సమంత ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా ? అతనితో బ్రేకప్ ఎలా అయ్యింది?
నాగచైతన్యతో ప్రేమ పెళ్ళి, విడాకులు అయిపోయి సింగిల్ లైఫ్ ను గడుపుతోంది సమంత. అయితే సమంతకు నాగచైతన్య ఫస్ట్ లవ్ కాదా? సమంత ఇంతకు ముందు కూడా ప్రేమలో పడిందా..?

దాదాపు ఏడేళ్లు ప్రేమించుకున్నారు సమంత నాగచైతన్య. కాని ఎవరికి కాస్త కూడా అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డారు. వీళ్ళిద్దరు ప్రకటించే వరకూ ఎవరికి ఈ విషయం తెలియదు. ఏం మాయచేశావే సినిమాతో ఇద్దరు పస్ట్ టైమ్ కలిసి పనిచేశారు. ఈసినిమాతో ఇద్దరు ప్రేమలో పడ్డారు. కాని ఈ విషయం ఎవరికి తెలియకుండా సీక్రేట్ మెయింటేన్ చేశారు ఇద్దరు స్టార్లు. 2017 లో పెళ్ళి చేసుకున్న ఈ జంట.
Also Read: ప్రభాస్ తమ్ముడు హీరోగా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా? ఇండస్ట్రీలో ఎందుకు సక్సెస్ అవ్వలేదు?
నాలుగేళ్లు కలిసి జీవించారు. మధ్యలో మనస్పర్ధలు రావడంతో 2021 లో విడాకులు ప్రకటించారు. అన్నేళ్ళు ప్రేమించుకున్న ఈ జంట.. కలిసి నాలుగేళ్లు కూడా ఉండలేకపోయారు. ఇక సమంత తో విడాకులు తరువాత మరో హీరోయిన్ శోభితతో మళ్ళీ ప్రేమలో పడిన చైతూ.. ఈమధ్యే మళ్లీ పెళ్ళి చేసుకున్నాడు. సమంత మాత్రం ఒంటరిగా జీవిస్తోంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు అంటూ తన లైఫ్ తాను హ్యాపీగా లీడ్ చేస్తోంది.
ఈక్రమంలో సమంతకు సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. నాగచైతన్యతో సమంత ఫస్ట్ లవ్ కాదా? సమంత చైతూ కంటే ముందే ప్రేమలో పడిందా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం సమంతను కాలేజీ రోజుల్లో ఒకతను ప్రేమించాడట, ఎప్పుడూ ఆమెనే ఫాలో అయ్యేవాడట. కాని ఎప్పుడూ సమంతను ప్రేమిస్తున్నా అని మాత్రం చెప్పలేదట. ఇలాంటి వింత వన్ సైడ్ లవ్ స్టోరీ సమంత జీవితంలో జరిగిందని తెలుస్తోంది.
Also Read: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కు ముహూర్తం ఫిక్స్, ఈసారి రెండు నెలలు ముందే సందడి
ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. ఒక ఇంటర్వ్యూలో సమంతనే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించినట్టు ప్రచారం జరుగుతుంది. ఆతరువాత ఆమె ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత హీరో సిద్దార్ధ్ తో ప్రేమ పెళ్ళి రూమర్లు ఎక్కవుగా వినిపించాయి. వీరిద్దరు గుళ్ళు గోపురాలు కూడా కలిసి తిరగడంతో వీరు పక్కాగా పెళ్ళి చేసుకుంటారు అని ప్రచారం జరిగింది.
Also Read: మహేష్ బాబుకు రాజమౌళి బిగ్ ట్విస్ట్ , సూపర్ స్టార్ కు టార్చర్ తప్పదా?
Samantha Ruth Prabhu,Naga Chaitanya,Sobhita Dhulipala,Naga Chaitanya and Sobhita Dhulipala
కాని సమంత మాత్రం నాగచైతన్యను పెళ్ళి చేసుకుంది. ఇక ప్రస్తుతం సమంత బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. నాగచైతన్య మాత్రం రీసెంట్ గా తండేల్ మూవీతో సూపర్ హిట్ కొట్టాడు. ఈసినిమా 100 కోట్లు కలెక్షన్స్ ను దాటింది. శోభితతో కలిసి హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు నాగచైతన్య.