మరి ఈ ఇద్దరు కలిసి స్క్రీన్ పై కనిపిస్తే.. సినిమా చేస్తే.. ఫ్యాన్స్ ఎంత దిల్ కుష్ అవుతారు కదా? ప్రస్తుతం టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాల వైపు పరుగులు తీస్తోంది. మల్టీ స్టారర్ ట్రెండ్ తగ్గి.. సోలోగా పాన్ ఇండియాను గెలవాలని ప్రయత్నిస్తున్నారు స్టార్ హీరోలు. అయిదారేళ్ల ముందు వరకూ కూడా మల్టీ స్టారర్ సినిమాల హవా గట్టిగా కొనసాగింది కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
ఇక ఇది పక్కన పెడితే మెగాస్టార్ చిరంజీవి, నేచురల్ స్టార్ నాని ఈ ఇద్దరి కాంబోలో ఓ మల్టీ స్టారర్ మూవీ మిస్ అయ్యిందని మీకు తెలుసా? అవును వీరిద్దరి కాంబోలో మంచి కథతో మూవీ చేయాలని అప్పట్లో ప్రయత్నాలు జరిగాయట. కాని అవి సెట్స్ మీదకు వెళ్ళలేదు.
Also Read: స్టార్ హీరోయిన్ కు విలన్ గా, ప్రియుడి గా నటించిన చిరంజీవి, ఎవరా నటి?