MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Jeffrey Epstein: ఎవ‌రీ జెఫ్రీ, ఆ ఐల్యాండ్‌లో ఏం చేశాడు? OTTలో భయంకర సత్యాలను తెలిపే డాక్యుమెంటరీ

Jeffrey Epstein: ఎవ‌రీ జెఫ్రీ, ఆ ఐల్యాండ్‌లో ఏం చేశాడు? OTTలో భయంకర సత్యాలను తెలిపే డాక్యుమెంటరీ

Jeffrey Epstein: ప్ర‌పంచ‌వ్యాప్తంగా  జెఫ్రీ ఎప్‌స్టీన్‌..పేరు మారుమోగుతోంది. ఇంతకీ ఇత‌ను ఏం చేశాడ‌న్న విష‌యాలు తెలుసుకోవాల‌ని ప్ర‌తీ ఒక్క‌రిలో ఆస‌క్తి పెరుగుతోంది. కాగా ఎప్‌స్టీన్‌పై ఇప్పటికే ఓ డాక్యుమెంట‌రీ విడుద‌లైంద‌ని మీకు తెలుసా.?

1 Min read
Author : Narender Vaitla
Published : Feb 10 2026, 11:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న ఫిల్తీ రిచ్
Image Credit : Netflix/YT

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న ఫిల్తీ రిచ్

ఇటీవల ప్రపంచవ్యాప్తంగా Epstein Files విడుదలతో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కోట్ల పేజీలు, వేల ఫొటోలు, వీడియోలతో కూడిన ఈ డాక్యుమెంట్స్ జెఫ్రీ ఎప్‌స్టీన్‌ చేసిన భయంకర నేరాలను మరోసారి ప్రజల ముందుకు తెచ్చాయి. ఇదే సమయంలో అతని జీవితంపై ఆధారపడిన ఒక డాక్యుమెంటరీ సిరీస్ మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. అదే Jeffrey Epstein: Filthy Rich.

25
ఈ డాక్యుమెంట‌రీ ఎప్పుడు విడుద‌లైంది.?
Image Credit : Poster

ఈ డాక్యుమెంట‌రీ ఎప్పుడు విడుద‌లైంది.?

ఈ డాక్యుమెంటరీ సిరీస్ 2020 మే 27న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అప్పట్లో పెద్దగా చర్చకు రాకపోయినా, తాజాగా Epstein Files వెలుగులోకి రావడంతో మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం Netflix Top 10 ట్రెండింగ్ లిస్ట్‌లో తొమ్మిదో స్థానంలో నిలవడం విశేషం. ప్రముఖ రచయిత జేమ్స్ పాట‌ర్‌స‌న్ రాసిన ఫిల్తీ రిచ్ అనే పుస్త‌కం ఆధారంగా ఈ డాక్యుమెంట‌రీని రూపొందించారు.

Related Articles

Related image1
Home Hacks: ఖాళీ బియ్యం సంచుల‌ను ప‌డేస్తున్నారా.? ఇలా చేస్తే అంద‌మైన బ్యాగులు ర‌డీ
Related image2
Egg Business: కోడి గుడ్ల‌తో కోట్లు కురుస్తాయి.. జీవితాన్ని మార్చే బిజినెస్ ఐడియా
35
మొత్తం ఎన్ని ఎపిసోడ్లు ఉన్నాయి?
Image Credit : Poster

మొత్తం ఎన్ని ఎపిసోడ్లు ఉన్నాయి?

జెఫ్రీ ఎప్‌స్టీన్‌: ఫిల్తీ రిచ్ డాక్యుమెంట‌రీలో మొత్తం 4 ఎపిసోడ్లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ దాదాపు ఒక గంట నిడివి ఉంటుంది. ఈ డాక్యుమెంట‌రీకి ద‌ర్శ‌కుడిగా లిసా బ్రాయంట్ ప‌నిచేశారు. ఈ సిరీస్ ఎలాంటి డ్రామా లేకుండా, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా నిజాలను నేరుగా చూపిస్తుంది.

45
ఈ డాక్యుమెంటరీలో ఏమేం చూపించారు?
Image Credit : X

ఈ డాక్యుమెంటరీలో ఏమేం చూపించారు?

ఈ డాక్యుమెంటరీ మొదటి ఎపిసోడ్ నుంచే షాకింగ్ విషయాలతో మొదలవుతుంది. బాధిత యువతుల వాంగ్మూలాలు, డబ్బు, పలుకుబడి ఉపయోగించి ఎప్‌స్టీన్‌ ఎలా తప్పించుకున్నాడు. పోలీస్ వ్యవస్థలో జరిగిన లోపాలు, ప్రైవేట్ ఐలాండ్ కథ, 2019లో మళ్లీ అరెస్ట్ అయిన విధానం వంటి విష‌యాల‌ను నిజ జీవిత వీడియోలు, ఓల్డ్ ఫుటేజ్ ద్వారా చూపించారు.

55
ఎక్కడ చూడొచ్చు?
Image Credit : Getty

ఎక్కడ చూడొచ్చు?

ఈ డాక్యుమెంటరీ Netflixలో మాత్రమే అందుబాటులో ఉంది. Epstein Files ద్వారా బయటపడుతున్న కొత్త నిజాలను అర్థం చేసుకోవడానికి ఈ సిరీస్ చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. న్యాయ వ్యవస్థ ఎలా విఫలమైంది, శక్తివంతులు ఎలా తప్పించుకున్నారు అన్నదానికి ఇది స్పష్టమైన నేపథ్యం ఇస్తుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వినోదం
ఓటీటీ
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
కార్తీక దీపం దీప రెమ్యునరేషన్ ఎంత? వంటలక్క ఆస్తులు తెలిస్తే కళ్లు తిరగాల్సిందే..ప్రేమి విశ్వనాథ్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్..?
Recommended image2
Illu Illalu Pillalu Today Episode Feb 10: విశ్వక్‌ పై పగ తీర్చుకుంటున్న అమూల్య, వల్లి పొర్లు దండాలు
Recommended image3
హీరోయిన్లతో నాకు పర్సనల్ కంఫర్ట్ అవసరం లేదు, అలాంటి వాళ్లంటే చిరాకు..రియల్ లవర్స్ లా ఉండాలి, చిరు కామెంట్స్
Related Stories
Recommended image1
Home Hacks: ఖాళీ బియ్యం సంచుల‌ను ప‌డేస్తున్నారా.? ఇలా చేస్తే అంద‌మైన బ్యాగులు ర‌డీ
Recommended image2
Egg Business: కోడి గుడ్ల‌తో కోట్లు కురుస్తాయి.. జీవితాన్ని మార్చే బిజినెస్ ఐడియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved