MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • సౌందర్య ని మోహన్ బాబు హత్య చేయించాడా? నేనే సాక్ష్యం అంటూ కంప్లైంట్ చేసిన వ్యక్తి ఎవరు?

సౌందర్య ని మోహన్ బాబు హత్య చేయించాడా? నేనే సాక్ష్యం అంటూ కంప్లైంట్ చేసిన వ్యక్తి ఎవరు?

Soundarya s Death Controversy : సౌందర్య మరణం సహజ మరణం కాదా? సౌందర్యను స్టార్ నటుడు మోహన్ బాబు హత్య చేయించారా? ఆమె మరణించిన 20 ఏళ్ళ తరువాత పోలీసులకు కంప్లైయింట్ ఇచ్చిన ఆ వ్యక్తి ఎవరు? నిజం ఎంత? 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 11 2025, 01:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

Soundarya s Death Controversy : తెలుగు సినిమాకు మరో సావిత్రి అంటే సౌందర్య అనే చెప్పాలి. అంత పద్దతిగా, ఎటువంటి ఎక్స్ పోజింగ్ లేకుండా సినిమాలు చేస్తూ స్టార్ డమ్ సాధించడం అంత తేలికైన పనికాదు. దాదాపు తెలుగు ,తమిళ భాషల్లో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన సౌందర్య.. పెళ్ళైన తరువాత హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న టైమ్ లో.. ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. 

Also Read: మోహన్ బాబు వల్ల బోల్తా కొట్టిన చిరంజీవి సినిమా, బాక్సాఫీస్ దగ్గర విలవిల్లాడిన మెగా మూవీ ?
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆతరువాత రాజకీయాల్లోకి ఎంటర్ అయిన సౌందర్య.. హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. సౌందర్య మరణంతో ఇండస్ట్రీ షాక్ తిన్నది. ఇక సౌందర్య మరణించి దాదాపు 20 ఏళ్ళు పైనే అవుతోంది. ఆమె మరణం ప్రమాదం వల్లనే అని అంతా ఫిక్స్ అయిన తరుణంలో.. ఇన్నేళ్ళకు.. సౌందర్యది సహజమరణం కాదు, ఆమెను హత్య చేయించారు అంటూ ఓ వ్యక్తి బయటకు వచ్చాడు. అంతే కాదు షాకింగ్ విషయం ఏంటంటే, సౌందర్యను టాలీవుడ్ స్టార్ మోహన్ బాబు హత్య చేయించాడంటూ ఆరోపణలు చేస్తున్నాడు. 

Also Read:బిగ్ బాస్ తెలుగు టీమ్ కు విజయ్ దేవరకొండ కండీషన్లు, సీజన్ 9 కోసం రౌడీహీరో రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

36

సౌందర్యది సహజ మరణం కాదా? మోహన్ బాబు నిజంగా హత్య  చేయించారా? ఎందుకు కోసం ఇలా జరిగి ఉంటుంది. కారణం ఏంటి? నిజా  నిజాలేంటి? సౌందర్యకు సంబంధించి హైదరాబాద్ లో ఉన్న ఆస్తి కోసం మోహన్ బాబు కావాలనే సౌందర్యను హత్య చేయించారంటు ఓ వ్యక్తి ఆరోపణలు చేస్తున్నాడు. ప్రస్తుతం మోహన్ బాబు హైదరాబద్ లోని శంషాబాద్ సమీపంలోని జల్ పల్లిలో పెద్ద ఇంట్లో ఉంటున్నారు. 

Also Read:అల్లు అర్జున్ కు షాక్ , పుష్ప2 రికార్డ్స్ ను బ్రేక్ చేసిన ఛావా మూవీ, ఎలా సాధ్యం అయ్యింది?

46

అయితే ఆ భూమి, ఇల్లు సౌందర్య ఆస్తి, ఆ భూమిని సౌందర్య ఫ్యామిలీ నుంచి మోహన్ బాబు కొన్నట్టు సమాచారం. అయితే అది ఆయన కొనలేదని.. సౌందర్య ఫ్యామిలీ నుంచి కబ్జా చేశారని ఆ వ్యక్తి ఆరోపణ. ఇంతకీ ఎవరు అతను. మోహన్ బాబుపై చేసిన పిర్యాదు ఏంటి.

ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఏదురు గట్ల చిట్టిబాబు ఈ ఆరోపణలు చేస్తున్నాడు.  సినీనటి సౌందర్యను హత్య చేయించింది మంచు మోహన్ బాబు అంటూ కలెక్టర్ ఖమ్మం రూరల్ ఏసిపికి అతను  ఫిర్యాదు చేశాడు.

ఈ ఫిర్యాదులో మంచు మోహన్ బాబు వల్ల తనకు ప్రాణహాని ఉందని ప్రాణ రక్షణ కల్పించాలని అతను కోరాడు. అంతే కాదు దివంగత హీరోయిన్  సౌందర్యకు శంషాబాద్ జల్లేపల్లిలో ఆరు ఎకరాల గెస్ట్ హౌస్ ఉందని దానిని తమకు అమ్మాలంటూ మోహన్ బాబు అడగగా సౌందర్య సోదరుడు అమర్నాథ్ నిరాకరించాడని తెలిపారు.

Also Read:రష్మికను బెదిరించలేదు, మాట మార్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు.

56

దాంతో వారిపై ఈ విషయంలో కక్షపెంచుకున్న మోహన్ బాబు బెంగళూరు నుంచి తెలంగాణ పార్టీ ప్రచారానికి వస్తున్న వారిని సాక్షాలు దొరక్కుండా హెలికాప్టర్ ప్రమాదంలో హత్య చేయించాడని,  ఆ తర్వాత జల్లేపల్లిలో ఉన్న ఆరు  ఎకరాల గెస్ట్ హౌస్ ని అక్రమంగా అనుభవిస్తున్నాడని చిట్టిబాబు తన కంప్లైయింట్ లో తెలిపాడు. అసలే ఫ్యామిలీ గొడవలతో సతమతం అవుతున్న మోహన్ బాబుపై మరో బాంబ్ పేలినట్టు అయ్యింది. ఇక అంతటితో ఆగకుండా చిట్టిబాబు మరో డిమాండ్ కూడా చేస్తున్నాడు. 

66

మంచు టౌన్ లో ఉన్న ఆ గెస్ట్ హౌస్ ను వెంటనే  ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, అంతేకాక మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ కి న్యాయం చేయాలని, ఈ విషయంలో  మోహన్ బాబు పై తగు చర్యలు తీసుకోవాలని కంప్లైయింట్ లో కోరాడు చిట్టి బాబు. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అంత ధైర్యంగా ఓ వ్యక్తి వచ్చి ఇలా కంప్లైయింట్ చేయడం, ఆరోపణలు చేయడం తో అందరు ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ విషయంలో మంచు మోహన్ బాబు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved