MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాజమౌళి రాక్షసుడు అని కామెంట్ చేసిన హీరో ఎవరు..? అంత మాట ఎందుకు అన్నాడు..?

రాజమౌళి రాక్షసుడు అని కామెంట్ చేసిన హీరో ఎవరు..? అంత మాట ఎందుకు అన్నాడు..?

టాలీవుడ్ కు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకవచ్చిన దర్శకుడు రాజమౌళి.. కాని ఆయన్ను మాత్రం తన టీమ్ తో పాటు.. టాలీవుడ్ లో కొంత మంది రాక్షసుడని, టార్చర్ అని, మ్యాడ్ అని అంటుంటారట.. అసలెవరు జక్కన్నననుఅంత మాట అనేది..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 25 2024, 11:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Rajamouli

Rajamouli

రాజమౌళి.. తెలుగు సినిమా తరాలపాటు మర్చిపోలేని పేరు. చిరస్థాయిగా నిలిచిపోయే పేరు. అట్టడుగున ఉన్న మన సినిమాను ఎవరికి అందనంత ఎత్తులో తీసుకెళ్ళి పెట్టాడు. బాలీవుడ్ తనకు తిరుగు లేదు అని విర్రవీగుతుంటే.. సినిమాతోనే బాలీవుడ్ కు బుద్దిచెప్పి పక్కన కూర్చొబెట్టాడు. ఇప్పుడు ఇండియానసినిమా అంటే తెలుగు సినిమానే అనేలా హాలీవుడ్ స్థాయిలో నిరూపించాడు రాజమౌళి. 

 

మహేష్ బాబు పిల్లల ఆపరేషన్ల కోసం ఎన్ని కోట్లు ఖర్చుపెడుతున్నాడో తెలుసా..?
 

27

స్టూడెంట్‌ నెంబర్‌ 1 నుంచి ట్రిపుల్‌ ఆర్‌ దాకా.. ఓటమి ఎరుగని దర్శకుడిగా రికార్డ్ సాధించిన  రాజమౌళి.. ప్రతీ సినిమాకు తాను ఎదుగుతూ.. హీరోర ఇమేజ్ ను పెంచుతూ.. టాలీవుడ్ రేంజ్ ను కూడా పైకి తీసుకోస్తూ ఉన్నాడు జక్కన్న. తన సినిమాలకు మాత్రమే కాదు.. డైరక్టర్‌గా టాలీవుడ్ సిల్వర్‌ స్క్రీన్‌ మీద కూడా తన మార్క్  స్టాంప్‌ వేశారు రాజమౌళి. హాలీవుడ్ లో జేమ్స్ కామరూన్ తో పాటు.. దిగ్గజ దర్శకుల చేత శభాష్ అనిపించుకున్నాడంటే.. రాజమౌళి ఏంటో తెలుస్తుంది. 

జయా బచ్చన్ ను పెళ్ళాడటానికి అమితాబచ్చన్ పెట్టిన కండిషన్ వింటే ఆశ్చర్యపోతారు..?

37

ఆయన సినిమా తీయ్యడం అంటే.. ఒక్క సీన్ అయినా సరే పర్ఫెక్ట్ గా వచ్చే వరకూ వదలరు. అది తుమ్మైనా..దగ్గు అయినా.. ఏదైనా సరే కరెక్ట్ గా రావాల్సిందే. సినిమాను అంత అందంగా చెక్కుతారు కాబట్టే.. టాలీవుడ్ రాజమౌళికి జక్కన్న అనే బిరుదు ఇచ్చింది. ఇక రాజమౌళి పనిని టార్చెర్ గా ఫీల్ అయ్యేవారు కూడా ఉన్నారు. స్టార్ హీరోలతో పాటు.. జక్కన్న ఫ్యామిలీ కూడా ఆయనపై ఇలాంటి కామెంట్లే చేస్తుంటారు. మరీ ముఖ్యంగా స్టార్ హీరో జూనియర్ఎన్టీఆర్. 

