- Home
- Entertainment
- నా భర్తపైనే ఎందుకు అంత పగబట్టారు, సూర్య సినిమాలపై నెగెటీవ్ కామెంట్ విషయంలో జ్యోతిక ఆవేదన
నా భర్తపైనే ఎందుకు అంత పగబట్టారు, సూర్య సినిమాలపై నెగెటీవ్ కామెంట్ విషయంలో జ్యోతిక ఆవేదన
సూర్య సినిమాలకు మాత్రమే ఎందుకు అంత నెగెటీ్ కామెంట్స్ వస్తుంటాయి. నా భర్త ఏం తప్పు చేశాడు. ఎందుకు అలా విమర్శిస్తున్నారంటూ స్టార్ హీరోయిన్, సూర్య భార్య జ్యోతిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే?

స్టార్ హీరో సూర్య భార్య, ప్రముఖ నటి జ్యోతిక ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా నటిస్తున్నారు. ఆమె నటించిన డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ విడుదలైంది. ఈసందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.
Also Read: సౌందర్య ని మోహన్ బాబు హత్య చేయించాడా? నేనే సాక్ష్యం అంటూ కంప్లైంట్ చేసిన వ్యక్తి ఎవరు?
నటి జ్యోతిక
సూర్య నటించిన కంగువ చిత్రం విడుదలైనప్పుడు వచ్చిన నెగెటివ్ విమర్శలు హద్దులు దాటాయని, సినిమాలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, మంచి విషయాల గురించి ఎవరూ మాట్లాడలేదని ఆమె అన్నారు.
Also Read: బిగ్ బాస్ తెలుగు టీమ్ కు విజయ్ దేవరకొండ కండీషన్లు, సీజన్ 9 కోసం రౌడీహీరో రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
నెగెటివ్ రివ్యూ గురించి జ్యోతిక
ఆమె మాట్లాడుతూ, “నాకు చెత్త సినిమాలు అంటేనే సమస్య. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన చాలా చెత్త సినిమాలను నేను చూశాను. కానీ ఆ సినిమాలను పెద్ద మనసుతో విమర్శిస్తారు.
Also Read: 2025లో 10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న టాప్ 6 హీరోయిన్లు ?
జ్యోతిక సూర్య
కొన్ని సన్నివేశాలు బాగా లేకపోవచ్చు. కానీ సినిమా కోసం చాలా కష్టపడి పనిచేశారు. కొన్ని చెత్త సినిమాల కంటే సూర్య సినిమాలు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయని చూసినప్పుడు బాధేసింది అని ఆమె అన్నారు. జ్యోతిక అన్న ఆ చెత్త సినిమాలు ఏంటో తెలియదు కాని..సూర్య విషయంలో మాత్రం ఆమె బాగా హార్ట్ అయినట్టుగా తెలుస్తోంది.
Also Read: మోహన్ బాబు వల్ల బోల్తా కొట్టిన చిరంజీవి సినిమా, బాక్సాఫీస్ దగ్గర విలవిల్లాడిన మెగా మూవీ ?