అజిత్ సినిమా వల్ల నా జీవితం నాశనం అయ్యింది.. హీరోయిన్ ఆవేదన
అజిత్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇస్తానని చెప్పి దర్శకుడు మోసం చేశాడంటూ ఓ హీరోయిన్ ఆవేదన వ్యాక్తం చేశారు. తనను చీట్ చేశారంటూ ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.

వీరం
సిరుతై శివ దర్శకత్వంలో అజిత్ నటించిన హిట్ చిత్రం వీరం. అన్నదమ్ముల అనుబంధం, ప్రేమ, కుటుంబ సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో అజిత్ కి జంటగా తమన్నా నటించింది.
Also Read: బాబాయ్ బాలయ్య, అబ్బాయి ఎన్టీఆర్, ఇద్దరితో రొమాన్స్ చేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా?
అజిత్ నటించిన సూపర్ హిట్ మూవీ.
వీరం సినిమా మొదటి భాగంలో అజిత్ సాధారణ నటనను ప్రదర్శించారు. కానీ రెండో భాగంలో యాక్షన్ సన్నివేశాల కారణంగా చాలా కష్టపడి నటించారు. ఈ చిత్రం మొత్తంలో అజిత్ తెల్ల పంచె, తెల్ల చొక్కాలోనే కనిపిస్తారు.
Also Read: 300 మందితో ఎఫైర్, హీరోయిన్లతో ప్రేమ వ్యవహారం నడిపిన స్టార్ హీరో
మోసం చేసిన శివ:
ఈ సినిమాలో నటించిన నటి మనోచిత్ర తనని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమా కోసం తనని సంప్రదించినప్పుడు తమన్నా నటిస్తున్నారని, కానీ ఒక సన్నివేశంలో ఆమె చనిపోతుందని, అందువల్ల అజిత్ కి జంటగా మీరే నటిస్తారని చెప్పి నటింపజేశారని ఆమె తెలిపారు.
Also Read:1600 కోట్లు వసూళ్ళు కేవలం 3 సినిమాలతోనే సాధించిన హీరోయిన్?
కన్నీరు పెట్టుకున్న మనోచిత్ర:
దర్శకుడు సిరుతై శివ దగ్గర ఈ విషయం చెప్పి ఏడ్చానని, ఏడుస్తున్నప్పుడు కూడా చాలా అందంగా ఉన్నారని చెప్పి తనని ఓదార్చారని, అజిత్ కోసం ఆ సినిమాలో నటించానని, ఆ సినిమా తన సినీ జీవితాన్ని నాశనం చేసిందని ఆమె ఆరోపించారు.
సంచలనం సృష్టించిన నటి
మనోచిత్ర 'ఇన్నొరువన్' అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. జైతో కలిసి నటించిన మరో సినిమిా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత నీర్ పరై, వీరం వంటి చిత్రాల్లో నటించారు. గత 4 సంవత్సరాలుగా సినిమా అవకాశాలు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. తన కెరీర్ ఇలా అవ్వడానికి వీరం సినిమానే కారణమని, శివ తనని మోసం చేశారని ఆమె చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి.
Also Read: కమెడియన్ బబ్లూ గుర్తున్నాడా.? అతను ఏమయ్యాడు, ఇప్పుడేం చేస్తున్నాడు తెలుసా..?