శ్రీ నవల్ కిషోరీ : ఇలా కూడా ఫేమస్ అవుతారా..?

47

ఎన్టీఆర్ అయితే రాజమౌళితో పనిచేయడం టార్చర్ అని సరదాగా అంటుంటారు. జక్కన్న పని రాక్షసుడు. హీరోలనుంచి ఏం కావాలో అది రాబట్టుకోవడం అతనికి తెలుసు అని.. ఆర్ఆర్ఆర్ ఇంటర్వ్యూస్ లో ఎన్నో సార్లు అన్నారు. ఒక్క సీన్ పర్ఫెక్షన్ కోసం పదిసార్లు తీసి.. రెండో టేక్ ఓకే చేసిన రోజులు ఉన్నాయంటూ.. తారక్ ఓ సందర్భంలో చెప్పారు. రాజమౌళిని రాక్షసుడు అని అనే ధైర్యం.. క్లోజ్ నెస్ ఎన్టీఆర్ కు ఉండబట్టే.. అలా అన్నారు. 

57

స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి వీరిద్దరు ఇండస్ట్రీలోకలిసి ట్రావెల్ చేస్తున్నారు. రాజమౌళి ఎక్కువ సినిమాలు చేసిన హీరో కూడా ఎన్టీఆర్ మాత్రమే. ఆయన ఒక సారి చేసిన హీరోతో..మరో సినిమా చేయడు. కాని ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ ఇలా నాటుగు సినిమాలు చేశారు. ఆతరువాత ప్రభాస్ తో ఛత్రపతి, బాహుబలి రెండు సినిమాలు.. టొటల్ గా ప్రభాస్ తో మూడు సినిమాలు చేశారు. 

67

ఇక ప్రభాస్ కూడా జక్కన్నను మ్యాడ్ అంటుంటాడు. సినిమాకోసం పిచ్చిగా పనిచేస్తుంటాడు.. పనిలోకి దిగితే.. రాజమౌళికి ఎవరైనా ఒక్కటే.. ఎంత పెద్ద స్టార్ అయినా.. వారి దగ్గర నుంచి తనకు కావల్సింది పిండుకుంటాడటారు. ఇలా రాజమౌళి పనితనం గురించి స్టార్స్ ఎందరో ఎన్నో చెప్పారు. తాజాగా ఆయన మీద డాక్యుమెంటరీ  కూడా చేశారు. అందులో ఆయనతో పనిచేసని హీరోల దగ్గర నుంచి రాజమౌళి పక్కన ఎప్పుడూ ఉండే రమ, కీరవాణి, లంాటి వారి అభిప్రాయాలు కూడా చూపించబోతున్నారు. 

77

ఇక రాజమౌళి నెక్ట్స్ మహేష్ తో సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. ఈసారి పాన్ వరల్డ్ ను ఆశ్చర్యపరచబోతున్నాడు. అడ్వెంచర్ మూవీతో రాబోతున్నాడు. కాస్త టైమ్ తీసుకున్నా.. రాజమౌళి సినిమాపై అందరికి నమ్మకం ఎక్కువగానే ఉంటుంది. మరి మహేష్ ను ఎలా చూపించబోతున్నాడు.. ఈసారి ఎన్ని ఆస్కార్ లు సాధిస్తారు అనేది చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
120 ఏళ్ళు నిద్రపోవాల్సిన వ్యక్తి మధ్యలోనే మేల్కొంటే ? ఓటీటీలో చూడాల్సిన టాప్ 5 స్పేస్ థ్రిల్లర్ మూవీస్ ఇవిగో
Recommended image2
Tollywood: రాజ‌శేఖ‌ర్‌కు నిజంగానే గోటీల ఫ్యాక్ట‌రీ ఉందా.? ఫ‌స్ట్ టైమ్ స్పందించిన సీనియ‌ర్ హీరో
Recommended image3
Tanushree Dutta: కొత్త హీరోయిన్లను వ్యభిచారంలోకి దించుతారు.. బాలీవుడ్‌పై తనుశ్రీ దత్తా సంచలన ఆరోపణలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved