MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Kangana Ranaut: జెన్‌జీ నిరసనకారులపై షాకింగ్ కామెంట్స్.. కంగనా రనౌత్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసిన బాలీవుడ్ స్టార్స్ !

Kangana Ranaut: జెన్‌జీ నిరసనకారులపై షాకింగ్ కామెంట్స్.. కంగనా రనౌత్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసిన బాలీవుడ్ స్టార్స్ !

Kangana Ranaut: నీట్ పేపర్ లీక్‌పై జెన్-జీ నిరసనలను 'గట్టర్ జనరేషన్' అని కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలోనే కంగనాకు ప్రముఖ సింగర్ విశాల్ దద్లానీ, సీజేపీ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 29 2026, 01:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
జెన్ జీ నిరసనలపై కంగనా షాకింగ్ కామెంట్స్
Image Credit : Chatgpt

జెన్-జీ నిరసనలపై కంగనా షాకింగ్ కామెంట్స్

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ (NEET) పేపర్ లీక్, జాతీయ స్థాయి పరీక్షల అక్రమాలపై జెన్-జీ యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అయితే, ఈ ఆందోళనలపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.

సోషల్ మీడియాలో స్పందించిన కంగనా, నిరసనల్లో పాల్గొన్న యువతను, వారి ప్రవర్తనను తీవ్రంగా తప్పుపట్టారు. జెన్-జీ నిరసనల వీడియోలు చూస్తుంటే తనకు వాంతులు వస్తున్నాయని, వారి భాష, ప్రవర్తన అత్యంత అసహ్యకరంగా ఉన్నాయని అన్నారు. అంతేకాకుండా, ఈ తరాన్ని 'గట్టర్ జనరేషన్' అని అభివర్ణిస్తూ, "ఇలాంటి వారిని ఎవరు కంటున్నారు? ఎలా పెంచుతున్నారు?" అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కనీసం చదువుసంధ్యలు లేని వీరు వ్యవస్థకు ఏమాత్రం ఉపయోగపడరని, సొంత ఇల్లు కూడా చక్కదిద్దలేరంటూ మరో వివాదానికి తెరలేపారు.

#WATCH | Delhi: BJP MP Kangana Ranaut says, "Our 75-year-old Prime Minister was targeted, and filthy abuse was hurled at his late mother. We, too, have participated in student protests. But what kind of students are these, and what kind of obscene language are they using? In what… pic.twitter.com/S4uFS0C9NI

— ANI (@ANI) July 28, 2026

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
విశాల్ దద్లానీ, రాఖీ సావంత్ ఘాటు కౌంటర్లు
Image Credit : @vishal dadlani

విశాల్ దద్లానీ, రాఖీ సావంత్ ఘాటు కౌంటర్లు

కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ విశాల్ దద్లానీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇన్స్టాగ్రామ్ లో కంగనాకు గట్టి కౌంటర్ ఇస్తూ, "రోడ్లపై నిరసన తెలుపుతున్న పిల్లలపై లాఠీచార్జ్ చేశారు, రాళ్లు రువ్వారు, టియర్ గ్యాస్ ప్రయోగించారు, పెల్లెట్ గన్లతో దాడులు చేశారు. మీ పెయిడ్ గూండాలు ఇప్పటికీ వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అంత చేసి మళ్లీ వారి భాష గురించే మీరు మాట్లాడుతున్నారా? ఆ తిట్లను మీరే స్వయంగా సంపాదించుకున్నారు మై ఫ్రెండ్!" అని కౌంటరిచ్చారు.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by VISHAL (@vishaldadlani)

పెయిడ్ క్యాంపెయిన్లు నడపడం ద్వారా ప్రభుత్వం ఎంత దిగజారిందో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. మరోవైపు వివాదాస్పద నటి రాఖీ సావంత్ సైతం కంగనాపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడింది. విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న వారిని ఉద్దేశించి మాట్లాడటానికి కంగనాకు ఏమాత్రం అర్హత లేదని, ఆమె మాటలు సమాజానికి హానికరం అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వదిలింది.

