సాయి పల్లవికి ప్రజాదరణ వచ్చాక కూడా అన్ని సినిమాలు హిట్ కాలేదు. కొన్ని సినిమాల్లో ఓటమి చవిచూసింది. కానీ ఆమె ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఓటమిలో కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో, కృషితో ముందుకు సాగింది. ప్రతి అమ్మాయిలోనూ ఈ ఆత్మవిశ్వాసం ఉండాలి. ఇలా అందరికి ఆదర్శంగా నిలుస్తుంది సాయి పల్లవి.