తెలుగు నిర్మాతలకు దడపుట్టిస్తున్న ధనుష్, మరీ అంత అంటే కష్టం బాసు..?
తెలుగులో స్టార్ హీరోలంతా పాన్ ఇండియా అంటుంటే..మన మేకర్స్ మాత్రం పక్క రాష్ట్రాల హీరోల వైపు చూస్తున్నారు. దుల్కర్, ధనుష్ లాంటి హీరోలకు డిమాండ్ పెరిగిపోయింది. ఇక ధనుష్ అయితే మన నిర్మాతలను భయపెడుతున్నాడట.

Top 10 Pan India Stars
టాలీవుడ్ రేంజ్ మారిపోయింది. తెలుగులో ఓ మోస్తర్ హీరోతో సినిమా చేయాలి అంటే నిర్మాతలకు వాళ్లు దొరకడంలేదు. తెలుగులో పాన్ ఇండియా హీరోలో ఎక్కువ అవ్వడంతో వారు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ.. బిజీగా ఉంటునాన్నారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా స్టార్స్ అంతా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు.
Also Read: నాగార్జునతో అనిల్ రావిపూడి కామెడీ మూవీ, ఆ సినిమాకు రీమేక్ చేయబోతున్నారా..?
ఇక కొంత మంది దర్శకులు మాత్రం మన హీరోలు చేతికి అందకపోవడంతో.. పక్క భాష హీరోలవైపు చూస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో.. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా తెలుగులో డైరెక్ట్ సినిమాలు చేస్తున్నారు. యంగ్ స్టార్స్ కూడా తెలుగులో సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే దుల్కర్, ధనుష్ టాలీవుడ్ కు అలవాటు పడ్డారు.
Also Read: బాలకృష్ణ కెరీర్ లో భారీ కలెక్షన్స్ సాధించిన టాప్ 10 సినిమాలు
dulkar
దుల్కర్ సల్మాన్ అయితే మలయాళంలో 10 కోట్ల హీరో అయితే.. తెలుగులో ఆయన 20 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. ఇలా వరుసగా వారు తెలుగులో సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. మన డైరెక్టర్లు కూడా కొంత మంది పక్క భాష హీరోలను తీసుకువచ్చి తెలుగులో డైరెక్ట్ సినిమాలు చేస్తున్నారు. వెంకీ అట్లూరి ఇప్పటికే దుల్కర్ తో, ధనుష్ తో తెలుగులో రెండు సినిమాలు చేశారు. ఈక్రమంలో ధనుష్ ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా చేస్తున్నారు.
Also Read: 40 ఏళ్ళు దాటినా పెళ్ళి చేసుకోని హీరోయిన్లు, అనుష్క నుంచి టబు వరకు.. బ్యాచిలర్ బ్యూటీస్
Dhanush
సార్’ సినిమాకి ధనుష్ .40 కోట్ల పారితోషికం తీసుకున్నాడు. ‘కుబేర’ కోసం రూ.50 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. వెంకీ అట్లూరి చేయబోతున్న ‘హానెస్ట్ రాజు’ అనే సినిమా కోసం రూ.60 కోట్ల డిమాండ్ చేస్తున్నాడట. దీంతో నిర్మాతలు దనుష్ తో సినిమా అంటే భయపడుతున్నారట. మన హీరోలు బిజీగా ఉన్నారని వారిని అడిగితే.. ఇంత డిమాండ్ చేస్తున్నారంటూ.. బాధపడుతున్నారట. కొంత మంది సినిమా చేయాలని కూడా వెనక్కి తగ్గుతున్నట్టుసమాచారం.