MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 46 ఏళ్లకు ప్రెగ్నెంట్ అయిన నటి, స్టార్ కమెడియన్ భార్య సంగీత క్యూట్ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్

46 ఏళ్లకు ప్రెగ్నెంట్ అయిన నటి, స్టార్ కమెడియన్ భార్య సంగీత క్యూట్ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్

46 ఏళ్ల  వయసులో కాస్త లేట్ గా ప్రెగ్నంల్ అయ్యింది నటి సంగీతం, నటుడు రెడిన్ కింగ్స్లీ భార్య సంగీత  మొదటిసారిగా తన ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ నిర్వహించారు.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 09 2025, 01:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

తమిళ చిత్ర పరిశ్రమలో హాస్య నటుడిగా రాణిస్తున్నాడు రెడిన్ కింగ్స్లీ. అతను తమిళంలో కోలమావు కోకిల, డాక్టర్, జైలర్ వంటి అనేక బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో ఫేమస్ అయ్యాడు. 40 ఏళ్లు పైబడినప్పటికీ పెళ్లి కాకుండా సింగిల్ గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో 2023 డిసెంబర్ లో 46 ఏళ్ల సీరియల్ నటి సంగీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రెడిన్ కింగ్స్లీ. వీరి వివాహం గుడిలో నిరాడంబరంగా జరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రెడిన్ కింగ్స్లీ భార్య సంగీత

రెడిన్ కింగ్స్లీ భార్య సంగీత

ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం రెడిన్ కింగ్స్లీ భార్య సంగీత గర్భవతి అనే వార్త బయటకు వచ్చింది. దీంతో భార్యకు ఘనంగా సీమంతం చేసి తాము త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు రెడిన్ కింగ్స్లీ. ఇదిలా ఉండగా, నిండు గర్భిణిగా ఉన్న సంగీత కడుపులో బిడ్డతో ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ నిర్వహించింది.

 

34
సంగీత ప్రెగ్నెన్సీ ఫోటోషూట్

సంగీత ప్రెగ్నెన్సీ ఫోటోషూట్

రెడ్ డ్రెస్ లో సంగీత రకరకాల ఫోజులు ఇస్తూ..  చేసిన ఈ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఒక ఫోటోలో తనకు పుట్టబోయేది అబ్బాయా లేక అమ్మాయా అని అడుగుతున్నట్లుగా రెండు పోస్టర్లు చేతిలో పట్టుకుని ఫోజులిచ్చింది సంగీత. దీనికి మీకు కవల పిల్లలు పుడతారని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

44
రెడిన్ కింగ్స్లీ భార్య గర్భవతి

రెడిన్ కింగ్స్లీ భార్య గర్భవతి

నటి సంగీతకు ప్రస్తుతం 46 ఏళ్లు. ఆమె విజయ్ నటించిన మాస్టర్ తో సహా కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించినప్పటికీ, ఆమెను అభిమానుల్లో పాపులర్ చేసింది చిన్ననాటి సీరియల్స్. ముఖ్యంగా సన్ టీవీలో ప్రసారమైన ఆనంద రాగం సీరియల్ లో విలన్ గా నటించింది సంగీత. ప్రస్తుతం గర్భవతి కావడంతో కొన్ని నెలల పాటు సీరియల్స్ లో నటించడం మానేసింది సంగీత. 

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Bhanupriya: ఎవరితో కలవదు, ఫ్రెండ్స్ కూడా లేరు, భానుప్రియపై ఖుష్బూ సంచలన కామెంట్స్
Recommended image2
Box Office: తొలిరోజే 100 కోట్ల ఓపెనింగ్స్ సాధించగలిగే ఐదుగురు హీరోలు.. టాప్‌లో ఎవరు?
Recommended image3
Folk Song : భార్యాభర్తలు కలిసి చూడాల్సిన ఫోక్ సాంగ్.. 14 కోట్ల వ్యూస్ తో యూట్యూబ్ నే షేక్ చేస్తున్న జానపదం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved