- Home
- Entertainment
- Ram Charan Daughter Klin Kaara: రామ్ చరణ్ ను నాన్న అనుకుండా..క్లీంకార ఏమని పిలుస్తుందో తెలుసా? మెగా పవర్ స్టార్ చెప్పిన సీక్రెట్..
Ram Charan Daughter Klin Kaara: రామ్ చరణ్ ను నాన్న అనుకుండా..క్లీంకార ఏమని పిలుస్తుందో తెలుసా? మెగా పవర్ స్టార్ చెప్పిన సీక్రెట్..
Ram Charan Daughter Klin Kaara: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముగ్గురు బిడ్డలకు తండ్రి అయిన సంగతి తెలిసిందే. ఆయన గారాల పట్టి క్లింకారా గురించి ఎప్పుడూ ఏదో ఒక విషయం చెపుతూనే ఉంటారు. ఇంతకీ క్లింకారా చరణ్ ను నాన్న అని కాకుండా ఏమని పిలుస్తుందో తెలుసా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. స్క్రీన్ పై తన మాస్ యాక్షన్, అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న చరణ్, నిజ జీవితంలో మాత్రం ఎంతో సరదాగా ఉంటూ.. ఫ్యామిలీ లైఫ్ కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎంత బిజీగా ఉన్నా.. తన ఫ్యామిలీకి మాత్రం అనుకున్న టైమ్ ను కేటాయిస్తారు చరణ్. తన పిల్లలతో హ్యాపీగా ఆడుకుంటూ.. వారి అల్లరిని చూసి చాలా సంతోషపడుతుంటారు. ముఖ్యంగా తన ముద్దుల కూతురు క్లింకారా మాటల వినడమంటే చరణ్ కు చాలా ఇష్టం.
గారాల కూతురు క్లింకారా మాటలంటే ఎంతో ఇష్టం.
గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ముచ్చటగా ముగ్గురు బిడ్డలు ఉండగా.. మొదటి సంతానం.. ముద్దుల కూతురు క్లిన్ కారా కొణిదెల (Klin Kaara Konidela) రాకతో మెగా ఇంటిలో సందడి మొదలయ్యింది. ఆర్వాత కొంత కాలానికి కవల పిల్లలు పుట్టడంతో.. ఆ ఆనందం రెట్టింపయింది.
అయితే ముగ్గురు పిల్లలలో క్లింకారా పెద్దది కావడంతో ముద్దు ముద్దు మాటలతో.. అందరిని సంతోషపెడుతుంటుంది. ఆమె మాటలకు మెగా ఫ్యామిలీ అంతా మురిసిపోతుంటారట. ఆమధ్య కాలంలో ఓ వేదికపై తన గారాల పట్టి కూతురు క్లింకారా గురించి రామ్ చరణ్ చాలా విషయాలు పంచుకున్నారు. తనను క్లింకారా ముద్దుగా ఏమని పిలుస్తుందో వెల్లడించారు.
నాన్న స్థానంలో 'పెద్ది'
ఇంట్లో తన కూతురు తనను ఎలా పిలుస్తుందో చెబుతూ రామ్ చరణ్ ఒక నవ్వు తెప్పించే ఆసక్తికర విషయాన్నివెల్లడించారు. పెద్ది సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడిన రామ్ చరణ్.. పెద్ది సినిమా వల్ల తనకు ఎంత పేరు వచ్చిందో చెపుతూ.. "నా ఇంట్లో నేను స్వయంగా అనుభవించాను. నా బుడ్డది క్లిన్ కారా.. 'పెద్ది' సినిమా రిలీజ్ అయ్యే వరకు నన్ను 'నాన్న.. నాన్న' అని పిలిచేది. కానీ, సినిమా విడుదలైన తర్వాత ఆ పిలుపే మారిపోయింది. ఇప్పుడు నన్ను 'ఏయ్ పెద్ది' అంటుంది. ఆ పిల్లకి నాన్న అంటే ఏంటో తెలియదు, ఇప్పుడు 'పెద్ది నాన్న' అంటోంది. నా పేరు, నాన్న అనే పదం మర్చిపోయి అందరికీ ఇప్పుడు 'పెద్ది' ఒక్కటే గుర్తుండిపోయింది" అంటూ చరణ్ అన్నారు.
ఉపాసన, రామ్ చరణ్ ప్రయాణం
రామ్ చరణ్, ఉపాసన చిన్ననాటి స్నేహితులు. పెళ్లి తర్వాత టాలీవుడ్‌లో మోస్ట్ లవబుల్ కపుల్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వీరి వివాహం అయిన పదేళ్ళ తర్వాత క్లింకారా పుట్టింది. ఉపాసన ఒకవైపు తన వ్యాపార బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోవైపు సమాజ సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారు. అలాగే కూతురు క్లిన్ కారా తో పాటు తమ కవల పిల్లల పెంపకం విషయంలోనూ ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.
ప్రకృతికి దగ్గరగా, సంస్కృతి సాంప్రదాయాలతో కూడిన వాతావరణంలో పాపను పెంచుతున్నట్లు ఉపాసన ఎన్నో సందర్భాల్లో తెలిపారు. రామ్ చరణ్ ఎంత బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ, సమయం దొరికినప్పుడల్లా తన కుటుంబంతో, ముఖ్యంగా ముగ్గరు పిల్లలతో సరదాగా గడపడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు.













