- Home
- Entertainment
- చిరంజీవిని ఏదో అన్నాడని.. కుట్లు పడేలా కొట్టిన అల్లు అరవింద్, బావ అంటే ఎందుకంత ప్రేమ.
చిరంజీవిని ఏదో అన్నాడని.. కుట్లు పడేలా కొట్టిన అల్లు అరవింద్, బావ అంటే ఎందుకంత ప్రేమ.
చిరంజీవి అంటే అల్లు అరవింద్ ఎంత ప్రేమో తెలుసా..? మెగాస్టార్ మీద గౌరవంతో అరవింద్ ఫైటింగ్ కూడా చేశారా..? బావను తిట్టిన వ్యక్తిని అరవింద్ ఏంచేశారోతెలుసా..?

చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో అల్లు ఫ్యామిలీ అండగా ఉంది. అలాగే చిరంజీవి స్టార్ హీరోగా మారిన తరువాత అల్లు ఫ్యామిలీకి కూడా అంతే అందగగా ఉన్నాడు. ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. అల్లు కారణంగా చిరంజీవికి మంచి అవకాశాలు వచ్చాయని ఇండస్ట్రీలో టాక్ ఉండేది. అది నిజమే అది ఎంత నిజమో.. చిరు స్టార్‌గా ఎదిగాక గీతా ఆర్ట్స్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయిందనేది కూడా అందరు ఒప్పుకోవలసిన నిజం. మెగాస్టార్ తో గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.
Also Read: 40 ఏళ్ళు దాటినా పెళ్ళి చేసుకోని హీరోయిన్లు, అనుష్క నుంచి టబు వరకు.. బ్యాచిలర్ బ్యూటీస్
నిర్మాతగా అల్లు అరవింద్ ఈస్థాయిలో ఉండగానికి ఈ సినిమాలు చాలా హెల్ప్ అయ్యాయి. మరీ ముఖ్యంగా విజేత, శుభలేఖ, ఆరాధన, రౌడీ అల్లుడు, యమకింకరుడు, పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు , అన్నయ్య, ఎస్పీ పరశురామ్, మాస్టర్, డాడీ ఇలా బ్లాక్‌బస్టర్ సినిమాలన్నీ గీతాఆర్ట్స్ నుంచి వచ్చినవే. ఈక్రమంలో చిరంజీవి. అల్లు అరవింద్ ఎంతో ప్రేమగా ఉంటారు. ఇద్దరు ఒకరికి మరొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకుంటారు.
Also Read: త్రిష షాకింగ్ నిర్ణయం, స్టార్ హీరోతో పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేయబోతుందా..?
ప్రస్తుతం మెగా అల్లు ఫ్యామిలీస్ మధ్య ఎంత కోల్డ్ వార్ జరుగుతున్నా.. చిరంజివి కాని, అరవింద్ కాని ఎక్కడ నోరు జారడంలేదు. వారిమధ్య స్నేహం కూడా అలానే ఉంది. కలిసి ఎన్నో కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. రీసెంట్ గా అల్లు అర్జున్ కేసులతో ఇబ్బందిపడితే.. మెగా ఫ్యామిలీ అండగా నిలిచింది. చిరంజీవి, నాగబాబు స్యయంగా బన్నీ ఇంటికి వెళ్ళి ఫ్యామిలీకి అండగా నిలిచారు. ఇది పక్కన పెడితే అరవింద్ కు చిరంజీవి అంటే ఎంతో ప్రేమ, గౌరవం. భావను ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోరు ఆయన.
Also Read: శంకర్ ఇక మార్పు రాదా..? ఇండియన్ 3 కోసం మరో ప్రయోగానికి రెడీ అవుతున్న గేమ్ ఛేంజర్ డైరెక్టర్
చాలా సార్లు ఇది నిరూపించబడింది కూడా. అంతే కాదు ఓ సందర్భంలో చిరంజీవిని ఎవరో ఏమో అన్నారని అతన్ని కొట్టారంట కూడా. అది కూడా కుట్లు పడేంతగా కొట్టారట. ఇంతకీ ఏం జరిగిందంటే..? ఈక్రమంలో చిరంజీవి మీద ఈగవాలినా ఊరుకునేవారు కాదు అరవింద్. ఆయన్ను ఎవరైనా ఏమైనా అంటే కోపం వచ్చేదట స్టార్ ప్రొడ్యూసర్ కు. ఓ సారి ఓ వ్యక్తి చిరంజీవని అసబ్యంగా తిడితే.. ఒకటి రెండు సార్లు చూసి.. మూడో సారి పిచ్చి పిచ్చిగా తన్నిపంపించాడట అరవింద్.
అప్పట్లో అల్లు రామలింగయ్య, చిరంజీవి, శ్రీదేవి, రావు గోపాలరావుకు కాల్షీట్లు చూసే ఓ పెద్దమనిషి ఉండేవాడట ఆయని.. కానీ ఆయన మందు తాగితే పిచ్చి పిచ్చిగా వాగేవాడట. ఓ రెండు సార్లు మందుకొట్టి చిరంజీవిని అసభ్య పదజాలంతో దూషించాడట. అప్పుడు తప్పని అరవింద్ సర్ధిచెప్పాడట. కాని మరోరెండు సార్లు ఇలాగే చేశాడటసదరు వ్యక్తి. చిరును పిచ్చిపిచ్చిగా తిడుతుంటే విని కోపం తట్టుకోలేకపోయాడట అరవింద్.
వెంటనే వాచ్,కళ్లజోడు వెనక ఉన్నవ్యక్తికి ఇచ్చి..ఆ వక్తిని పక్కకు తీసుకెళ్ళి వాయించాడట. దాంతో అతినికి 10కి పైగా కుట్లు కూడా పడ్డాయట. ఇంకోసారి ఇలా మాట్లాడితే.. ట్రీట్మెంట్ ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది అని వార్నింగ్ కూడా ఇచ్చాడట అరవింద్. ఈ విషయాన్ని అల్లు అరవింద్ ఓ సందర్భంలో చెప్పారు.