- Home
- Entertainment
- Maala Song: థియేటర్స్ నుంచి ఈ సాంగ్ కట్ చేసింది అందుకేనా, మాలా వీడియో సాంగ్..వెంకీ అభిమానులు చూడకపోవడమే బెటర్
Maala Song: థియేటర్స్ నుంచి ఈ సాంగ్ కట్ చేసింది అందుకేనా, మాలా వీడియో సాంగ్..వెంకీ అభిమానులు చూడకపోవడమే బెటర్
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదర్శ కుటుంబం చిత్రం థియేటర్స్ లో నిరాశ పరిచింది. ఈ సినిమాని అంతా మరచిపోతున్న టైంలో మరోసారి ట్రోలింగ్ మొదలైంది.

ఆదర్శ కుటుంబం మూవీ
టాలీవుడ్ లో డైలాగ్ రైటింగ్ లో సరికొత్త స్టాండర్డ్స్ సెట్ చేసిన దర్శకులలో త్రివిక్రమ్ ఒకరు. తన రచన, దర్శకత్వంలో టాప్ డైరెక్టర్ గా ఎదిగారు. అయితే ఇటీవల త్రివిక్రమ్ స్టామినాకు తగ్గ సినిమా పడడం లేదు. చివరగా త్రివిక్రమ్ నుంచి వచ్చిన ఆదర్శ కుటుంబం మూవీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. దీనితో త్రివిక్రమ్ కి విమర్శలు తప్పలేదు.
బాక్సాఫీస్ వద్ద బోల్తా
త్రివిక్రమ్ రచనలో బలం, దర్శకత్వంలో మ్యాజిక్ ఎక్కడికి పోయింది అని అభిమానులు చర్చించుకుంటున్నారు. త్రివిక్రమ్ ఏదో సాదాసీదాగా సినిమా చేసినట్లు ఉంది కానీ ఫోకస్ పెట్టి చేయలేదు అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఆదర్శకుటుంబం చిత్రం థియేట్రికల్ రన్ ముగిసింది. ట్రేడ్ అనలిస్టులు ఈ చిత్రం ఫ్లాప్ అని తేల్చేశారు. ఈ సినిమాని అంతా మరచిపోతున్న టైంలో మరోసారి త్రివిక్రమ్ పై ట్రోలింగ్ మొదలైంది.
థియేటర్స్ లో కనిపించని మాలా సాంగ్
దీనికి కారణం ఈ చిత్రంలోని మాలా అనే సాంగ్. మూవీ రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ కోసం మాలా లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటలోని రొమాంటిక్ లిరిక్స్ పై అప్పుడే విమర్శలు వచ్చాయి. సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్స్ లో ఈ సాంగ్ కనిపించలేదు. ఫైనల్ వర్షన్ నుంచి పాటని తొలగించారు. థియేటర్ వెర్షన్ లో ఈ సాంగ్ ని తలగించడం మంచిదైంది. లేకుంటే అప్పుడే ఇంకాస్త విమర్శలు ఎక్కువయ్యేవి.
వీడియో సాంగ్ రిలీజ్, త్రివిక్రమ్ పై విమర్శలు
తాజాగా మాలా వీడియో సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. యూట్యూబ్ లో రిలీజ్ అయినప్పటి నుంచి త్రివిక్రమ్ పై ట్రోలింగ్ మొదలైంది. ఈ సాంగ్ ని త్రివిక్రమ్ వెంకటేష్ ఇమేజ్ కి పూర్తి భిన్నంగా రొమాంటిక్ గా చిత్రీకరించారు. అందుకే గురూజీపై విమర్శలు మొదలయ్యాయి. వెంకటేష్ ఇమేజ్, ఏజ్ దృష్టిలో పెట్టుకుని కూడా త్రివిక్రమ్ ఈ సాంగ్ ని ఎలా చిత్రీకరించారు అంటూ విమర్శిస్తున్నారు.
వెంకీ అభిమానులు చూడకపోవడమే బెటర్
కొందరయితే వెంకటేష్ అభిమానులు ఈ సాంగ్ ని చూడకపోవడమే బెటర్ అని అంటున్నారు. గతంలో కూడా వెంకీ రొమాంటిక్ సాంగ్స్ చేశారు. కానీ ఈ సాంగ్ లో వెంకీ, నివేతా పేతురాజ్ కెమిస్ట్రీ.. లిరిక్స్, హావ భావాలు ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు.















