జారిపోతున్న చీరకట్టులో శ్రీలీలా అందాలు, హాట్ డోస్ పెంచుతూ.. హీటెక్కిస్తున్న బ్యూటీ..
హీరోయిన్ గా అవకాశాలుతక్కువగా ఉన్నటైమ్ లో సోషల్ మీడియాపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు హీరోయిన్ శ్రీలీల.. కాని తాజాగా ఆమె దృష్టంతా.. నెట్టింట్లో ఫాలోయింగ్ పెంచుకోవడంపైనే ఉంది.
హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉంద శ్రీలీల. వరుస సినిమాలతో ఏమాత్రం ఖాళీ దొరకని పరిస్థితి ఆమెది. దాదాపు డజను సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఈ ఏడాదితో పాటు.. వచ్చే ఏడాది కూడా ఆమె హవా నడవబోతోంది. స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా మెరుపులు మెరిపించబోతోంది శ్రీలీల.
అయితే ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాలు సక్సెస్ ను బట్టి శ్రీలీల కెరీర్ ఆధారపడి ఉంటుంది. తెలుగులో ఒక ఊపు ఊపి ప్రస్తుతం కామ్ అయ్యింది కృతి శెట్టి. ఆమె అవకాశాలు కూడా శ్రీలీల కొట్టేసిందన్న విమర్శ ఉంది. ఈక్రమంలో శ్రీలీల ప్లాప్ లు రాకుండా చూసుకుంటే.. ప్రస్తుతం ఉన్న సినిమాలు రిలీజ్ అయ్యే వరకు ఆమె స్టార్ హీరోయిన్ గా అవతరించడం ఖాయం అంటున్నారు.
ఇక తనకు పోటీ ఎవరూ ఉండకూడదు అనుకుంటుందో ఏమో.. సోషల్ మీడియాలో కూడా రెచ్చిపోతోంది. రోజు రోజుకు హాట్ డోస్ పెంచేస్తోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన శారీ పిక్స్ నెట్టింట మంటలు రేపుతున్నాయి. జారిపోతున్న చీరను.. హద్దు దాటనీయకుండా.. ఆపుతూ.. హాట్ హాట్ అందాలు సగమే చూపిస్తూ రెచ్చిపోతోంది బ్యూటీ.
ముందు ముందు ఇంకాస్త ముందుకెళ్ళి. . అందాల విందు చేయడానికి రెడీగా ఉంది శ్రీలీలా. ఇక తాజాగా ఆమె రెండు సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. రామ్ హీరోగా బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన స్కంద మూవీలో నటించింది శ్రీలీలా.. ఆమె నటనకు మంచి పేరు వచ్చింది కాని.. సినిమా మాత్ర యావరేజ్ గా నిలిచింది.
ఇక తాజాగా బాలయ్య బాబు కూతురుగా నటించి మెప్పించింది శ్రీలీల.. భాగవంత్ కేసరి సినిమాలో.. విజ్జి పాపగా ఆమెనటన అద్భుతం అని చెప్పాలి. ఈసినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. స్కంద నష్టాన్ని ఈ మూవీ కవర్ చేసిందని చెప్పాలి. అయితే భగవంత్ కేసరిలో హీరోయిన్ గా కాకుండా.. బాలయ్య కూతురిగా నటించి సాహసమే చేసింది శ్రీలీల.
హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ.. స్టార్ ఇమేజ్ వచ్చే టైమ్ లో.. కూతిరి పాత్ర చేయడం మంచిది కాదు అని చాలా మంది వద్దు అన్నారట. కాని శ్రీలీల ఈ పాత్ర చేసి.. చూపించింది బ్యూటీ. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు జోడీగా గుంటూరు కారం సినిమాలో నటిస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కూడా శ్రీలీల నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బన్నీతో త్రివిక్రమ్ చేయాల్సిన సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా అడిగినట్టు తెలిసింది. ఆమె డేట్స్ అజెస్ట్ అవ్వవని చెప్పడంతో.. శ్రీలీలకు అల్లు అర్జున్ ఓ చిన్న క్లాస్ తీసుకున్నట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.