టాలీవుడ్ ను టెన్షన్ పెడుతున్న అనిరుధ్, నాలుగు సినిమాల పరిస్థితి ఏంటి..?
తెలుగు మేకర్స్ ను టెన్షన్ పెడుతున్నాడట స్టార్ మ్యుజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్. వరుస హిట్లతో బిజీ అవ్వడం, స్టార్ ఇమేజ్ రావడంతో ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశాడేమో అంటున్నారు సినీ జనాలు ఇంతకీ అతనేం చేవాడంటే.

తమిళంలో పాటు తెలుగులో కూడా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా వెలుగు వెలుగుతున్నాడు అనిరుధ్ రవిచందర్. జైలర్ సినిమాతో మనోడి స్థాయి మరింతగా పెరిగింది. అంతే కాదు తెలుగులో కూడా వరుసగా హిట్లు ఇస్తూ వస్తున్నాడు అనరుధ్.
రీసెంట్ గా ఎన్టీఆర్ దేవర సినిమాకు అనిరుధ్ ఇచ్చిన మ్యూజక్ అందరిని మెస్మరైజ్ చేసింది. తారక్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించింది. మరీ ముఖ్యంగా దేవర టైటిల్ సాంగ్ కు సినిమా హాళ్ళలో జనాలంతా గొంతుకలిపారంటే ఆ పాటలు ఎంతలా ప్రభావం చూపాయోఅర్ధం చేసుకోవచ్చు.
Also Read: 3500 కోట్ల ఆస్తి ఉన్న తెలుగు హీరో, 99 సినిమాలు చేస్తే 40 కి పైగా ప్లాప్ లే, ఎవరా స్టార్.?
అటు తమిళంలో ప్రస్తుతం జైలర్ 2, ఇండియాన్ 3, విజయ్ దళపతి చివరి సినిమాకు కూడా మనోడే సంగీతం అందిస్తున్న క్రమంలో తెలుగు సినిమాలపై ఫోకస్ తగ్గిందంటున్నారు. ఇప్పటికే తెలుగులో నాని హీరోగా నటిస్తున్న ప్యారడైస్ తో పాటు విజయ్ దేవరకొండ VD12, సినిమాలకు కూడా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈసినిమాల షూటింగ్స్ రన్నింగ్ లో ఉండగా.. వీటి టీజర్లకు రావల్సి మ్యుూజిక్ ఇంకా అందలేదట.
Also Read: నిర్మాతలను భయపెడుతున్న ఐశ్వర్య రాజేష్, రెమ్యునరేషన్ ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా
Anirudh Ravichander, megastar Chiranjeevi, చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, అనిరుథ్
తమిళంలో వరుస బిజీ షెడ్యూల్స్ వల్ల అనిరుధ్ తెలుగు సినిమాలపై ఫోకస్ చేయడంలేదు అంటున్నారు. దాంతో నాని, విజయ్ దేవరకొండ సినిమాల ప్రమోషన్లు.. చివరిలో రీరికార్డింగ్స్ విషయంలో కూడా ఇలానే లేట్ అవుతుందని ఫిక్స్ అవుతున్నారట టీమ్.
దీంతో ప్రమోషన్స్ లేట్ అవ్వడం, సినిమాలకు ఇబ్బందులు తప్పవంటున్నారు. మరోవైపు చిరంజీవి, శ్రీకాంత్ ఓదేల్, బాలయ్య మలినేని గోపీచంద్ సినిమాలకు కూడా అనిరుధ్ నే తీసుకోవాలి అని అడుగుతున్నారట.
Also Read:దేవర 2 షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్, ఎన్టీఆర్ కోసం భారీ స్కెచ్ వేసిన కొరటాల
కాని అతను మాత్రం ఇలా వరుస కమిట్ మెంట్స్ ఉండటంతో ఏం చెప్పకుండా దాంటేస్తున్నాడట. అంతే కాదు మ్యూజిక్ చేస్తాను కాని టైమ్ కావాలి అని అడుగుతున్నాడట. ఇక ఇప్పుడు అతని చేతిలో ఉన్న సినిమాలు అన్నా త్వరగా చేసి ఇవ్వాలని అండుగుతున్నారట మేకర్స్. ఇలా తెలుగు మేకర్స్ ను టెన్షన్ పెడుతున్నాడట అనిరుధ్. అయితే అనిల్ రావిపూడి లాంటి వారు మాత్రం బీమ్స్ లాంటి యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ.. హిట్లు కొడుతున్నారు. ఇలా తెలుగులో ఉన్న మంచి మ్యూజిక్ డైరెక్టర్లను ఎంకరేజ్ చేయాల్సి ఉంది.
Also Read:అజిత్ సినిమా వల్ల నా జీవితం నాశనం అయ్యింది.. హీరోయిన్ ఆవేదన
Also Read: చిరంజీవి, బాలయ్య కాంబోలో భారీ మల్టీ స్టారర్? కథ రాస్తున్న దర్శకుడెవరంటే?
Also Read:20 ఏళ్లుగా రహస్య సాధన చేస్తోన్న రజినీకాంత్, కారణం ఏంటోతెలుసా?