MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • నిధి అగర్వాల్ పై కాజల్‌ ఫ్యాన్స్ ట్రోల్స్.. కొంప ముంచిన `అందరికి నమస్కారం`.. క్లారిటీ ఏంటంటే?

నిధి అగర్వాల్ పై కాజల్‌ ఫ్యాన్స్ ట్రోల్స్.. కొంప ముంచిన `అందరికి నమస్కారం`.. క్లారిటీ ఏంటంటే?

నిధి అగర్వాల్‌ పై కాజల్‌ ఫ్యాన్స్ ట్రోల్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో నా నా రచ్చ చేస్తున్నాయి. దీనికి `ఇస్మార్ట్ శంకర్` బ్యూటీ వివరణ ఇచ్చింది. అసలేం జరిగిందో చెప్పింది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 15 2025, 10:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నిధి అగర్వాల్‌ ఒకప్పుడు సెన్సేషన్‌గా మారింది. `ఇస్మార్ట్ శంకర్` మూవీతో ఆమె ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కనిపించకుండా పోయింది. తాజాగా మళ్లీ ఇప్పుడు సందడి చేస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి. ఇవి భారీ పాన్‌ ఇండియా మూవీస్‌ కావడం విశేషం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ నేపథ్యంలో సడెన్‌గా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నిధి అగర్వాల్‌. ఆమెపై స్టార్‌ హీరోయిన్ కాజల్ ఫ్యాన్స్ ట్రోల్‌ చేస్తుండటం గమనార్హం. మరి కాజల్‌ ఫ్యాన్స్ నిధిని ఎందుకు టార్గెట్‌ చేశారు, ఎందుకు ట్రోల్‌ చేస్తున్నారు? అసలేం జరిగింది? ఏం చేస్తున్నారనేది చూస్తే.

read  more: `గేమ్‌ ఛేంజర్‌` నేను బాగా చేశాను, ఫలితంపై శంకర్‌ సంచలన స్టేట్‌మెంట్‌.. కారణం ఎవరు?
 

36

ఇటీవల నిధి అగర్వాల్‌ సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్ తో ఛాట్ చేసింది. అందులో ఫ్యాన్స్ తో మాట్లాడుతూ తాను `అందరికి నమస్కారం` అని చెప్పే బ్యాచ్‌ కాదు అంటూ కామెంట్‌ చేసింది. ఇదే ఇప్పుడు ఆమె కొంప ముంచింది. కాజల్‌ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమవుతుంది. మరి దీనికి, కాజల్‌కి లింకేంటంటే.. సాధారణంగా కాజల్‌ ఎప్పుడూ మాట్లాడినా తెలుగులో అందరికి నమస్కారం అనే పదం మాత్రమే వాడుతుంది. మిగిలినది ఇంగ్లీష్‌లో చెబుతుంది. ఆ పదాన్ని ఆమె ఎక్కడైనా వాడుతుంటుంది. వాడే విధానం కూడా కాస్త భిన్నంగా ఉంటుంది. అదే నోటెడ్‌ అవుతుంటుంది. 
 

46
Kajal Aggarwal

Kajal Aggarwal

అయితే నిధి అగర్వాల్‌ కూడా అదే పదం వాడుతూ తాను అలాంటి బ్యాచ్‌ కాదు అని చెప్పడంతో కాజల్‌ ని ఉద్దేశించే ఆమె ఈ కామెంట్‌ చేసిందని, కాజల్‌పై సెటైర్ వేసిందని భావించిన ఫ్యాన్స్ నిధి అగర్వాల్‌పై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయం నిధి అగర్వాల్‌ దృష్టికి తీసుకొచ్చాడు యాంకర్‌ నిఖిల్‌. దీనికి ఆమె క్లారిటీ ఇచ్చింది. తాను చెప్పిన ఉద్దేశ్యం ఏంటో వివరించింది. 
 

56

తాను సోషల్‌ మీడియాలో చాట్‌ చేస్తున్నాను. ఆ సమయంలో మీకు తెలుగు వచ్చా? తెలుగులో మాట్లాడండి అని అడిగారట. దానికి నిధి అగర్వాల్‌ తనకు తెలుగు తెలుసు అని, కానీ కేవలం  నేను `అందరికి నమస్కారం` బ్యాచ్ కాదు. ఇది నా సెల్ఫ్‌గా చెప్పిన పదం. ఎవరినీ ఉద్దేశించి అన్నది కాదంటూ వెల్లడించింది నిధి అగర్వాల్‌. 15, 20ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. ఎన్నో సినిమాలు చేశారు, వారిని ఎందుకు అంటాను. ఇంకా వారికే నా మద్దతు ఉంటుంది అని చెప్పింది. మొత్తానికి కాజల్‌ ఫ్యాన్స్ ని కూల్‌ చేసే ప్రయత్నం చేసింది. 

66

ప్రస్తుతం నిధి అగర్వాల్‌ చేతిలో పవన్ కళ్యాన్‌ హీరోగా రూపొందుతున్న `హరిహర వీరమల్లు`, ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న `ది రాజా సాబ్‌` చిత్రాలు ఉన్నాయి. ఈ రెండు సినిమా ఫలితాలను బట్టి ఆమె కెరీర్‌ ఆధారపడి ఉంది. 


read more:దేవర బతికే ఉన్నాడా? ప్రకాష్‌ రాజే యతినా? `దేవర 2` అసలు స్టోరీ?

also read: నయనతార అహంకారం.. తన సిబ్బందిని ఇబ్బంది పెట్టిన లేడీ సూపర్ స్టార్

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
బాలకృష్ణ హ్యాండిచ్చినట్లే, రవితేజతో క్రేజీ డైరెక్టర్ మూవీ.. ఇరుముడి జోష్ తో మాస్ మహారాజ వరుస సినిమాలు
Recommended image2
Sunil: హీరోగా కోలుకోలేని దెబ్బ, అందుకే సునీల్ తన బంధువునే పక్కన పెట్టారా..ఇద్దరి మధ్య ఏం జరిగింది ?
Recommended image3
Suman: శోభన్‌ బాబు, సుమన్‌, నాగార్జున ముగ్గురిలో ఉన్న మైనస్‌ ఒక్కటే.. అందుకే మెగాస్టార్‌ కాలేకపోయారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved