మోహన్ బాబు దెబ్బకు డిజాస్టర్ అయిన చిరంజీవి సినిమా, బాక్సాఫీస్ దగ్గర విలవిల్లాడిన మెగా మూవీ ?
మెగా మంచు వార్ ఎప్పుడూ జరుగుతూ ఉండేదే. అయితే అందులో ఎప్పుడూ చిరంజీవిదే పై చేయి అయితా వస్తుంది. కాని ఓ సందర్భంలో మాత్రం మోహన్ బాబు దేబ్బకు చిరంజీవి సినిమా విలవిల్లాడిందట. ఇంతకీ మెగా మూవీని రెబ్బకొట్టిన మంచు వారి సినిమా ఏదో తెలుసా?

ఫిల్మ్ ఇండస్ట్రీలో స్నేహితులుగా ఉంటూనే కోల్డ్ వార్ నడిపించే వారు ఇద్దరే ఇద్దరు ఉన్నారు. వారెవరో అందరికి తెలుసు. మెగాస్టార్ చిరంజీవి, మంచు మోహన్ బాబు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్నేహితులుగా కనిపించినా.. కోల్డ్ వార్ నడిచేది వీరిద్దరిమధ్యే.
బయట ఎక్కడకనిపించినా ఫ్రెండ్స్ అంటూ హగ్ చేసుకుంటారు. కాని పోటీ పడాల్సిన చోట మాత్రం బద్ద శత్రువుల్లా ఉంటారు. దానికి బెస్ట్ ఎక్జ్సాపుల్ మా ఎలక్షన్స్.
అప్పుడు ఎంత వార్ జరిగిందో అందరికి తెలిసిందే.ఇక వారు ఎంత మంచిగా ఉన్నా.. ఎప్పటికప్పుడు పోటీనే కనిపిస్తుంది. ఇక గతంలో మోహాన్ బాబు వల్ల మెగాస్టార్ చిరంజీవి సినిమా ప్లాప్ అయ్యిందని మీకు తెలుసా..?
Also Read: బిగ్ బాస్ తెలుగు టీమ్ కు విజయ్ దేవరకొండ కండీషన్లు

ఇక గతంలో కూడా మోహాన్ బాబు వల్ల మెగాస్టార్ చిరంజీవి సినిమాల మద్య కూడా పోటీ గట్టిగా ఉండేదట. హీరోలలో చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగినా.. అటు లెజెండరీ యాక్టర్ గా మోహన్ బాబు కూడా చిరంజీవి సినిమాలకు గట్టి పోటీ ఇచ్చిన రోజులు ఉన్నాయట.
ఇద్దరి మధ్య ఎంత పోటీ ఉన్నా.. మెగాస్టార్ గా చిరంజీవి ఎక్కువ విజయం సాధిస్తుంటారు. అయితే మెగా మూవీని పక్కకు నెట్టి.. మంచు వారి సినిమా ఒకటి హిట్ అయ్యిందట. అంతే కాదు మోహాన్ బాబు దెబ్బకు చిరంజీవి సినిమా డిజాస్టర్ అయ్యి.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కోట్టిందట ఇంతకీ ఆ సినిమా ఏంటి?
Also Read: అల్లు అర్జున్ కు షాక్ , పుష్ప2 రికార్డ్స్ ను బ్రేక్ చేసిన ఛావా మూవీ, ఎలా సాధ్యం అయ్యింది?

పేద రాయుడు
మోహాన్ బాబు హీరోగా రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పెద్ద రాయుడు. తమిళంలో కేఎస్ రవికుమార్ డైరెక్ట్ చేసిన ఈసినిమా హక్కులను మోహన్ బాబు తీసుకున్నారు. తెలుగులో రవిరాజ పినిశెట్టి డైరుక్షన్ లో రీమేక్ చేశారు.
తమిళంలో శరత్ కుమార్ హీరోగా నటిస్తే.. తెలుగులో మోహన్ బాబు డ్యూయల్ రోల్ చేశారు. సూపర్ స్టార్ రజినీకాంత్ పాపా రాయుడిగా గెస్ట్ రోల్ చేశారు. ఇక ఈసినిమా అప్పట్లో ఎంత సంచలనంగా మారిందతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 30 ఏళ్ళ క్రితం వచ్చిన ఈసినిమా దెబ్బకి రికార్డ్ లు బ్రేక్ అయ్యాయి.
Also Read: రష్మికను బెదిరించలేదు, మాట మార్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు.

పెదరాయుడిగా మోహాన్ బాబు పాత్ర.. ఎంత మంది ట్రై చేసినా.. ఆయనంత పర్ఫెక్ట్ గా చేయలేకపోయారు. అంతే కాదు ఈసినిమాకు సూపర్ స్టార్ రజినీకాంత్ ఉన్న 20 నిమిషాలు హైలెట్ అని చెప్పాలి.
ఇక ఇదే టైమ్ లో.. పెదరాయుడు సినిమాకు పోటీగా మెగాస్టార్ నుంచి బిగ్ బాస్ సినిమా రిలీజ్ అయ్యింది.కాని ఆ సినిమా చిరంజీవికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. 1995 జూన్ 15న ఈరెండు సినిమాలు ఒకే సారి రిలీజ్ అయ్యాయి.
పెద్ద రాయుడు సినిమా రిలీజ్ అయ్యే వరకూ పెద్దగా అంచనాలు లేవు. చిరంజీవి సినిమా మాత్రం భారీ అంచనాలతో విడుదల అయింది. దాంతో పెదరాయుడు సినిమా పని అయిపోయింది అనుకున్నారు అంతా.
Also Read:రష్మికను బెదిరించలేదు, మాట మార్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు.

అనుకున్నట్టే కొద్ది రోజులు ఆడలేదట సినిమా. కాని రాను రాను పుంజుకోవడంతో పాటు.. అందరి అభిమానం సాధించింది. ఇక అప్పటి వరకూ ఉన్న రికార్డ్ లు కూడా పెద్దరాయుడు బ్రేక్ చేసిందట.
అప్పటిదాకా ఘరానా మొగుడు మూవీ పై ఉన్న రికార్డులన్నీ కూడా తిరిగి రాయడంతో పాటు ఈ సినిమా 39 కేంద్రాల్లో 100 రోజులు ఆడి.. శతదినోత్సవం జరుపుకుంది. ఈసినిమాలో నటించిన సౌందర్యకు హీరోయిన్ గా ప్లస్ అయ్యింది పెదరాయుడు. ఇలా మోహన్ బాబు సినిమా దెబ్బకు మెగాస్టార్ చిరంజీవి సినిమా డిజాస్టర్ అయ్యింది.
Also Read:46 ఏళ్లకు ప్రెగ్నెంట్ అయిన నటి, స్టార్ కమెడియన్ భార్య సంగీత క్యూట్ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్
- 1995 releases
- Big Boss
- Chiranjeevi
- Megastar
- Mohan Babu
- News Telugu
- Peddarayudu
- Peddarayudu success
- Telugu cinema
- Telugu cinema news
- Telugu movie news
- Telugu movies
- Telugu news
- blockbuster films
- box office disaster
- film industry
- hit vs flop
- movie competition
- record-breaking
- rivalry
- rivalry between Chiranjeevi and Mohan Babu

