MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • పెళ్ళికి ముందే రాజశేఖర్ తో ఒకే రూమ్ లో గడిపా..ఇండస్ట్రీకి చెందిన అమ్మాయితో ఆయనకి మ్యాచ్ ఫిక్సయింది, కానీ

పెళ్ళికి ముందే రాజశేఖర్ తో ఒకే రూమ్ లో గడిపా..ఇండస్ట్రీకి చెందిన అమ్మాయితో ఆయనకి మ్యాచ్ ఫిక్సయింది, కానీ

టాలీవుడ్ లో అన్యోన్యంగా జీవించే దంపతుల్లో రాజశేఖర్, జీవిత జంట గురించి కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు ప్రాణం కన్నా మిన్నగా భావించి జీవిస్తున్నారు. తమ కుమార్తెలు శివాని, శివాత్మికలని హీరోయిన్స్ చేసే పనిలో ఉన్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 27 2024, 05:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టాలీవుడ్ లో అన్యోన్యంగా జీవించే దంపతుల్లో రాజశేఖర్, జీవిత జంట గురించి కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు ప్రాణం కన్నా మిన్నగా భావించి జీవిస్తున్నారు. తమ కుమార్తెలు శివాని, శివాత్మికలని హీరోయిన్స్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం శివాని, శివాత్మిక ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటూ రాణిస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అయితే జీవిత రాజశేఖర్ ప్రేమ కథ గురించి చాలా సార్లు చాలా వార్తలు వచ్చాయి. కానీ జీవిత స్వయంగా రాజశేఖర్ తో ప్రేమ గురించి బోల్డ్ గా కొన్ని విషయాలు బయట పెట్టింది. పెళ్ళికి ముందు నుంచే ఆయనతో తానూ ఎమోషనల్ గా అటాచ్ అయి ఉన్నట్లు తెలిపింది. రాజశేఖర్ కి నాకు మధ్య ఎలాంటి సీక్రెట్స్ లేవు. నేను కరెక్ట్ గా ఉన్నంతవరకు నా భర్త పిల్లలు నన్ను వదిలిపెట్టి వెళ్లారు. కాంప్రమైజింగ్ గా, అర్థం చేసుకునే విధంగా ఉంటే భార్య భర్తల మధ్య ఎలాంటి ఇబ్బందులు ఉండవు. 

 

37

రాజశేఖర్ గారికి అభిమానులు, బయట పనులు, సినిమాలు ఎన్ని ఉన్నా నాతో చెప్పకుండా ఏమి చేయరు. ఒకవేళ ఎవరైనా అమ్మాయి ఆయన్ని పిలిస్తే ఆ విషయం కూడా నాతో చెబుతారు. అలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి అని జీవిత నవ్వుతూ అన్నారు. 

 

47

మేమిద్దరం ప్రేమించుకుంటున్నప్పుడు పెళ్లి గురించి ప్రస్తావన వస్తే.. పెద్దల అంగీకారంతోనే పెళ్లి అని ఇద్దరం ఫిక్స్ అయ్యాం. నేను బోల్డ్ గా చెప్పేస్తున్నా. పెళ్ళికి ముందే నేను రాజశేఖర్ గారితో ఒకే రూమ్ లో గడిపా. ఇద్దరం కలసి జీవించాం. మా ఇద్దరి క్లోజ్ రిలేషన్ వల్ల ఇండస్ట్రీలో మా గురించి పెద్ద హాట్ టాపిక్ అయింది. రాజశేఖర్ గారితో బోల్డ్ గా జీవించినప్పటికీ.. ఒక వేళ పెళ్లి కాకుంటే నా పరిస్థితి ఏంటి అని నేను భయపడలేదు. 

57

ఒకరోజు నేను మా అమ్మకి కూడా చెప్పా. అమ్మ నేను ఇంతే.. ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నా సరే.. ఆయనతో రిలేషన్ లో ఉంటా. ఆయన పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఎలా ఒప్పిస్తారు అనేది ఆయన ఇష్టం. కానీ నేను ఇంతే అని చెప్పేశా. ఇండస్ట్రీకి చెందిన ఒక అమ్మాయితో రాజశేఖర్ గారికి పెళ్లి ఫిక్స్ అయింది. 

67
jeevitha

jeevitha

ఒక రోజు ఆ అమ్మాయి నన్ను కలవాలని అడిగిందట. రాజశేఖర్ గారు ఆ అమ్మాయిని తీసుకువచ్చారు. ఇద్దరికీ రాజశేఖర్ అంటే బాగా ఇష్టం ఏర్పడింది. కానీ ఆ అమ్మాయి నా గురించి వాళ్ళ పేరెంట్స్ తో చర్చించిందట.  వాళ్ళ పేరెంట్స్ రాజశేఖర్ గారికి కండిషన్ పెట్టారు. ఈ పెళ్లి జరగాలంటే నువ్వు జీవితని వదిలేయాలి అని అన్నారు. ఆమెతో మాట్లాడకూడదు అని చెప్పారట. 

77

కానీ రాజశేఖర్ నా వైపు నుంచి తప్పు ఉండదు. కానీ మాట్లాడకుండా ఉండడం మాత్రం కుదరదు అని చెప్పేశారు. దీనితో వాళ్ళు చర్చించుకుని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ తర్వాత రాజశేఖర్ గారికి యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్ లో రాజశేఖర్ గారికి నేనే సేవలు చేశా. హాస్పిటల్ నుంచి మా ఇంటికి కూడా వెళ్ళలేదు. రాజశేఖర్ గారి ఇంటికే వెళ్ళా. ఆయన పూర్తిగా కోలుకునే వరకు వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. ఆ తర్వాత మేం డిసైడ్ అయి పెళ్లి చేసుకున్నట్లు జీవిత తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: ఎస్పీ బాలు సంగీతం అందించిన సినిమా.. సుమన్, విజయశాంతి లకు చుక్కలు చూపించిన చిరంజీవి
Recommended image2
Irumudi 4 Days Collections: సోమవారం ఇరుముడి ఊరమాస్‌.. రవితేజ సినిమాకి మైండ్‌ బ్లాక్‌ అయ్యే కలెక్షన్లు
Recommended image3
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved