- Home
- Entertainment
- అడల్ట్ కామెడీ కోసమే జబర్థస్త్ చూస్తున్నారు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ పై ఇంద్రజ షాకింగ్ కామెంట్స్,
అడల్ట్ కామెడీ కోసమే జబర్థస్త్ చూస్తున్నారు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ పై ఇంద్రజ షాకింగ్ కామెంట్స్,
జబర్థస్త్ ను అడల్ట్ కామెడీ కోసమే చూస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ హీరోయిన్ ఇంద్రజ. తనపై కూడా డబుల్ మీనింగ్ కామెంట్లు వచ్చాయన్నారు. ఇక ఈ షో గురించి.. ఆడియన్స్ గురించి ఇంద్రజ చేసిన సంచలన కామెంట్స్ ఏంటంటే?

యమలీల లాంటి అద్భుతమైన సినిమాలు చేసిన హీరోయిన్ ఇంద్రజ. అనుకోకుండా ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన ఈ భామ.. స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా వరుస సినిమాలు చేసింది. దాదాపు దశాబ్దానికి పైగా మంచి స్టార్ డమ్ చూసింది ఇంద్రజ. ఆతరువాత హీరోయిన్ గా అవయాశాలు తగ్గిపోవడంతో.. పెళ్ళి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ కే పరిమితం అయ్యింది.
Also Read: ప్రభాస్ తమ్ముడు హీరోగా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా? ఇండస్ట్రీలో ఎందుకు సక్సెస్ అవ్వలేదు?
పెళ్ళి తరువాత చాలా కాలానికి ఇంద్రజ మళ్లీ యాక్టీవ్ అయ్యింది. మరీ ముక్యంగా బుల్లితెరపై ఆమెకు అవకాశాలు వరుసగా వచ్చి చేరాయి. ఈ టైమ్ లోనే రోజా జబర్థస్త్ ను వదిలి వెళ్ళడంతో.. ఆ సీట్ లోకి చాలా మంది స్టార్స్ వచ్చి కొన్నాళ్లకే వెళ్ళీపోతూ ఉన్నారు. ఇక ఓ సందర్భంగా జబర్థస్త్ జడ్జిగా స్టార్ట్అయిన ఇంద్రజ.. ఆ సీట్ కు పరిమితం అయ్యారు. రోజా తరువాత జబర్థస్త్ కు ఇంద్రజనే ఫిక్స్ అయ్యారు.
Also Read: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కు ముహూర్తం ఫిక్స్, ఈసారి రెండు నెలలు ముందే సందడి
చాలా నిదానంగా ప్రశాంతంగా జడ్జిమెంట్ ఇస్తూ.. అందరిని ఆకట్టుకుంటున్నారు ఇంద్రజ. దాంతో మల్లెమాల వారు ఆమెను పర్మినెంట్ చేయడంతో పాటు.. శ్రీదేవి డ్రామాకంపెనీని కూడా ఇద్రజ చేతుల్లోనే పెట్టారు. దాంతో బుల్లితెరపై అందులోనే ఈటీవీలో ఏ కార్యక్రమం జరిగినా ఇంద్రజ కనిపిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్స్ వల్ల ఆమెకు మళ్లీ టాలీవుడ్ లో డిమాండ్ పెరిగి పోయింది. వరుసగా సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి.
Also Read:సమంత ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా ? అతనితో బ్రేకప్ ఎలా అయ్యింది?
యంగ్ హీరోలకు తల్లి పాత్రల్లో కనిపిస్తోంది ఇంద్రజ. ఈక్రమంలో ఇంద్రజ రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా క్లీన్ ఇమేజ్ ఉన్న ఇంద్రజ, అడల్ట్ కామెడీ షో అయిన జబర్థస్త్ ఎలా చేస్తున్నారు. ఎలా ఉండగలుగుతున్నారు అన్న ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు ఆమె. జబర్ధస్త్ లో అడల్ట్ కామెడీ ఉంటుంది, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఉంటాయి. అంతేందుకు నామీద కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేస్తుంటారు.
Indraja
ఈ షో మీద రకరకాల కామెంట్లు వినిస్తున్నాయి. విమర్శలు కూడా వస్తున్నాయి. మరి అలాంటి అప్పుడు ప్యూస్ కూడా అంతే ఎక్కువగా వస్తున్నాయి కదా. విమర్శలు వస్తున్నప్పుడ వ్యూస్ ఎలా వస్తున్నాయి. అది కూడా చూడాలి కదా. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జబర్థస్త్ ఒక్కటే కాదు సినిమాలు, సిరీస్ లు ఇలా ఎంటర్టైన్మెంట్ రంగం అంతట ఇది ఉంది. డబుల్ మీనింగ్ అనేది ప్రతీ చోట ఉంది.
Also Read:మహేష్ బాబుకు రాజమౌళి బిగ్ ట్విస్ట్ , సూపర్ స్టార్ కు టార్చర్ తప్పదా?
జబర్థస్త్ లో నా మీద కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేస్తుంటారు. మరీ పరిది దాటి వాళ్ళు కూడా ఏమీ అనరు కాబట్టి నేను దాన్ని తీసుకోగలుగుతున్నా అన్నారు ఇంద్రజ. ప్రస్తుతం ఇటువంట అడల్ట్ కంటెంట్ ను చీ కొడుతూనే పదిరెట్లు వాళ్లే చూస్తున్నారు అంటూ సంచలన వ్యాక్యలు చేశారు ఇంద్రజ.
Also Read: