MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ramayana Trailer: బ్రహ్మ ముహూర్తంలో రామాయణ ట్రైలర్.. 250 కోట్లకు రైట్స్ తీసుకుంది ఎవరో తెలుసా? హాలీవుడ్ లో రిలీజ్ చేసేది ఎవరంటే?

Ramayana Trailer: బ్రహ్మ ముహూర్తంలో రామాయణ ట్రైలర్.. 250 కోట్లకు రైట్స్ తీసుకుంది ఎవరో తెలుసా? హాలీవుడ్ లో రిలీజ్ చేసేది ఎవరంటే?

Ramayana Trailer: నితేష్ తివారీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'రామాయణ'. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం ట్రైలర్‌ను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఎప్పుడో తేలిపోయింది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 29 2026, 12:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బ్రహ్మ ముహూర్తంలో రామాయణ ట్రైలర్‌
Image Credit : Instagram

బ్రహ్మ ముహూర్తంలో రామాయణ ట్రైలర్‌

ఇండియా మొత్తం ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది 'రామాయణ'మే. ఈ సినిమా గురించి వచ్చిన ప్రతి చిన్న అప్‌డేట్ కూడా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఈ భారీ చిత్రం రెండు భాగాలుగా థియేటర్లలోకి రానుంది. మొదటి భాగం దీపావళికి రిలీజ్ కానుండగా, దీనికి సంబంధించిన ఓ సూపర్ అప్‌డేట్‌ను మేకర్స్ ఇచ్చారు. జూలై 30, గురువారం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో 4:15 గంటలకు 'రామాయణ' ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రికార్డు ధరకు రామాయణ మ్యూజిక్ రైట్స్..
Image Credit : instagram

రికార్డు ధరకు రామాయణ మ్యూజిక్ రైట్స్..

ఇదిలా ఉంటే 'రామాయణ' మ్యూజిక్ రైట్స్ రికార్డు ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ సంస్థ టీ-సిరీస్ ఈ హక్కులను దక్కించుకుంది. ఏకంగా 75 కోట్ల రూపాయల అడ్వాన్స్ డీల్ కుదిరిందని, ఇండియన్ సినిమాలో ఇది అతిపెద్ద మ్యూజిక్ డీల్స్‌లో ఒకటని ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా రిపోర్ట్ చేశారు. ఇక ఈ సినిమా ఇండియా డిస్ట్రిబ్యూషన్ హక్కులను కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం 250 కోట్లు చెల్లించినట్లు 'వెరైటీ' పత్రిక రిపోర్ట్ చేసింది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ దగ్గర ఉన్నాయి.

34
రామాయణ లో పాత్రధారులు ఎవరెవరంటే?
Image Credit : Instagram

రామాయణ లో పాత్రధారులు ఎవరెవరంటే?

నితేష్ తివారీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ యశ్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. హనుమంతుడిగా సన్నీ డియోల్, కైకేయిగా ప్రముఖ నటి శోభన నటిస్తున్నారు. ఒకప్పుడు దూరదర్శన్‌లో వచ్చిన రామాయణంలో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ ఈ సినిమాలో దశరథ మహారాజుగా కనిపించనుండటం విశేషం. లక్ష్మణుడిగా రవి దుబే, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, విశ్వామిత్రుడిగా అజింక్య డియో, ఇంద్రుడిగా కునాల్ కపూర్ నటిస్తున్నారు.

44
ఎన్నో విశేషాల రామాయణ..
Image Credit : Asianet News

ఎన్నో విశేషాల రామాయణ..

ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, ఎనిమిది సార్లు ఆస్కార్ గెలుచుకున్న ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో DNEG, యశ్ సొంత నిర్మాణ సంస్థ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఆస్కార్ విజేతలైన హన్స్ జిమ్మర్, ఏ.ఆర్. రెహమాన్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం మరో పెద్ద హైలైట్. ఈమూవీ రిలీజ్ కోసం అభిమానులు, ఆడియన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరి రిలీజ్ తరువాత రామాయణ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR: ఆ రోజు ధైర్యం చెప్పడానికి కుటుంబ సభ్యులెవరూ రాలేదు, చాలా బాధ పడ్డా.. జూ.ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగం
Recommended image2
Bigg Boss Telugu 10: కవరింగ్ స్టార్ రోహిత్ అంటూ నామినేట్ చేసిన త్రిగుణ్, షాలినికి ఇచ్చి పడేసిన రామ్ ప్రసాద్
Recommended image3
Allu Sneha: సోషల్ మీడియాలో దూసుకుపోతున్న అల్లు అర్జున్ భార్య.. ఫ్యామిలీని చూసుకుంటూనే బిజినెస్ లో సంపాదన
Related Stories
Recommended image1
krishna: నీతో సినిమా చేస్తే అడ్రస్‌ గల్లంతే, కృష్ణను భయపెట్టిన స్టార్‌ ప్రొడ్యూసర్‌.. సూపర్‌ స్టార్‌ దెబ్బకి రికార్డులు బ్రేక్‌
Recommended image2
Jana Nayagan: దళపతి విజయ్ సినిమా బోల్తా కొట్టడానికి 5 ప్రధాన కారణాలు.. జన నాయగన్ కలెక్షన్స్ ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved