నయనతార అహంకారం.. తన సిబ్బందిని ఇబ్బంది పెట్టిన లేడీ సూపర్ స్టార్
స్టార్ హీరోయిన్ నయనతార తన అహంకారం చూపించారంటూ విమర్శలు ఫేస్ చేస్తోంది. 6 గంటలు ఆలస్యంగా వచ్చి తన సింబంధిని ఇబ్బంది పెట్టిందట లేడీ సూపర్ స్టార్. అసలు విషయం ఏంటంటే..?
నయనతార
సౌత్ ఇండియన్ హీరోయిన్ నయనతార తన ఇరవై సంవత్సరాల సినీ జీవితంలో అనేక పాత్రల్లో నటించింది. పెళ్లైన తర్వాత భర్త, పిల్లలతో సంతోషంగా ఉన్నప్పటికీ, ఆరుకు పైగా సినిమాల్లో నటిస్తోంది. టెస్ట్, మన్నాంగట్టి వంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రాక్కాయి, టాక్సిక్ వంటి 6 సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
నటి నయనతార వివాదం
లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార వివాదాస్పద నటిగా కూడా పేరు తెచ్చుకుంది. ఆమె కెరీర్ లో ఎన్నో వివాదాలు ఆమెను చుట్టుముట్టాయి. గతేడాది నెట్‌ఫ్లిక్స్‌లో ' తన పెళ్ళి వీడియో లో సినిమా క్లిప్స్ వాడినందుకు 10 కోట్ల నష్టపరిహారం కోరుతూ దనుష్ కేసు వేశారు. నయనతార కూడా వివరణ ఇచ్చారు. ఈ కేసు తీర్పు జనవరి 22న వెలువడనుంది.
Also Read: 50 సెకండ్ల యాడ్ కోసం 5 కోట్లు తీసుకున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?
నయనతార సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్
కొందరు నయనతారకు మద్దతుగా నిలిస్తే, మరికొందరు ఆమెపై విమర్శలు చేస్తున్నారు. నయనతార సినిమాలతో పాటు వ్యాపారంలోనూ రాణిస్తోంది. ఇప్పటికే బ్యూటీ ప్రొడక్ట్స్, లిప్ కేర్ కంపెనీలను నిర్వహిస్తున్న నయనతార, గతేడాది ఫెమీ9 శానిటరీ నాప్కిన్ కంపెనీని ప్రారంభించింది. ఈ కంపెనీ ఆధ్వర్యంలో మధురైలో ఓ భారీ కార్యక్రమం జరిగింది.
Also Read: విజయ్ దళపతి వారసుడికి మాట ఇచ్చిన అజిత్, ఇంతకీ విషయం ఏంటి..?
నయనతార 6 గంటలు ఆలస్యం
ఉదయం తొమ్మిది గంటలకు నయనతార కార్యక్రమానికి హాజరవుతారని చెప్పినప్పటికీ, ఆమె భర్త విఘ్నేష్ శివన్‌తో ఆరు గంటలు ఆలస్యంగా వచ్చారు. దీంతో మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియాల్సిన కార్యక్రమం సాయంత్రం ఆరు గంటల వరకు సాగింది. దీంతో కార్యక్రమానికి వచ్చిన చాలామంది ఇబ్బందులు పడ్డారు.
ఫెమీ 9 ఈవెంట్ ఫోటోలు
ఫెమీ9 కార్యక్రమంలో తీసిన కొన్ని ఫోటోలను నయనతార పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. నయనతార అహంకారంతో ఇలా చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
నయనతార అహంకారం
షూటింగ్‌లకు సమయానికి వచ్చే నయనతార, తన దగ్గర పనిచేసేవారిని ఇలా ఎందుకు వెయిట్ చేయించింది? ఇలా చేయడం నయనతార అహంకారాన్ని చూపిస్తుందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. తన సిబ్బంది అంటే అంత చిన్న చూపు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు.