8 కోట్ల బడ్జెట్, 30 కోట్ల కలెక్షన్స్ తో లాభాల పంట పండించిన సినిమా ఏదో తెలుసా?
కేవలం 8 కోట్ల బడ్జెట్ తో తీసిన అతి చిన్న సినిమా.. అనూహ్యంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 30 కోట్ల కలెక్షన్స్ ను వసూలు చేస్తోంది. లాభాల పంట పండిస్తోన్న ఆ సినిమా ఏంటో తెలుసా?

ఒక చిన్న సినిమాలు పెద్ద విజయం సాధించింది. ప్రస్తుతం చాలా సినిమాల పరిస్థితి అదే కదా.. అందులో పెద్ద వింత ఏముంటుంది అనుకోకండా. ఈసినిమా మంచి విజయంతో పాటు..లాభాల పంట కూడా పండిస్తోంది. ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర విజయ పరంపర కొనసాగిస్తున్న ఆ చిన్న సినిమా ఏంటి.? అంత విజయం ఎలా సాధ్యం అయ్యింది చూసుకుంటే?
Also Read: 46 ఏళ్లకు ప్రెగ్నెంట్ అయిన నటి, స్టార్ కమెడియన్ భార్య సంగీత క్యూట్ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్
2018లో సోహమ్ షా నటించిన నిర్మించిన తుంబాడ్ తరహాలోనరే లేటెస్ట్ మూవీ 'క్రేజీ' (Crazxy) కూడా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర దుమ్మురేపుతోన్న ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ కేవలం రూ.8.4 కోట్లు మాత్రమే. కానీ ఇప్పుడు ఏకంగా రూ.30 కోట్లు కొల్లగొట్టడానికి రెడీగా ఉంది. సినిమా కోసం పెట్టిన బడ్జెట్ కంటే 300% ఎక్కువ లాభాలు రాబట్టనుంది.
Also Read: 300 కోట్ల హీరోను అల్లు అర్జున్ మూవీలో విలన్ గా ప్లాన్ చేస్తోన్న అట్లీ
సోహమ్ షా గతంలో తుంబాడ్' సినిమా రికార్డును కూడా ఇది బ్రేక్ చేసేలా కనిపిస్తోంది. కంటెంట్ ఉన్న సినిమాలతో ఆడియన్స్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు మంచి కంటెంట్ తో పాటు కమర్షియల్ గా కూడా సోహమ్ స్ట్రాంగ్ అవుతున్నాడు. క్రేజీ' సినిమాను చాలా తక్కువ బడ్జెట్‌లో తీశారు.
ప్రొడక్షన్ కోసం రూ.4.4 కోట్లు, పబ్లిసిటీ, డిస్ట్రిబ్యూషన్ కోసం ఇంకో 4 కోట్లు.. మొత్తం కలిపి 8.4 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అయితే తెలివిగా ఈసినిమా రిలీజ్ కు ముందే ప్రీరిలీజ్ బిజినెస్ లో భాగంగా డిజిటల్, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ అమ్మేసి 15 కోట్లు సంపాదించారు టీమ్.
Also Read: ఎన్టీఆర్, ఏఎన్నార్ కాదు ఫస్ట్ ఫారెన్ లో షూటింగ్ చేసిన తెలుగు హీరో ఎవరు? ఏ సినిమా?
కథ స్ట్రాంగ్ గా ఉంటే చాలు.. కంటెంట్ ఉంటే ఖర్చుతో పనిలేదు..లాభాలు అవే వస్తాయి అని టాలీవుడ్ లో బలగం లాంటి కొన్ని సినిమాలు నిరూపించాయి. ఇక ఇఫ్పుడు బాలీవుడ్ లో కూడా ఈ టైప్ సినిమాలకు ఆధరణ స్టార్ట్ అయ్యింది. భారీ బడ్జెట్ సినినిమాలు ఎలాగో నడుస్తాయి.
మధ్యలో ఇలాంటి సినిమాలు పడితేనే ప్రేక్షకులకు కాస్త కొత్తదనం అందుతుంది. ఆ విషయాన్ని 'క్రేజీ' సినిమా ప్రూవ్ చేసింది.'క్రేజీ' సినిమా రిలీజ్ అవ్వగానే మొదటి ఆరు రోజుల్లోనే రూ.6.50 కోట్లు వసూలు చేసింది. సినిమా అంటేనే వీకెండ్ భారీ గా వీక్ డేస్ లో తక్కువ కలెక్షన్లు వస్తుంటాయి. కాని ఈసినిమాకు వీక్ డేస్‌లో కూడా కలెక్షన్లు ఏ మాత్రం తగ్గట్లేదు.
ఈమూవీకి వస్తున్న రెస్పాన్స్ చూసి ఇంకా 20 కొత్త సిటీల్లో స్క్రీన్స్ పెంచారు. ప్రస్తుతం సినిమా చూస్తున్న జోరు చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర ఇంకో రూ.15-18 కోట్లు కలెక్ట్ చేసేలా ఉంది. ప్రిరిలీజ్ బిజినెస్ 15 కోట్లతో పాటు.. టోటల్ గా 30కోట్లకుపైగా కలెక్షన్ టార్గెట్ గా క్రేజీ మూవీ దూసుకుపోతుంది.