Rakhi Sawant ripped Kangana apart 🤣🤣 🔥 pic.twitter.com/z8LmXXnYCC

— MrsG (@Marvellous_MrsG) July 28, 2026

Related Articles

Related image1
Snake Bite First Aid: పాము కరిస్తే నిమిషాల్లో చేయాల్సిన పని ఇదే.. చాలామందికి తెలియని నిజాలు !
Related image2
High Paying Jobs in US: అమెరికాలో భారతీయులకు సిక్స్ ఫిగర్ జీతాలిచ్చే టాప్ హైపేయింగ్ ఉద్యోగాలు ఇవే
34
పొలిటికల్ హీట్: కాక్రోచ్ జనతా పార్టీ సౌరవ్ దాస్ కౌంటర్
Image Credit : Asianet News

పొలిటికల్ హీట్: కాక్రోచ్ జనతా పార్టీ సౌరవ్ దాస్ కౌంటర్

రాజకీయ వర్గాల నుంచి కూడా కంగనా వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కాంగ్రెస్ నేతలు రేణుకా చౌదరి, ఇమ్రాన్ ప్రతాప్‌గఢీలతో పాటు సమాజ్‌వాదీ పార్టీ, ఎంఐఎం నేతలు కూడా కంగనాపై విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా కోసం డిమాండ్ చేసిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధి సౌరవ్ దాస్ కంగనాకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

"కంగనా రనౌత్‌ను ఆమె సొంత పార్టీ బీజేపీలోనే ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. అలాంటప్పుడు ఈ దేశ యువత లేదా జెన్-జీ ఆమె మాటలను ఎందుకు పట్టించుకుంటారు?" అని ఎద్దేవా చేశారు. ఎంపీగా గెలిచిన కొత్తలో "రాజకీయాల్లో ఇంత పని ఉంటుందని అనుకోలేదు" అని కంగనా మాట్లాడిన వీడియోలను గుర్తు చేస్తూ, ఆమె బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నించారు. యువత ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి పోరాడుతుంటే, కంగనా తన బాధ్యతలను విస్మరిస్తున్నారని మండిపడ్డారు.

#WATCH | Delhi: On BJP MP Kangana Ranaut's statement, Cockroach Janta Party Chief Spokesperson Saurav Das says, “Even members of her own party don't pay much heed to Kangana Ranaut or take her seriously, so why should we? I don't think anyone in Gen Z, Gen Alpha, or any younger… pic.twitter.com/Hz97P00JXC

— ANI (@ANI) July 28, 2026

44
కంగనా వర్సెస్ సీజేపీ ఫైట్
Image Credit : ANI

కంగనా వర్సెస్ సీజేపీ ఫైట్

సౌరవ్ దాస్ చేసిన వ్యాఖ్యలపై కంగనా రనౌత్ కూడా ఊరుకోకుండా మళ్లీ తిప్పికొట్టారు. సీజేపీ ప్రతినిధిని పనికిరానివాడు అని సంబోధిస్తూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో విమర్శలు గుప్పించారు. విద్యార్థి ఉద్యమాల పేరుతో ప్రధాని నరేంద్ర మోదీని, ఆయన దివంగత తల్లిని అసభ్యకరమైన పదజాలంతో దూషించారని, అది ఏ రకంగానూ సమర్థనీయం కాదని అన్నారు.

16 ఏళ్ల వయసు నుంచే తాము స్వశక్తితో కెరీర్‌ను నిర్మించుకున్నామని, తల్లిదండ్రులపై భారం కాలేదని గుర్తుచేశారు. "మీరు మిమ్మల్ని బొద్దింకలు అని పిలుచుకుంటున్నారు, అలాగే ప్రవర్తిస్తున్నారు. చెత్తను, కంపును సమాజంపై రుద్దడం ఆపండి" అంటూ కంగనా ఈ వివాదం మరింత రేపింది. ప్రస్తుతం ఈ మాటల యుద్ధం సోషల్ మీడియాలోనూ, బాలీవుడ్ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వినోదం
భారత దేశం
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Meenakshi Chaudhary: ఆ రొమాంటిక్‌ హీరోతో డేట్‌కి వెళ్తా.. మీనాక్షి చౌదరీ ఓపెన్‌ స్టేట్‌మెంట్‌
Recommended image2
Hi Movie Box Office: నయనతార మూవీకి షాకింగ్‌ కలెక్షన్లు.. పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా మరీ ఇంతనా?
Recommended image3
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి స్టార్‌ కమెడియన్స్.. రేటింగ్‌ కోసం నాగార్జున అదిరిపోయే ప్లాన్‌
Related Stories
Recommended image1
Snake Bite First Aid: పాము కరిస్తే నిమిషాల్లో చేయాల్సిన పని ఇదే.. చాలామందికి తెలియని నిజాలు !
Recommended image2
High Paying Jobs in US: అమెరికాలో భారతీయులకు సిక్స్ ఫిగర్ జీతాలిచ్చే టాప్ హైపేయింగ్ ఉద్యోగాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved