MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్, ఏఎన్నార్ కాదు ఫస్ట్ ఫారెన్ లో షూటింగ్ చేసిన తెలుగు హీరో ఎవరు? ఏ సినిమా?

ఎన్టీఆర్, ఏఎన్నార్ కాదు ఫస్ట్ ఫారెన్ లో షూటింగ్ చేసిన తెలుగు హీరో ఎవరు? ఏ సినిమా?

ఇప్పుడంటే వందల కోట్లు ఖర్చు పెట్టి ఫారెన్ లో పెద్ద పెద్ద సెట్లు వేసి సినిమాలు చేస్తున్నారు కాని. తెలుగులో ఫస్ట్ ఫారెన్ షూట్ చేసిన హీరో  ఎవరో తెలుసా? అసలు మొదటి సారి విదేశాల్లో షూటింగ్ చేసుకున్న సినిమా ఏది? 

3 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Mar 08 2025, 05:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రస్తుతం కన్నప్ప లాంటి సినిమాలు కంప్లీట్ గా  ఫారెన్ లోనే  షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. అది ఇప్పుడు పెద్ద విషయం కాదు. వందల కోట్ల బడ్జెట్ పెడుతుంటారు కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా వెళ్ళి షూటింగ్ చేసి వస్తుంటారు. కాని ఒకప్పుడు అలా కాదు. సినిమాలన్నీ స్టూడియోల్లోనో.. ప్రత్యేకంగా కొన్ని ఊర్లలోనో జరిగేవి. బయట కూడా ఎక్కడ పడితే అక్కడ షూటింగ్స్ చేసేవారు కాదు. ఇక ఆతరువాత కాలంలో రాను రాను మార్పులు జరిగాయి.  

Also Read: రొమాన్స్ చేయను, ముద్దు సీన్లు వద్దు, నాగార్జునకు కండీషన్లు పెట్టిన హీరోయిన్ ఎవరో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

పెద్ద సినిమా అయితేనే ఫారెన్ లో షూట్ కు వెళ్ళడం.. చిన్న బడ్జెట్ తో అయితే ఇక్కడే కానిచ్చేస్తూ వచ్చారు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చిన్నా పెద్దా సినిమాలని లేవు. ఏ సినిమా అయినా ఒక్క సీన్ అయినా షారెన్ లో చేయాల్సిందే. 9‌0స్ లో అయితే ముఖ్యంగా పాటలను ఖచ్చితంగా ఫారెన్ లోకేషన్స్ లో షూట్ చేసేవారు. ఇక  అసలు తెలుగులో మొదటిసారి ఫారెన్ షూట్ కు వెళ్ళిన సినిమా ఏంటి..? ఆ సినిమాకు హీరో ఎవరు..? 

Also Read: 300 కోట్ల హీరోను అల్లు అర్జున్ మూవీలో విలన్ గా ప్లాన్ చేస్తోన్న అట్లీ

36

 ప్ర‌స్తుతం  రోజుల్లో చాలా కామ‌న్ అయిపోయింది. నేచురల్ గా ఉండాలని చిన్న సన్నివేశాలకు కూడా  కోట్ల‌కు కోట్లు ఖ‌ర్చు పెట్టి  ఫారెన్ లొకేషన్లు వెతుక్కుంటూ వెళ్తున్నారు. అయితే ఓ నలబై యాబై ఏళ్ళ క్రితం మాత్రం  సినిమా షూటింగ్స్ అంటే స్టూడియోల్లో మాత్రమే జరిగేవి. అప్పట్లో  ఫారెన్ లో షూటింగ్ అంటే భయపడేవారు నిర్మాతలు. మరి అలాంటి రోజుల్లో కూడా  విదేశాల్లో షూటింగ్ జ‌రుపుకున్న ఫస్ట్ మూవీ ఏదో తెలుసా..? ఆ సినిమాకు హీరో ఎవరో తెలుసా..? 

Also Read: గోల్డెన్ స్పూన్ తో పుట్టిన టాలీవుడ్ రిచ్చెస్ట్ హీరో, స్టార్ డమ్ కు మాత్రం దూరంగా ఉన్న యంగ్ స్టార్ ఎవరు ?

