దేవర బతికే ఉన్నాడా? ప్రకాష్ రాజే యతినా? `దేవర 2` అసలు స్టోరీ?
ఎన్టీఆర్ నటించిన `దేవర 2`కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి. దేవర పాత్ర చనిపోలేదంటూ క్రేజీ లీక్ వైరల్ అవుతుంది.
ఎన్టీఆర్ నటించిన `దేవర` మూవీ సెప్టెంబర్‌లో విడుదలై భారీ విజయం సాధించింది. నెగటివ్ టాక్ వచ్చినా మూవీ మంచి కలెక్షన్లని సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది సుమారు ఐదు వందల కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. మాస్ ఎలిమెంట్లు, యాక్షన్ సీన్లు, సెంటిమెంట్ సినిమాని బతికించాయి. నార్త్ ఆడియెన్స్ కి అవి బాగా కానెక్ట్ కావడంతో `దేవర` భారీ వసూళ్లని రాబట్టింది.
Devara
అయితే `దేవర`లో దేవర పెద్ద ఎన్టీఆర్ చనిపోయినట్టు చూపిస్తారు. కొడుకే చంపినట్టు చూపిస్తారు. అదే సమయంలో వర కూడా చనిపోయినట్టుగా చూపిస్తారు. యతి ఎవరు? అనేది చూపించలేదు, హై ఇచ్చి వదిలేశారు. తాజాగా `దేవర 2` కథ ఇదే అని ఓ రైటర్ రివీల్ చేశాడు. గూస్‌బంమ్స్ తెప్పించే విషయాలను పంచుకున్నారు.
read more: `గేమ్ ఛేంజర్` రిజల్ట్ పై ఫస్ట్ టైమ్ రామ్ చరణ్ స్పందన.. పోస్ట్ వైరల్, ఏమన్నాడంటే?
నిజానికి తండ్రి ఎన్టీఆర్ దేవర చనిపోలేదట. ఆయన సముద్రంలోనే ఉన్నాడట. కత్తిపోటుతో ఉన్న దేవరని కోస్టల్ గార్డ్ కాపాడతాడట. ఈ క్రమంలో ఫైట్ చేసింది కూడా కోస్టల్ గార్డే అని, ఎక్స్ రూపంలో కట్ చేసింది కూడా వాళ్లే అని అంటున్నారు.
సముద్రంలో ఫైట్ చేసింది కూడా పిల్లవాడు కాదు, దేవరనే అని, పార్ట్ 2లో దాన్ని చూపిస్తారట. రెండో పార్ట్ లో కథ కోస్టల్‌లో కాదు, సిటీలో జరుగుతుంది. ఆయుధాలు వ్యాపారం ఎక్కడెక్కడ జరుగుతుంది? దీని వెనకాలు ఎవరెవరు ఉన్నారనేది దేవర ఛేదించుకుంటూ వస్తాడట.
అదే సమయంలో యతి పాత్ర గురించి ప్రారంభంలో భారీ హై ఇచ్చారు. ఆయన ఎవరు? ఆ పాత్రలో ఎవరు కనిపిస్తారనేది క్యూరియాసిటీగా ఉంటుంది. అయితే ఆ యతి ఎవరో కాదు ప్రకాష్ రాజే అట. పోలీస్ ఆఫీసర్ అజయ్‌కి ఆయనే దేవర కథ చెప్పిన విషయం తెలిసిందే. ఈ కథ చెప్పడం అయిపోయిన తర్వాత నువ్వు చెప్పిందంతా నేను నమ్మడం లేదు అని, నువ్వు అరెస్ట్ అని ట్విస్ట్ ఇస్తాడట.
`దేవర 2`లోనే అసలు కథ అంతా ఉంటుందని అంటున్నారు. ఓ క్రిటిక్స్ ఈ విషయాన్ని వెల్లడించారు. మరి ఇందులో నిజం ఎంతా అనేది తెలియాల్సి ఉంది. కొంత నిజానికి దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఈ విషయం మాత్రం చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన `దేవర` చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇందులో జాన్వీ కపూర్, శృతి మరాఠి హీరోయిన్లుగా చేశారు. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, గెటప్ శ్రీను వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. సుధాకర్ మిక్కిలినేని, కళ్యాణ్ రామ్ కలిసి నిర్మించిన ఈ చిత్రం సుమారు రూ.500కోట్లు వసూలు చేసిందని అంచనా.
దీనికి పార్ట్ 2 `దేవర 2` పై వర్క్ జరుగుతుంది. స్క్రిప్ట్ పనుల్లో కొరటాల శివ ఉన్నాడు. ఈ ఏడాది ద్వితీయార్థంలో మూవీ షూటింగ్ ప్రారంభించబోతున్నారట. ప్రస్తుతం ఎన్టీఆర్ `వార్ 2`లో నటిస్తున్నారు. త్వరలోనే ప్రశాంత్ నీల్ మూవీ ప్రారంభం కాబోతుంది.
read more: జైలర్ 2 టీజర్.. రజనీ బ్లాక్ బస్టర్ కాంబో లోడింగ్.. త్రివిక్రమ్ ఇక రిలాక్స్
also read: `మద గజ రాజా` 2 రోజుల కలెక్షన్.. విశాల్ కి మామూలు జాక్ పాట్ కాదుగా!