నిజంగానే సెక్స్ చేశారా.. వివాదాస్పదమైన మూవీ సీన్స్!
నటీనటులు సినిమానే ప్రాణంగా జీవిస్తుంటారు. అందుకే సినిమా కోసం ఏం చేయడానికైన సిద్ధపడుతుంటారు. కథ డిమాండ్‌ను బట్టి ఎలాంటి రిస్క్ అయిన చేస్తుంటారు. వీటిలో శృంగార సన్నివేశాల్లోనూ కథ డిమాండ్‌ను బట్టి హద్దులు దాటి నటించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో శృంగార సన్నివేశాల కోసం నిజంగానే శృంగారంలో కూడా పాల్గొన్నారు.
అలాంటి సన్నివేశాల విషయంలో భాషా బేదాలు కూడా పెద్దగా లేవు. హాలీవుడ్‌లోనే ఇలాంటివి జరుగుతాయని అంతా భావిస్తారు. కానీ ఇండియన్ సినిమాలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి.
కౌశిక్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన బోల్డ్ బాలీవుడ్ మూవీ గాండు. కాస్త శృతిమించిన శృంగార సన్నివేశాలతో తెరకెక్కిన ఈ సినిమాలో అను బ్రత, బెంగాళీ నటి మధ్య రీల మధ్య హాట్ హాట్ సన్నివేశాలను రూపొందించారు. వాటిలో ఓ సన్నివేశం కోసం లీడ్ యాక్టర్స్ నిజంగానే శృంగారంలో పాల్గొన్నట్టుగా అప్పట్లో వార్తలు వినిపించాయి.
అదే విధంగా హాట్ టాపిక్‌గా మారిన మరో బెంగాళీ మూవీ ఛత్రక్. బెంగాళీ సినీ రంగంలో బోల్డ్ యాక్ట్రస్ట్ గా పేరు తెచ్చుకున్న పొలీ డామ్ అనే నటి ఈ సినిమాలో ఓ రొమాంటిక్ సన్నివేశంలో కోసం నిజంగానే శృగారంలో పాల్గొందన్న వార్త అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది.
కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన అమెరికన్ మూవీ షార్ట్ బస్ షూటింగ్ సందర్భంగా కూడా నటీనటులు రియల్ గా రొమాన్స్ చేశారు. హాలీవుడ్ సినిమాల్లో ఇలాంటి వార్తలు తరుచూ వినిపిస్తుంటాయి.
ఇటాలియన్ నటి ఏసియా అర్జెంటో జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా స్కార్లెట్ దివా. ఈ సినిమాలో ఆమె రియల్ లైఫ్ రొమాన్స్‌కు సంబంధించి తెరకెక్కించిన సన్నివేశాల్లో నటీనటులు రెచ్చిపోయిన మరీ నటించారు.
2004లో రిలీజ్ అయిన బ్రిటీస్ రొమాంటిక్ డ్రామా 9 సాంగ్స్. ఈ సినిమాలో నటీనటులు కెయిరన్ ఓబ్రియన్, మార్గో స్టిల్లే లు నిజంగానే శృంగారం చేస్తుండగా సన్నివేశం చిత్రీకరించటంతో అప్పట్లో పెను దుమారం లేపింది.
బాలీవుడ్‌లోనూ ఇలాంటి సంఘటన జరిగింది. కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన మాయా మీమ్సాబ్ సినిమా కోసం ఓ ఘాటు రొమాంటిక్ సీన్ తెరకెక్కించారు. షారూఖ్, దీపా సాహిలు న్యూడ్‌గా నటించిన ఈ సన్నివేశంలో ఇద్దరు నిజంగానే శృంగారంలో పాల్గొన్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే సినిమా నుంచి ఆ సన్నివేశాన్ని తొలగించారు.
ఇండిపెండెంట్ బెంగాళీ సినిమాగా తెరకెక్కిన మూవీ కాస్మిక్ సెక్స్. ఓ సెక్స్ బానిస కథతో అమితాబ్ చక్రవర్తి తెరకెక్కించిన ఈ సినిమాలో కూడా నటీనటులు నిజంగా శృంగారంలో పాల్గొన్నట్టుగా అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
మరో వివాదాస్పద చిత్రం సిన్స్ విషయంలో కూడా ఇలాంటి ఆరోపణలో ఉన్నాయి. ఓ మత గురువు యువతులతో శృంగారంలో పాల్గొనటం అనే కథతో తెరకెక్కిన ఈ సినిమాలో కూడా నిజంగా శృంగారం చేస్తుండా చిత్రీకరించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి.
1972లో రిలీజ్ అయిన అమెరికన్ బ్లాక్ కామెడీ మూవీ పింక్ ఫ్లెమింగోస్ కూడా అప్పట్లో ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొంది. ఈ సినిమాలో వచ్చిన లాంటి మితిమీరిన శృంగార సన్నివేశాలు తరువాత ఏ సినిమాలో కూడా రాలేదు.