46

ఆ సినిమా ఏదో కాదు  హరే కృష్ణ హలో రాధ. ఈసినిమాకు హీరో సూపర్ స్టార్ కృష్ణ. సి.వి.శ్రీధర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీ ప్రియ హీరోయిన్ గా నటించింది. రతి అగ్నిహోత్రి, కైకాల సత్యనారాయణ, సత్తార్, ప్రకాష్ లాంటి సీనియర్ నటులు సందడి చేసిన ఈసినిమా రెండు భాషల్లో రిలీజ్ అయ్యింది. అయితే తెలుగు లో కృష్ణ హీరోగా నటిస్తే.. తమిళంలో శివ చంద్రన్ హీరోగా నటించారు. ఈరెండు వర్షన్లు ఒకేసారి తెరకెక్కించడం విశేషం.

Also Read: రెండోసారి తల్లి కాబోతున్న అలియా భట్ ? పాప పేరు ఫిక్స్ అయిన హీరోయిన్?

56

శ్రీ భరణీ చిత్ర ఎంటర్‌ప్రైజెస్ బ్యాన‌ర్ పై ఏక‌కాలంలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ సినిమాను నిర్మించారు. తెలుగు వెర్షన్‌ లో కృష్ణ, తమిళ వెర్షన్‌ శివ చంద్రన్‌ హీరోలుగా నటించారు. ఈసినిమా మొదటిసారి ఫారెన్ షూట్ జరుపుకున్న తెలుగు సినిమాగా రికార్డ్ సాధించింది.

అయితే ఈసినిమాలో ఫారెన్ షూట్ ఏం చేశారంటే..? హరే కృష్ణ హలో రాధలో ఒక పాట, కొన్ని సన్నివేశాలు మినహా మూడొంతులు సినిమా మొత్తాన్ని  అమెరికాలోనే షూటింగ్ చేశారట.  

అప్పటికే కృష్ణతో బంధం పెంచుకున్న విజయనిర్మల.. ఈమూవీలో నటించకపోయినా.. ఆయనతో కలిసి  అమెరికాకు విజయనిర్మల కూడా వెళ్లారు. వంటల్లో స్పెషలిస్టు అయిన విజ‌య‌నిర్మ‌ల‌.. అమెరికాలో ఉన్నన్ని రోజులు టీమ్ కు ఆమే వంట కూడా చేసి పెట్టారట. 

Also Read: అల్లు అర్జున్ - స్నేహ రెడ్డి ఆస్తులు ఎన్ని కోట్లు? బన్నీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎక్కడ? ఐకాన్ స్టార్ సీక్రేట్ ఇవే

66

ఇక ఈసినిమాలో కృష్ణ అమెరికా సీన్స్ అద్భుతంగా ఉంటాయి. అప్పట్లో అమెరికా ఎలా ఉంటుందో  ఇప్పటి తరం జనాలకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఇక 1980 అక్టోబర్ 16న హరే కృష్ణ హలో రాధ  రిలీజ్ అయ్యింది. అప్పటికే కృష్ణ సినిమాల పరంగా చాలా రికార్డ్ సాధించారు. ఫస్ట్ కౌవ్ బాయ్ మూవీ, ఫస్ట్ కలర్ మూవీ, ఫస్ట్ యాక్షన్ హీరో.. ఇలా రికార్డ్స్ చాలా ఉన్నాయి కృష్ణ పేరుమీద. ఫస్ట్ ఫారెన్ షూటింగ్ రికార్డ్ కూడా కృష్ణకే దక్కింది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
 
5th T20 • NZ vs IND 2026
Live
NZNZ
-
INDIND
(15.0 ov)144/5
NZ chose to bowl.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu Rohit: నాగార్జునపై మండిపడుతున్న రోహిత్ ఫ్యాన్స్.. బిగ్ బాస్ చేసిన పనికి సోషల్ మీడియాలో ట్రోల్స్‌ దుమారం!
Recommended image2
Trivikram: నయనతార సినిమాని 10 నిమిషాలు చూసి ఆపేసిన త్రివిక్రమ్.. మాటల మాంత్రికుడు టచ్ చేయలేని జోనర్ ఇదే
Recommended image3
Bobbili Brahmanna Review: బాలకృష్ణకు చుక్కలు చూపించిన కృష్ణంరాజు సినిమా.. బొబ్బిలి బ్రహ్మన్న రివ్యూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved